తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Allu Arjun Help To Fan: అభిమానిని ఆదుకున్న అల్లు అర్జున్.. ఆర్థిక సాయం అందజేత

Allu Arjun Help to Fan: అభిమానిని ఆదుకున్న అల్లు అర్జున్.. ఆర్థిక సాయం అందజేత

11 February 2023, 10:30 IST

    • Allu Arjun Help to Fan: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గొప్ప మనస్సును చాటుకున్నారు. అభిమాని కుటుంబానికి ఆర్థికంగా సాయాన్ని అందజేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అభిమానికి అల్లు అర్జున్ సాయం
అభిమానికి అల్లు అర్జున్ సాయం

అభిమానికి అల్లు అర్జున్ సాయం

Allu Arjun Help to Fan: సేవా కార్యక్రమాల్లో మన హీరోలు చాలా మంది ముందువరుసలో ఉంటున్నారు. సోషల్ మీడియా కారణంగా ఎప్పుడు ఎవరు ఆపదల్లో ఉన్నా వెంటనే స్పందిస్తున్నారు. ఈ విషయంలో అల్లు అర్జున్ ముందున్నారు. ఇప్పటికే అభిమానుల అవసరార్థం చాలాసార్లు సహాయసాకారాలు అందించిన మన స్టైలిష్ స్టార్.. తాజాగా మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు. అర్జున్ కుమార్ అభిమానికి ఆర్థిక సాయం అందజేశారు.

ట్రెండింగ్ వార్తలు

Kiara Advani: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గేమ్ చేంజర్ హీరోయిన్ డెబ్యూ ఎంట్రీ.. కియారా డ్రెస్ ప్రత్యేకతలు ఇవే!

Karthika Deepam Chandu: కార్తీక దీపం చందు ఆత్మ‌హ‌త్య - ప‌విత్ర జ‌యరాం చ‌నిపోయిన ఐదు రోజుల‌కే బ‌ల‌వ‌న్మ‌ర‌ణం

Prabhas: ప్ర‌భాస్ చేతుల మీదుగా మొద‌లై రిలీజ్ కానీ దీపికా ప‌డుకోణ్ ఫ‌స్ట్ స్ట్రెయిట్ తెలుగు మూవీ ఏదో తెలుసా!

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలోకి 10 సినిమాలు.. కచ్చితంగా చూడాల్సినవి 3 మాత్రమే.. ఎక్కడ చూస్తారంటే?

వివరాల్లోకి వెళ్తే అర్జున్ కుమార్ మన స్టైలిష్ స్టార్‌కు వీరాభిమాని. అయితే అతడి తండ్రి ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారు. చికిత్స చేయించాలంటే రెండు లక్షల వరకు ఖర్చవుతుంది. ఇంత మొత్తం అతడి వద్ద లేదు. ఈ విషయం తెలిసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. దాతలు సాయం చేయాలని కోరారు. ఈ విషయం గీతా ఆర్ట్స్ కంటెంట్ హెడ్ శరత్ చంద్రనాయుడు వరకు చేరింది. ఆయన వెంటనే బన్నీకి విషయాన్ని తెలపడంతో ఆయన స్పందించారు. చికిత్సకు అయ్యే మొత్తం ఖర్చును తాను భరిస్తానని, ఎంత అవుతుందో తెలుసుకోమని పురమాయించారు. అనుకున్నట్లుగానే ఆ సాయం చేశారు.

అభిమాన హీరో నుంచి సపోర్ట్ రావడంతో అర్జున్ కుమార్ ఆనందానికి అంతే లేదు. తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. "నాకు సాయం చేసిన నా హీరో అల్లు అర్జున్ అన్నయ్యకు థ్యాంక్యూ. వ్యక్తిగతంగా నేను కృతజ్ఞతలు తెలుపుదామనుకుంటున్నాను. శరత్ చంద్ర అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు. గ్రేట్ లీడర్షిప్‌కు మీరు ఉదాహరణ. మీరు చేసిన సాయానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను." అని అభిమాని తన సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశాడు.

దీంతో అభిమానికి సాయం చేసిన అల్లు అర్జున్‌ను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తన గొప్ప మనస్సును చాటుకున్నాడని స్పందిస్తున్నారు. ప్రస్తుతం బన్నీ పుష్ప-2 చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ప్రస్తుతం వైజాగ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేస్తోంది. ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం