తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Suriya Boyapati Srinu Movie: సూర్య‌, బోయ‌పాటి శ్రీను కాంబో ఫిక్స్‌ - షూటింగ్ మొద‌ల‌య్యేది ఎప్పుడంటే?

Suriya Boyapati Srinu Movie: సూర్య‌, బోయ‌పాటి శ్రీను కాంబో ఫిక్స్‌ - షూటింగ్ మొద‌ల‌య్యేది ఎప్పుడంటే?

HT Telugu Desk HT Telugu

22 September 2023, 6:34 IST

  • Suriya Boyapati Srinu Movie: స్కంద త‌ర్వాత డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను నెక్స్ట్ సినిమాపై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య‌తో బోయ‌పాటి శ్రీను త‌దుప‌రి సినిమా చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొద‌లుకానుందంటే?

సూర్య‌, బోయ‌పాటి శ్రీను
సూర్య‌, బోయ‌పాటి శ్రీను

సూర్య‌, బోయ‌పాటి శ్రీను

Suriya Boyapati Srinu Movie: సూర్య స్ట్రెయిట్ తెలుగు మూవీకి రంగం సిద్ధ‌మైన‌ట్లు స‌మాచారం. మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీనుతో సూర్య ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు చాలా కాలంగా వార్త‌లు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ కాంబో ఫిక్స‌యిన‌ట్లు తెలిసింది. త్వ‌ర‌లోనే సూర్య, బోయ‌పాటి సినిమాకు సంబంధించి అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ట్రెండింగ్ వార్తలు

Vazhakku: హీరోతో గొడవ.. సినిమాను నేరుగా వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‍ఫామ్‍లో రిలీజ్ చేసిన డైరెక్టర్

Sharathulu Varthisthai OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Double iSmart Teaser Time: డబుల్ ఇస్మార్ట్ సినిమా టీజర్ రిలీజ్‍కు టైమ్ ఖరారు

Salman Khan: సల్మాన్ ఖాన్ ఆ గుడికి వచ్చి క్షమాపణ అడగాలి.. అలాంటి తప్పు మళ్లీ చేయనని ప్రమాణం చేయాలి: బిష్ణోయ్ సమాజం

వ‌చ్చే ఏడాది ఆరంభంలో ఈ మూవీ షూటింగ్ మొద‌లుకానున్న‌ట్లు చెబుతోన్నారు. బైలింగ్వ‌ల్ మూవీగా తెలుగుతో పాటు త‌మిళంలోనూ సూర్య‌, బోయ‌పాటి మూవీ తెర‌కెక్క‌బోతున్న‌ట్లు స‌మాచారం. బోయ‌పాటి గ‌త సినిమాల శైలిలోనే ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ క‌థాంశంతో ఈ సినిమా రాబోతున్న‌ట్లు చెబుతోన్నారు. సూర్య పాత్ర ఊర మాస్‌గా ఉంటుంద‌ని అంటున్నారు.

ప్ర‌స్తుతం రామ్ హీరోగా న‌టిస్తోన్న స్కంద మూవీకి బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 28న పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో ఈ మూవీ రిలీజ్ కానుంది. స్కంద సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా న‌టిస్తోంది. మ‌రోవైపు సూర్య కంగువ సినిమాతో బిజీగా ఉన్నాడు.

సూర్య కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్ మూవీగా రూపుదిద్దుకుంటోన్న కంగువ మూవీకి సిరుత్తై శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఫాంట‌సీ యాక్ష‌న్ డ్రామా క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా ప‌ది భాష‌ల్లో రిలీజ్ కానుంది. కంగువ షూటింగ్ పూర్తికాగానే బోయ‌పాటి శ్రీను సినిమా షూటింగ్‌ను సూర్య మొద‌లుపెట్ట‌బోతున్న‌ట్లు చెబుతోన్నారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం