తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rolex: క్యామియో రోల్‍నే సినిమాగా.. సూర్య - లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్!

Rolex: క్యామియో రోల్‍నే సినిమాగా.. సూర్య - లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్!

13 August 2023, 16:29 IST

    • Rolex: సూర్య - డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‍లో ఓ చిత్రం చర్చల దశలో ఉందని సమాచారం బయటికి వచ్చింది. దీనిపై సూర్య హింట్ ఇచ్చారు.
Rolex: లోకేశ్ కనగరాజ్, సూర్య
Rolex: లోకేశ్ కనగరాజ్, సూర్య

Rolex: లోకేశ్ కనగరాజ్, సూర్య

Rolex: తమిళ యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఇప్పటి వరకు తీసిందే ఆరు సినిమాలే అయినా ఫుల్ పాపులర్ అయ్యారు. ఖైదీ, మాస్టర్ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. గతేడాది లోకనాయకుడు కమల్ హాసన్‍ హీరోగా తెరకెక్కించిన విక్రమ్ మూవీతో లోకేశ్ స్టార్ డైరెక్టర్ స్థాయికి చేరారు. విక్రమ్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను సాధించింది. కమల్ హాసన్‍కు కమ్‍బ్యాక్ మూవీ అయింది. అయితే, విక్రమ్ సినిమా చివర్లో తమిళ స్టార్ హీరో సూర్య ‘రోలెక్స్’ అనే క్యామియో పాత్రలో కనిపించారు. ఉన్నది కాసేపే అయినా ‘రోలెక్స్’ క్యారెక్టర్ అందరి మదిలో నిలిచిపోయింది. దీనికి సూర్య అద్భుతమైన యాక్టింగ్ ఓ కారణమైతే.. లోకేశ్ వైలెంట్ టేకింగ్ మరో కారణంగా ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Vazhakku: హీరోతో గొడవ.. సినిమాను నేరుగా వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‍ఫామ్‍లో రిలీజ్ చేసిన డైరెక్టర్

Sharathulu Varthisthai OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Double iSmart Teaser Time: డబుల్ ఇస్మార్ట్ సినిమా టీజర్ రిలీజ్‍కు టైమ్ ఖరారు

Salman Khan: సల్మాన్ ఖాన్ ఆ గుడికి వచ్చి క్షమాపణ అడగాలి.. అలాంటి తప్పు మళ్లీ చేయనని ప్రమాణం చేయాలి: బిష్ణోయ్ సమాజం

లోకేశ్ కనగరాజ్ తనకు ఓ సింగిల్ లైన్ స్క్రిప్ట్ చెప్పారని హీరో సూర్య ఇటీవల ఈవెంట్లో చెప్పారు. అయితే, ఇది ‘రోలెక్స్’ సినిమా గురించేననే బజ్ నెలకొంది. విక్రమ్ మూవీలో ‘రోలెక్స్’ క్యామియోకు అదిరిపోయే రెస్పాన్స్ రావటంతో ఆ క్యారెక్టర్ ప్రధాన పాత్రగా సినిమాను తెరకెక్కించే ప్లాన్‍లో లోకేశ్ కనగరాజ్ ఉన్నాడట. అయితే, ప్రస్తుతం ఈ చిత్రం చర్చల దశలోనే ఉంది. ఇది కార్యరూపం దాలిస్తే క్రేజీ ప్రాజెక్ట్ అవనుంది.

రోలెక్స్ మూవీ తీస్తే లోకేశ్ కనగరాజ్ యూనివర్స్ (LCU)లోనూ సరిగా సెట్ అవుతుంది. ఖైదీ, విక్రమ్ సినిమాలను లింక్ చేసి ఎల్‍సీయూను మొదలుపెట్టారు డైరెక్టర్ లోకేశ్. ప్రస్తుతం దళపతి విజయ్‍తో చేస్తున్న లియో చిత్రానికి కూడా విక్రమ్, ఖైదీతో కాస్త లింక్ ఉంటుందని తెలుస్తోంది.

దళపతి విజయ్ - లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‍లో ప్రస్తుతం తెరకెక్కుతున్న లియో సినిమా ఈ ఏడాది అక్టోబర్ 19న విడుదల కానుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్‍గా నటిస్తుండగా.. త్రిష హీరోయిన్‍గా చేస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.

సూర్య ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్‍లో కంగువ అనే పీరియాడిక్ సినిమా చేస్తున్నారు. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర గ్లింప్స్ ఇటీవల రిలీజ్ కాగా.. అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. వచ్చే ఏడాది కంగువ మూవీ రిలీజ్ కానుంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం