తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tiger 3 Ott Release Date: టైగర్ 3 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ఎందులో స్ట్రీమింగ్ అంటే?

Tiger 3 OTT Release Date: టైగర్ 3 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ఎందులో స్ట్రీమింగ్ అంటే?

Hari Prasad S HT Telugu

05 December 2023, 7:35 IST

    • Tiger 3 OTT Release Date: టైగర్ 3 మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. బాక్సాఫీస్ దగ్గర అంచనాలకు తగినట్లు వసూళ్లు సాధించిన ఈ సినిమా.. నెల రోజుల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధం కావడం విశేషం.
ఓటీటీలోకి టైగర్ 3
ఓటీటీలోకి టైగర్ 3

ఓటీటీలోకి టైగర్ 3

Tiger 3 OTT Release Date: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ తెలిసిపోయింది. కత్రినా కైఫ్ ఫిమేల్ లీడ్ గా కనిపించిన ఈ సినిమా దీపావళి సందర్భంగా నవంబర్ 12న థియేటర్లలో రిలీజైంది. సరిగ్గా నెల రోజుల తర్వాత అంటే డిసెంబర్ 12న అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి రానుండటం విశేషం.

ట్రెండింగ్ వార్తలు

Pavithra Jayaram: టీవీ సీరియల్ నటి మృతి.. తిరిగి రావా అంటూ భర్త చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్

Kannappa Teaser Date: కన్నప్ప సినిమా టీజర్ రిలీజ్‍కు డేట్ ఖరారు.. ప్రతిష్టాత్మక వేదికపై..

Aha ott top trending: సుడిగాలి సుధీర్ షోనే టాప్.. ఆహా ఓటీటీలో టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు, షోలు ఇవే

Keerthy Suresh: కీర్తి సురేష్ దూకుడు మామూలుగా లేదు.. ఆ స్టార్ బాలీవుడ్ నటుడి పక్కన ఛాన్స్!

దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. టైగర్ 3 ప్రపంచవ్యాప్తంగా రూ.450 కోట్లకుపైగా వసూలు చేసింది. మనీష్ శర్మ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి తొలి రోజు మిశ్రమ స్పందన వచ్చింది. టైగర్ ఫ్రాంఛైజీలో వచ్చిన మూడో సినిమా కావడంతో భారీ అంచనాల మధ్య రిలీజైంది. పైగా ఈ సినిమాలో షారుక్ ఖాన్, హృతిక్ రోషన్ గెస్ట్ రోల్స్ లో కనిపించారు.

యశ్ రాజ్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కించింది. రెండో రోజుల్లోనే ఇండియాలో రూ.100 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించినా.. తర్వాత మెల్లగా తగ్గుతూ వచ్చాయి. తెలుగులోనూ రిలీజైనా.. ఇక్కడి ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదు. ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్ గా నటించిన విషయం తెలిసిందే.

బాలీవుడ్‍లో ప్రస్తుతం బాక్సాఫీస్ నంబర్లపై చర్చ సాగుతోంది. షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన పఠాన్, జవాన్ సినిమాలు ఈ ఏడాది రూ.1000కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించాయి. దీంతో సల్మాన్ ఖాన్.. టైగర్ 3 కూడా ఆ రేంజ్‍లో వసూళ్లను రాబడుతుందని అభిమానులు అంచనాలు వేశారు. కానీ ఈ మూవీ అందులో సగం కూడా వసూలు చేయలేకపోయింది. అయితే తాను బాక్సాఫీస్ నంబర్లను పెద్దగా పట్టించుకోనని సల్మాన్ అన్నాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం