Sir OTT Release Date: సార్ ఓటీటీ రిలీజ్ కన్ఫార్మ్.. అధికారిక ప్రకటన వచ్చేసింది..ఎప్పుడంటే?-dhanush sir movie ott release date officially announced ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Dhanush Sir Movie Ott Release Date Officially Announced

Sir OTT Release Date: సార్ ఓటీటీ రిలీజ్ కన్ఫార్మ్.. అధికారిక ప్రకటన వచ్చేసింది..ఎప్పుడంటే?

Maragani Govardhan HT Telugu
Mar 12, 2023 01:34 PM IST

Sir OTT Release Date: ధనుష్ హీరోగా, సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం సార్. ఈ సినిమా గత నెలలో థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది.

సార్ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫార్మ్
సార్ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫార్మ్

Sir OTT Release Date: కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించిన ద్విభాషా చిత్రం సార్. గత నెల ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ధనుష్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. అలాగే ఫిబ్రవరిలో విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా వందకోట్లకు పైచిలుకు వసూళ్లతో అదరగొట్టింది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఓటీటీ విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది.

ధనుష్ నటించిన సార్ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. మార్చి 17న ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుంది. ఇందుకు సంబంధించిన విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ ట్విటర్ వేదికగా తెలియజేసింది. "సార్ వస్తున్నాడు.. అందరూ క్లాస్‌కు అటెండ్ అవ్వాల్సిందే" అంటూ రిలీజ్ డేట్‌ పోస్టర్‌ను విడుదల చేసింది.

అందరికి అందుబాటులో ఉండాల్సిన విద్య కార్పోరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లి పెద్ద వ్యాపారంలోకి ఎలా మారింది? దీన్ని మార్చేందుకు యువ టీచర్ ఎంతవరకు పోరాడాల్సి వచ్చింది? అనేది సినిమా చూసే తెలుసకోవాలి. తెలుగు, తమిళ భాషల్లో ఫిబ్రవరి 17న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. అయితే థియేటర్లలో విడుదలైన నెల రోజులకే ఓటీటీలో తీసుకురావడంతో సినీ ప్రియులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్‌తో పాటు ఫార్చున్ ఫోర్ సినిమాస్ సంస్థ సంయుక్తంగా నిర్మించింది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ధనుష్ సరసన సంయుక్త మీనన్ నటించింది. ఫిబ్రవరి 17న సినిమా విడుదలైంది.

IPL_Entry_Point