Anger Tales Web Series Review: యాంగ‌ర్ టేల్స్ వెబ్ సిరీస్ రివ్యూ - నాలుగు క‌థ‌ల ఆంథాల‌జీ సిరీస్ ఎలా ఉందంటే-anger tales web series review suhas bindu madhavi madonna sebastian web series review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Anger Tales Web Series Review Suhas Bindu Madhavi Madonna Sebastian Web Series Review

Anger Tales Web Series Review: యాంగ‌ర్ టేల్స్ వెబ్ సిరీస్ రివ్యూ - నాలుగు క‌థ‌ల ఆంథాల‌జీ సిరీస్ ఎలా ఉందంటే

Nelki Naresh Kumar HT Telugu
Mar 09, 2023 12:38 PM IST

Anger Tales Web Series Review: బింధుమాధ‌వి, మ‌డోన్నా సెబాస్టియ‌న్‌, సుహాస్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన యాంగ‌ర్ టేల్స్ వెబ్‌సిరీస్ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో గురువారం రిలీజైంది. సోసైటీలోని కామ‌న్ ప్రాబ్లెమ్స్‌తో తెర‌కెక్కిన ఈ సిరీస్ ఎలా ఉందంటే...

యాంగ‌ర్ టేల్స్ వెబ్‌సిరీస్
యాంగ‌ర్ టేల్స్ వెబ్‌సిరీస్

Anger Tales Web Series Review: బిందుమాధ‌వి(Bindu Madhvi), మ‌డోన్నా సెబాస్టియ‌న్‌, సుహాస్‌(Suhas), త‌రుణ్‌భాస్క‌ర్‌, వెంక‌టేష్ మ‌హా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఆంథాల‌జీ వెబ్‌సిరీస్ యాంగ‌ర్ టేల్స్ గురువారం డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ (Disneyplus Hotstar) ఓటీటీలో రిలీజైంది. ఈ సిరీస్‌కు నితిన్ ప్ర‌భ‌ల తిల‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ వెబ్ సిరీస్‌తో సుహాస్ నిర్మాత‌గా అరంగేట్రం చేశారు. నాలుగు క‌థ‌ల‌తో తెర‌కెక్కిన ఈ సిరీస్ ఎలా ఉంది? బిందుమాధ‌వి, సుహాస్‌తో పాటు మిగిలిన న‌టీన‌టులు ఈ సిరీస్‌తో మెప్పించారా? లేదా? అన్న‌ది చూద్ధాం…

Anger Tales Web Series Review- హీరో బెనిఫిట్ షో...

త‌మ హీరో బెనిఫిట్ షో వేయాల‌ని త‌పించిన రంగా (వెంక‌టేష్ మ‌హా) అనే వీరాభిమానికి ఎదురైన క‌ష్టాల‌తో బెనిఫిట్‌షో క‌థ‌ను తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు. డిస్ట్రిబ్యూట‌ర్ మాట‌ల‌ను న‌మ్మి రిలీజ్‌కు ముందు రోజు రాత్రి బెన్‌ఫిట్‌షో వేయ‌డానికి టికెట్లు అమ్ముతాడు రంగా.

కానీ అనుకున్న టైమ్‌కు షో స్టార్ట్ కాక‌పోవ‌డంతో అత‌డిపై ఒత్తిడిపెరుతుంది. మ‌రోవైపు ఆ షో కోసం లోక‌ల్ లీడ‌ర్ ప‌చ్చ‌బొట్టు శీను (సుహాస్‌) 200 టికెట్లు కొంటాడు. త‌మ అభిమాన హీరో హిట్ట‌వుతుంద‌ని అత‌డితో రంగా ఛాలెంజ్ చేస్తాడు. ఈ ఛాలెంజ్‌లో అత‌డు నెగ్గాడా? అనుకున్న టైమ్‌కు బెనిఫిట్ షో స్టార్ట్ అయ్యిందా? హీరోను న‌మ్మి రంగా ఎలా మోస‌పోయాడ‌న్న‌దే ఈ క‌థ‌.

రాధ అద్దె ఇంటి కథ…

రాధ( బిందుమాధ‌వి) మిడిల్ క్లాస్ గృహిణి. భ‌ర్త‌తో క‌లిసి అద్దె ఇంట్లో ఉంటుంది. ఆ ఇళ్లు పాత‌బ‌డిపోవ‌డంతో ఖాళీ చేయాల‌ని అనుకుంటారు. కానీ ఆర్థిక స‌మ‌స్య‌ల కార‌ణంగా కుద‌ర‌దు. రాధ‌కు మైగ్రేన్ ఉంటుంది. మ‌ధ్యాహ్నం నిద్ర ఆమెకు త‌ప్ప‌నిస‌రి అవుతుంది. కానీ రాధ రూమ్ ముందు కూర్చొని ఓన‌ర్స్ ఎప్పుడూ గ‌ట్టిగా మాట్లాడుకుంటుంటారు. త‌న నిద్ర‌కు భంగం క‌లిగించ‌వ‌ద్ద‌ని కోరినందుకు ఇళ్లు ఖాళీ చేయ‌మ‌ని వార్నింగ్ ఇస్తారు. వారికి రాధ ఎలా బుద్దిచెప్పింద‌న్న‌ది మ‌రో క‌థ‌.

పూజ ఫుడ్ కష్టాలు…

పూజ (మ‌డోన్నా సెబాస్టియ‌న్‌) భ‌ర్త రాజీవ్‌తో (త‌రుణ్ భాస్క‌ర్‌) క‌లిసి వెజిటేరియ‌న్ క‌మ్యూనిటీలో నివ‌సిస్తుంటుంది. పెళ్లికి ముందు నాన్ వెజ్ తినే పూజ భ‌ర్త, అత్త‌య్య కోరిక మేర‌కు వేగ‌న్‌గా మారిపోతుంది. కానీ ఆమె అనారోగ్యం బారిన ప‌డ‌టంతో డాక్ట‌ర్ ఎగ్స్ తిన‌మ‌ని స‌ల‌హా ఇస్తుంది. వాళ్లు ఉండే అపార్ట్‌మెంట్‌లో నాన్ వెజ్ నిషేదం కావ‌డంతో పూజ ఎలాంటి క‌ష్టాలు ప‌డింది. త‌న‌కు ఇష్ట‌మైన ఫుడ్ తిన‌డం కోసం ఆమె ఎలాంటి నిర్ణ‌యాన్ని తీసుకుంద‌న్న‌దే ఈ ఎపిసోడ్ క‌థ‌

గిరిధ‌ర్ పెళ్ళి…

గిరిధ‌ర్ (ఫ‌ణి ఆచార్య‌) ఓ రియ‌ల్ ఎస్టేట్ కంపెనీలో ప‌నిచేస్తుంటాడు. బ‌ట్ట‌త‌ల కార‌ణంగా పెళ్లి సంబంధాలు కుద‌ర‌వు. అత‌డి ప‌నితీరు బాగాలేద‌ని ఉద్యోగం నుంచి తీసేస్తారు. హెల్మెట్ ధ‌రించ‌డం వ‌ల్ల త‌న‌కు బ‌ట్ట‌త‌ల వ‌చ్చింద‌ని తెలుసుకున్న గిరిధ‌ర్ కోర్టును ఆశ్ర‌యించ‌డంతో ఈ క‌థ ముగుస్తుంది.

కామ‌న్ ప్రాబ్లెమ్స్‌తో...

సోసైటీలో ఎదుర‌య్యే కామ‌న్ ప్రాబ్లెమ్స్‌ను తీసుకొని ద‌ర్శ‌కుడు నితిన్ ప్ర‌భ‌ల తిల‌క్ యాంగ‌ర్ టేల్స్ సిరీస్‌ను తెర‌కెక్కించారు. నాలుగు కథల్ని స‌హ‌జంగా స్క్రీన్‌పై ప్ర‌జెంట్ చేశారు. బెనిఫిట్‌షో సిరీస్‌లో రంగ‌గా ద‌ర్శ‌కుడు వెంక‌టేష్ మ‌హా యాక్టింగ్ బాగుంది. ఇటీవ‌ల అత‌డు కేజీఎఫ్ సినిమాపై విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అత‌డి ఎపిసోడ్‌లో బ్యాక్‌గ్రౌండ్ పోస్ట‌ర్స్ లో కేజీఎఫ్ క‌నిపించ‌డం ఆక‌ట్టుకుంటుంది.

చిన్న స‌మ‌స్య‌లు కొన్ని సార్లు...

అద్దె ఇంట్లో ఉండే క‌ష్టాల‌ను బింధు మాధ‌వి ఎపిసోడ్ ద్వారా మ‌న‌సుల్ని క‌దిలించేలా చూపించారు. చిన్న స‌మ‌స్య అనుకున్న‌ది ఎదుటివారిని ఎంత‌గా ఇబ్బంది పెడుతుందో స‌హ‌జంగా ఆవిష్క‌రించిన తీరు బాగుంది.

పెళ్లి త‌ర్వాత అత్తారింటి క‌ట్టుబాట్లు కార‌ణంగా త‌మ ఇష్టాలు, అభిరుచుల‌కు అమ్మాయిలు ఎలా దూర‌మ‌వుతారో మోడ్ర‌న్ స్టైల్‌లో ద‌ర్శ‌కుడు చెప్పారు. బ‌ట్ట‌త‌ల అనేది చిన్న స‌మ‌స్య‌గానే క‌నిపించినా అది మ‌నిషిలో ఆత్మ‌న్యూన‌త‌భావాన్ని ఎలా పెంచుతుంది? చివ‌ర‌కు కొన్ని సార్లు పెళ్లికి అది అడ్డంకిగా మారే అవ‌కాశం ఉండొచ్చ‌ని గిరిధ‌ర్ క‌థ ద్వారా సందేశాత్మ‌కంగా ప్ర‌జెంట్ చేశారు.

క‌నెక్టివిటీ మిస్‌...

ఈ సిరీస్ కోసం ద‌ర్శ‌కుడు ప్ర‌భ‌ల తిల‌క్ ఎంచుకున్న పాయింట్స్ బాగున్నా డెప్త్‌గా కాకుండా సింపుల్ ఎమోష‌న్స్‌తో తెర‌కెక్కించారు. అందువ‌ల్ల కొన్ని చోట్ల క‌నెక్టివిటీ మిస్స‌యిన ఫీలింగ్ క‌లుగుతుంది. సిరీస్ నిడివి త‌క్కువే అయినా సాగ‌దీశారు ద‌ర్శ‌కుడు. పూజ ఎపిసోడ్‌తో పాటు గిరిధ‌ర్ క‌థ‌ను అర్థ‌వంతంగా చెప్ప‌లేక‌పోయిన‌ట్లుగా అనిపించింది.

Anger Tales Web Series Review- తెలిసిన క‌థ‌ల్నే...

యాంగ‌ర్ టేల్స్ నిత్య జీవితంలో మ‌న‌కు తెలిసిన క‌థ‌ల్నే, జీవితాల్ని స్క్రీన్‌పై చూస్తోన్న అనుభూతి క‌లుగుతుంది. నాలుగు క‌థ‌ల్లో కొన్ని మ‌న‌సుల్ని క‌దిలిస్తే మ‌రికొన్ని మాత్రం యావ‌రేజ్‌గా ఉన్నాయి. నిర్మాణ విలువ‌లు గ్రాండ్‌గా ఉండ‌టం సిరీస్‌కు ప్ల‌స్ పాయింట్‌గా నిలిచింది.

IPL_Entry_Point