తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Suriya Kanguva Second Look: కంగువ నుంచి సూర్య సెకండ్ లుక్ వచ్చేసింది

Suriya Kanguva Second Look: కంగువ నుంచి సూర్య సెకండ్ లుక్ వచ్చేసింది

Hari Prasad S HT Telugu

16 January 2024, 11:57 IST

    • Suriya Kanguva Second Look: తమిళ సూపర్ స్టార్ సూర్య నటిస్తున్న కంగువ మూవీ నుంచి అతని సెకండ్ లుక్ వచ్చేసింది. ఈ మూవీ మేకర్స్ మంగళవారం (జనవరి 16) ఈ లుక్ రిలీజ్ చేశాడు.
కంగువ మూవీ సెకండ్ లుక్ పోస్టర్ లో సూర్య
కంగువ మూవీ సెకండ్ లుక్ పోస్టర్ లో సూర్య

కంగువ మూవీ సెకండ్ లుక్ పోస్టర్ లో సూర్య

Suriya Kanguva Second Look: ఈ ఏడాది రానున్న మోస్ట్ అవేటెడ్ మూవీస్ లో ఒకటి సూర్య నటిస్తున్న కంగువ. పాన్ ఇండియా మూవీగా వస్తున్న కంగువ నుంచి మంగళవారం (జనవరి 16) సూర్య సెకండ్ లుక్ రిలీజ్ చేశారు. ఈ మధ్యే మూవీలో తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న సూర్య.. తాజాగా రిలీజ్ చేసిన సెకండ్ లుక్ లో చాలా ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Vazhakku: హీరోతో గొడవ.. సినిమాను నేరుగా వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‍ఫామ్‍లో రిలీజ్ చేసిన డైరెక్టర్

Sharathulu Varthisthai OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Double iSmart Teaser Time: డబుల్ ఇస్మార్ట్ సినిమా టీజర్ రిలీజ్‍కు టైమ్ ఖరారు

Salman Khan: సల్మాన్ ఖాన్ ఆ గుడికి వచ్చి క్షమాపణ అడగాలి.. అలాంటి తప్పు మళ్లీ చేయనని ప్రమాణం చేయాలి: బిష్ణోయ్ సమాజం

కంగువ మూవీకి శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా ఇండియాలోని భాషలతోపాటు జపనీస్, కొరియన్ లాంటి విదేశీ భాషల్లోనూ రాబోతోంది. ఈ రెండో పోస్టర్ ను మేకర్స్ తమ సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ ద్వారా రిలీజ్ చేశారు. స్టూడియో గ్రీన్ ఈ కంగువ మూవీని భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న విషయం తెలిసిందే.

కంగువ సెకండ్ లుక్ ఇదీ

"విధి అన్నది సమయం అంటే గతం, వర్తమానం, భవిష్యత్తు కంటే బలమైనది. అందరి నోటా ఒకే పేరు ప్రతిధ్వనించాలి. అదే కంగువ. కంగువ సెకండ్ లుక్ ఇక్కడ చూడండి" అనే క్యాప్షన్ తో మేకర్స్ ఈ పోస్టర్ రిలీజ్ చేశారు. గతేడాది నవంబర్ లోనే ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజైంది. అందులో సూర్య ఇంతకుముందు ఎప్పుడూ చూడని ఓ కొత్త అవతారంలో కనిపించాడు.

దీంతో ఆ పోస్టర్ వెంటనే వైరల్ గా మారింది. ఇక ఈ సెకండ్ లుక్ లోనూ సూర్య రెండు వేర్వేరు లుక్స్ లో కనిపించాడు. బ్యాక్‌గ్రౌండ్లో మంటల్లో కాలిపోతున్న పక్షి కనిపిస్తుండగా.. దాని ముందు సూర్య ఎంతో ఇంటెన్స్ లుక్ లో ఉన్నాడు. ఇక ఆ వెనుక సూర్య మరో లుక్ కూడా కనిపించింది. ఈ కంగువ మూవీలో సూర్య సరసన బాలీవుడ్ నటి దిశా పటానీ నటిస్తోంది.

షూటింగ్ పూర్తి చేసుకున్న సూర్య

ఈ మధ్యే కంగువ మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్నాడు సూర్య. గత బుధవారం (జనవరి 10) ఈ మూవీలో తన చివరి షాట్ షూటింగ్ పూర్తయినట్లు చెబుతూ అతడు ఓ ఫొటో షేర్ చేశాడు. అందులోనూ సూర్య డిఫరెంట్ లుక్ లో కనిపించాడు.

"కంగువలో నా చివరి షాట్ పూర్తయింది. మొత్తం మూవీ యూనిట్ సానుకూలంగా ఉంది. ఇది ఒకదానికి ముగింపు కాగా.. మరెన్నింటికో ఆరంభం. మంచి జ్ఞాపకాలు అందించిన డైరెక్టర్ శివ, టీమ్ కు థ్యాంక్స్. కంగువ నాకు చాలా స్పెషల్. మీ అందరూ ఈ సినిమాను స్క్రీన్ పై చూసి ఎంజాయ్ చేయడం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాను" అని సూర్య ట్వీట్ చేశాడు.

కంగువ గురించి పెద్దగా డిటేల్స్ బయటకు రాక ముందే ఈ మూవీ డిజిటల్ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ మొత్తం చెల్లించడం ఆశ్చర్యం కలిగించింది. ఏకంగా రూ.80 కోట్లతో హక్కులను సొంతం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అది కూడా సౌతిండియా భాషలైన తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం వరకూ ఇంత మొత్తం చెల్లించారు. ఇక హిందీ కోసం ఎంతనేది తెలియలేదు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం