తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tillu Square Day 1 Collection: హనుమాన్ కంటే ఎక్కువగా టిల్లు స్క్వేర్ కలెక్షన్స్.. తొలి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Tillu Square Day 1 Collection: హనుమాన్ కంటే ఎక్కువగా టిల్లు స్క్వేర్ కలెక్షన్స్.. తొలి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Sanjiv Kumar HT Telugu

30 March 2024, 10:43 IST

  • Tillu Square Box Office Collection: హీరో సిద్ధు జొన్నలగడ్డ లేటెస్ట్ సినిమా టిల్లు స్క్వేర్ బాక్సాఫీస్ వద్ద తొలి రోజు బీభత్సం సృష్టించింది. ఊహించని కలెక్షన్లతో హవా చాటుతున్న టిల్లు స్క్వేర్ మూవీ నైజాం ఏరియాలో హనుమాన్ మూవీకి మించి వసూళ్లు సాధించింది.

హనుమాన్ కంటే ఎక్కువగా టిల్లు స్క్వేర్ కలెక్షన్స్.. తొలి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
హనుమాన్ కంటే ఎక్కువగా టిల్లు స్క్వేర్ కలెక్షన్స్.. తొలి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

హనుమాన్ కంటే ఎక్కువగా టిల్లు స్క్వేర్ కలెక్షన్స్.. తొలి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Tillu Square Box Office Collection: ఎన్నో అంచనాలతో, భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో మార్చి 29న అంటే శుక్రవారం ప్రేక్షకులు ముందుకు వచ్చిన క్రేజీ సినిమా టిల్లు స్క్వేర్ బాక్సాఫీస్ వద్ద అరాచకం సృష్టిస్తోంది. టిల్లు స్క్వేర్ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్, ప్రీమియర్ షోస్ ద్వారా భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. కానీ, వాటన్నింటికి మించి మొదటి రోజు కలెక్షన్ల సునామీ సృష్టించింది ఈ సినిమా.

ట్రెండింగ్ వార్తలు

Sunil: మ‌మ్ముట్టి సినిమాలో విల‌న్‌గా సునీల్ - ట‌ర్బోతో మ‌ల‌యాళంలోకి ఎంట్రీ - ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

Vijay Sethupathi: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కొత్త ప్రయోగం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా ఏసీఈ

NNS May 18th Episode: పుట్టింటికి అరుంధతి.. సరస్వతిని చంపేస్తున్న మనోహరి.. అందరికీ తెలియనున్న నిజం​​​!

బోల్డ్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇస్తోన్న టాలీవుడ్ డైరెక్ట‌ర్ - ముగ్గురు హీరోయిన్ల‌తో రొమాన్స్‌

టిల్లు స్క్వేర్ సినిమాకు తొలి రోజున వరల్డ్ వైడ్‌గా రూ. 23.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో రూ. 11.5 కోట్లు, కర్ణాటకలో రూ. 1 కోటి, తమిళనాడులో రూ. 2 లక్షలు, మిగతా రెస్టాఫ్ ఇండియాలో రూ. 15 లక్షల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు ప్రముఖ ట్రేడ్ సంస్థలు తెలుపుతున్నాయి. అలాగే ఓవర్సీస్‌లో తొలి రోజు రూ. 10 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించింది. నార్త్ అమెరికాలో సుమారుగా 1 మిలియన్ డాలర్స్ కొల్లగొట్టింది ఈ మూవీ.

అయితే, తొలి రోజున మీడియం రేంజ్ హీరోల స్థాయిలో సిద్ధు జొన్నలగడ్డ మూవీ టిల్లు స్క్వేర్ కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో మీడియం రేంజ్ హీరోల జాబితాలో సిద్ధు జొన్నలగడ్డ చేరిపోయాడు. నైజాం ఏరియాలో తొలి రోజున నాని దసరా మూవీ రూ. 6.78 కోట్లు, విజయ్ దేవరకొండ ఖుషీ సినిమా రూ. 5.15 కోట్లు సాధించాయి. వీటి తర్వాత నైజాం ఏరియాలో విడుదలైన తొలి రోజున అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూడో సినిమాగా టిల్లు స్క్వేర్ ఘనత సాధించింది.

నైజాం ఏరియాలో టిల్లు స్క్వేర్ చిత్రానికి రూ. 4.35 కోట్లు వచ్చాయి. ఈ సినిమా తర్వాత నాలుగో స్థానంలో లైగర్ రూ. 4.26 కోట్లు, ఐదో స్థానంలో హనుమాన్ రూ. 3.66 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి. అంటే తొలి రోజున హనుమాన్ కంటే ఎక్కువ కలెక్షన్స్ టిల్లు స్క్వేర్ సినిమా కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. ఇక తర్వాతి స్థానాల్లో వరుసగా ఇస్మార్ట్ శంకర్ రూ. 3.36 కోట్లు, స్కంద రూ. 3.23 కోట్లు, ఎమ్‌సీఏ రూ. 3.10 కోట్లు, లవ్ స్టోరీ రూ. 3.06 కోట్లు, ఉప్పెన రూ. 3.04 కోట్లు, డియర్ కామ్రెడ్ రూ. 2.75 కోట్లుగా ఉన్నాయి.

ఇదిలా ఉంటే, సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ తొలిసారి జంటగా నటించిన సినిమా టిల్లు స్క్వేర్. 2022లో విడుదలై భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డీజే టిల్లు మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కింది టిల్లు స్కేర్. ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. ఎన్నో అంచనాలతో తెరకెక్కిన టిల్లు స్క్వేర్ మూవీ ట్రైలర్, టీజర్, పోస్టర్స్, సాంగ్స్ మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. ఇక తాజాగా ఎట్టకేలకు మార్చి 29న శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన టిల్లు స్క్వేర్ మూవీ కలెక్షన్లతో అదరగొడుతోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం