తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tamannah Web Series: తమన్నా మరో వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఈ ఓటీటీలోనే..

Tamannah Web Series: తమన్నా మరో వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఈ ఓటీటీలోనే..

Hari Prasad S HT Telugu

01 February 2024, 15:43 IST

    • Tamannah Web Series: టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా మరో వెబ్ సిరీస్ లో నటించబోతోంది. కొన్నాళ్లుగా ఓటీటీలో యాక్టివ్ గా ఉంటున్న ఆమె.. తాజాగా మరో సిరీస్ కోసం సైన్ చేసింది.
తమన్నా భాటియా
తమన్నా భాటియా

తమన్నా భాటియా

Tamannah Web Series: తమన్నా భాటియా కాలానికి తగినట్లు నడుచుకుంటానంటూ ఇటు సినిమాలు, అటు ఓటీటీ షోలతోనూ బిజీ అయిపోయింది. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్న ఆమె.. గతేడాది తెలుగు, తమిళంలో ఇద్దరు టాప్ హీరోలతో సినిమాల(జైలర్, భోళా శంకర్)తోపాటు వెబ్ సిరీస్ లూ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Sunil: మ‌మ్ముట్టి సినిమాలో విల‌న్‌గా సునీల్ - ట‌ర్బోతో మ‌ల‌యాళంలోకి ఎంట్రీ - ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

Vijay Sethupathi: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కొత్త ప్రయోగం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా ఏసీఈ

NNS May 18th Episode: పుట్టింటికి అరుంధతి.. సరస్వతిని చంపేస్తున్న మనోహరి.. అందరికీ తెలియనున్న నిజం​​​!

బోల్డ్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇస్తోన్న టాలీవుడ్ డైరెక్ట‌ర్ - ముగ్గురు హీరోయిన్ల‌తో రొమాన్స్‌

తాజాగా తమన్నా మరో వెబ్ సిరీస్ చేయబోతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో తెరకెక్కిస్తున్న ఈ సిరీస్ కామెడీ జానర్ కావడం విశేషం.

తమన్నా వెబ్ సిరీస్

తమన్నా భాటియా టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో అందాల ఆరబోత చేసింది. అయితే ఓటీటీల్లోకి వచ్చిన తర్వాత మాత్రం మరో అడుగు ముందుకేసి బోల్డ్ సీన్స్ చేయడానికి కూడా వెనుకాడటం లేదు. గతేడాది ఆమె అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన జీ కర్దాతోపాటు నెట్‌ఫ్లిక్స్ లో వచ్చిన లస్ట్ స్టోరీస్ 2లోనూ నటించింది. ఈ రెండు సిరీస్ లలో ఆమె రెచ్చిపోయి నటించింది.

ముఖ్యంగా లస్ట్ స్టోరీస్ 2లో తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో అన్ని హద్దులూ చెరిపేసి లిప్ లాక్ సహా ఓ బోల్డ్ సీన్ తో చెలరేగిపోయింది. ఇప్పుడామె మరో వెబ్ సిరీస్ చేయబోతోంది. ఈ కామెడీ వెబ్ సిరీస్ ను కరణ్ జోహార్ కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ షో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. అంతేకాదు ఈ సిరీస్ ను హిందీతోపాటు అన్ని దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

మళ్లీ ఓటీటీలోకి తమన్నా

తమన్నా నిజానికి తొలిసారి మాస్టర్‌చెఫ్ తెలుగుతో ఓటీటీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆహా ఓటీటీలో తొలిసారి 11th హవర్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఆ తర్వాత తెలుగులో వెబ్ షోలు చేయకపోయినా.. గతేడాది హిందీలో మూడు సిరీస్ లు చేసింది. 2023 చివర్లో ఆఖ్రీ సచ్ సిరీస్ లోనూ కనిపించింది. ఇప్పుడిక కెరీర్లో మరో వెబ్ సిరీస్ కోసం రెడీ అవుతోంది.

ఈ కొత్త వెబ్ సిరీస్ ను డాక్టర్ అరోరా, తోడా అడ్జస్ట్ ప్లీజ్, సేపియాలాంటి సిరీస్ డైరెక్ట్ చేసిన అర్చిత్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సిరీస్ కు ఇంకా టైటిల్ పెట్టలేదు. అయితే తమన్నా ఓవైపు ఓటీటీ షోలతోపాటు మరోవైపు సిల్వర్ స్క్రీన్ పైనా మెరుస్తూనే ఉంది. హిందీలో జాన్ అబ్రహంతో కలిసి తమన్నా.. వేదా అనే సినిమా చేస్తోంది. ఇదే కాకుండా తమిళ సినిమా అర్నమనాయ్ 4లోనూ నటిస్తోంది. బాలీవుడ్ లో స్త్రీ2 ప్రాజెక్ట్ కూడా చేస్తోంది.

తమన్నా 2023లో రజనీకాంత్ తో కలిసి జైలర్ మూవీలో నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో నువ్వు కావాలయ్యా పాటపై ఆమె చేసిన డ్యాన్స్ ఓ రేంజ్ లో హిట్టయ్యింది. అటు తెలుగులో చిరంజీవితో భోళా శంకర్ కూడా చేసింది. అయితే ఈ మూవీ డిజాస్టర్ అయింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం