తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Serials Trp Ratings: టాప్ 10 తెలుగు సీరియల్స్ ఇవే.. మీరు ఎన్ని ఫాలో అవుతున్నారు?

Telugu Serials TRP Ratings: టాప్ 10 తెలుగు సీరియల్స్ ఇవే.. మీరు ఎన్ని ఫాలో అవుతున్నారు?

Hari Prasad S HT Telugu

13 March 2023, 19:32 IST

    • Telugu Serials TRP Ratings: టాప్ 10 తెలుగు సీరియల్స్ ఏవో తెలుసా? వీటిలో మీరు ఎన్ని ఫాలో అవుతున్నారు? ప్రతివారం వచ్చే టీఆర్పీ రేటింగ్స్ ప్రకారం.. ఆ టాప్ లో ఉన్న సీరియల్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.
స్టార్ మాలో వస్తున్న బ్రహ్మ ముడి ప్రస్తుతం టాప్ రేటింగ్ సాధించిన సీరియల్
స్టార్ మాలో వస్తున్న బ్రహ్మ ముడి ప్రస్తుతం టాప్ రేటింగ్ సాధించిన సీరియల్

స్టార్ మాలో వస్తున్న బ్రహ్మ ముడి ప్రస్తుతం టాప్ రేటింగ్ సాధించిన సీరియల్

Telugu Serials TRP Ratings: ఎన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చినా.. కేబుల్ టీవీలు పోయి ఓటీటీలు వచ్చినా.. సీరియల్స్ కు ఉండే ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గదనడంలో సందేహం లేదు. ఇంట్లో ఆడవాళ్లకు ఇప్పటికీ సీరియల్స్ తోనే కాలక్షేపం. అందుకే ఈ సీరియల్స్ కు భారీగా టీఆర్పీ రేటింగ్స్ నమోదవుతూ ఉంటాయి.

ట్రెండింగ్ వార్తలు

Devara Fear Song: దేవర నుంచి వచ్చేసిన ఫియర్ సాంగ్.. పవర్‌ఫుల్‍గా ఫస్ట్ పాట: చూసేయండి

Adivi Sesh: హనీమూన్ ఎక్స్‌ప్రెస్ వదిలిన అడవి శేష్.. అన్నపూర్ణ ఏడెకరాల ప్రాంగణంలో అప్డేట్

Keerthy Suresh Kalki 2898 AD: కల్కి 2898 ఏడీలో కీర్తి సురేష్.. ప్రభాస్‌కు ప్రాణ మిత్రుడిగా మహానటి

Murari Heroin: మురారి సినిమాలో మహేశ్‍కు జోడీగా సోనాలీ కంటే ముందు ఈ బాలీవుడ్ భామను అనుకున్నారట!

వారం వారం ఈ రేటింగ్స్ కూడా మారుతూ ఉంటాయి. తాజాగా మార్చి 3 వరకూ వచ్చిన టీఆర్పీ రేటింగ్స్ ప్రకారం ఇప్పుడు తెలుగులో టాప్ 10లో ఉన్న సీరియల్స్ ఏవో చూద్దాం. ఈ లిస్ట్ లో అన్నీ స్టార్ మా(star maa), జీ తెలుగు (zee telugu) సీరియల్సే ఉండటం విశేషం. జెమిని టీవీ ఊసే లేదు. టాప్ 30లో మాత్రం అక్కడక్కడా ఈటీవీ సీరియల్స్ ఉన్నాయి. ఆ లెక్కన సీరియల్స్ కేటగిరీని మొత్తం స్టార్, జీ డామినేట్ చేస్తున్నాయనే చెప్పాలి.

టాప్ 10 సీరియల్స్ ఇవే

తాజా టీఆర్పీ రేటింగ్స్ ప్రకారం స్టార్ మాలో వచ్చే బ్రహ్మ ముడి టాప్ లో ఉండటం విశేషం. ఈ సీరియల్ గత వారం ఏకంగా 12.42 టీఆర్పీ రేటింగ్ తో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. గత జనవరిలోనే ప్రారంభమైన ఈ సీరియల్ కు క్రమంగా ఆదరణ పెరుగుతోంది.

ఇక రెండోస్థానంలో స్టార్ మాలోనే వచ్చే గుప్పెడంత మనసు ఉంది. ఈ సీరియల్ గత వారం 11 టీఆర్పీ రేటింగ్ సాధించింది. మూడోస్థానంలోనూ స్టార్ మాలోనే వచ్చే కృష్టా ముకుందా మురారి సీరియల్ ఉంది. ఈ సీరియల్ కు 10.68 రేటింగ్ నమోదైంది.

నాలుగోస్థానంలో ఇంటింటి గృహలక్ష్మి (స్టార్ మా) సీరియల్ ఉంది. దీనికి గత వారం 10.56 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఐదోస్థానంలో జీ తెలుగు ఛానెల్ లో వచ్చే త్రినయని సీరియల్ ఉండటం విశేషం. ఈ సీరియల్ కు 8.4 టీఆర్పీ రేటింగ్ నమోదైంది.

ఆరోస్థానంలో స్టార్ మాలో వచ్చే మల్లీ నిండు జాబిలి (8.04 టీఆర్పీ) ఉండగా.. ఆ తర్వాత టాప్ 10లో ఉన్న మిగతా స్థానాలన్నీ జీ తెలుగు సీరియల్సే ఆక్రమించాయి. ఏడో స్థానంలో పడమటి సంధ్యారాగం (7.75), ఎనిమిదో స్థానంలో ప్రేమ ఎంత మధురం (7.62), తొమ్మిదో స్థానంలో కల్యాణం కమనీయం (6.55), పదో స్థానంలో అమ్మాయి గారు (6.08) ఉన్నాయి.

ఆ లెక్కన టాప్ 10లో మొత్తం స్టార్ మా, జీ తెలుగు సీరియల్సే ఉండటం విశేషం. టాప్ 20లోనూ ఒక్క రంగుల రాట్నం (ఈటీవీ, 5.3) తప్ప మిగతావన్నీ ఆ రెండు ఛానెల్స్ లోని సీరియల్సే. ప్రతి వారం ఈ టీఆర్పీ రేటింగ్ మారుతూ ఉంటాయి. అయితే టాప్ 10లో మాత్రం గత కొన్ని వారాలుగా పైన చెప్పిన సీరియల్స్ కాస్త అటూఇటూ ఉంటూ వస్తున్నాయి.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం