Tillu Square Day 1 Box Office Collection: సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ తొలిసారి జంటగా నటించిన సినిమా టిల్లు స్క్వేర్. 2022లో విడుదలై భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డీజే టిల్లు మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కింది టిల్లు స్కేర్. ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. ఎన్నో అంచనాలతో తెరకెక్కిన టిల్లు స్క్వేర్ మూవీ ట్రైలర్, టీజర్, పోస్టర్స్, సాంగ్స్ మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. ఇక తాజాగా ఎట్టకేలకు మార్చి 29న శుక్రవారం థియేటర్లలోకి టిల్లు స్క్వేర్ మూవీ వచ్చేసింది.
అయితే, టిల్లు స్క్వేర్ మూవీకి అసలు షోస్ పడకుండానే భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. ఇప్పటికే బిజినెస్ పరంగా మంచి జోరు చూపించిన ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ముందస్తు బుకింగ్స్ భారీగా నమోదు అయినట్లు తెలుస్తోంది. ఒక్క హైదరాబాద్‌లో టిల్లు స్క్వేర్ మూవీకి రూ. 1.25 కోట్ల గ్రాస్ బుకింగ్స్ అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.5 కోట్ల గ్రాస్ అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు అయినట్లు సమాచారం.
ఇక ఓవర్సీస్‌లో ప్రీ టికెట్ సేల్స్ ద్వారా 250K డాలర్స్ మార్క్‌ను టిల్లు స్క్వేర్ అందుకుందని తెలుస్తోంది. నార్త్ అమెరికాలో 450K డాలర్స్ ప్రీమియర్స్ నుంచి వచ్చాయట. అలాగే ఆస్ట్రేలియాలో 47K డాలర్స్ వచ్చినట్లు సమాచారం. అయితే, ఇంకా డే పూర్తి కాలేదు. కాబట్టి ఇంకా ఎక్కువ కలెక్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇవే ఏరియాల్లో ఇంతకుముందు డీజే టిల్లుకు నార్త్ అమెరికాలో ఫుల్ రన్‌లో 554K, ఆస్ట్రేలియాలో 111K డాలర్స్ వచ్చాయి.
అంటే, డీజే టిల్లు కంటే ఎక్కవగానే టిల్లు స్క్వేర్ హవా చూపుతోందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఉన్న బుకింగ్స్‌ను బట్టి తెలుగు రాష్ట్రాల్లో టిల్లు స్క్వేర్ రూ. 3.5 కోట్ల నుంచి 4 కోట్ల రేంజ్‌లో ఓపెనింగ్స్ అందుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. మిడ్ రేంజ్ హీరోల్లో ఇలాంటి ఓపెనింగ్స్ ఎవరు అందుకోలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, టాక్‌ను బట్టి.. అలాగే ఆఫ్ లైన్ టికెట్స్‌ను బట్టి కలెక్షన్స్‌లో కాస్తా అటు ఇటుగా తేడా ఉండొచ్చు. ప్రముఖ ట్రేడ్ సంస్థ Sacnilk ప్రకారం టిల్లు స్క్వేర్ సినిమాకు మొదటి రోజు రూ. 1.56 కోట్ల నెట్ కలెక్సన్స్ వచ్చే అవకాశం ఉందని చెబుతోంది.
కాగా టిల్లు స్క్వేర్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 800 థియేటర్స్‌లో విడుదల కాగా.. తెలుగు రాష్ట్రాల్లో 550 థియేటర్లలో రిలీజ్ అయింది. ఇక టిల్లు స్క్వేర్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 22 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది. వరల్డ్ వైడ్‌గా రూ. 27 కోట్ల వరకు ప్రీ మార్కెట్ జరిగింది. దాంతో రూ. 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది. కాబట్టి టిల్లు స్క్వేర్ కమర్షియల్‌గా హిట్ కొట్టాలంటే రూ. 28 కోట్లు కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది.