Allu Arjun : ఆ బాలీవుడ్ సినిమా వసూళ్లపై అల్లు అర్జున్ ఎఫెక్ట్-allu arjun ala vaikunthapuramuloo hindi version youtube release effect on shehzada collections ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Allu Arjun : ఆ బాలీవుడ్ సినిమా వసూళ్లపై అల్లు అర్జున్ ఎఫెక్ట్

Allu Arjun : ఆ బాలీవుడ్ సినిమా వసూళ్లపై అల్లు అర్జున్ ఎఫెక్ట్

Anand Sai HT Telugu
Jan 31, 2023 10:44 PM IST

ala vaikunthapuramuloo hindi Dubbing : అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో సినిమా హిందీలో రిమేక్ అయింది. కార్తీక్ ఆర్యన్.. షెహజాదా పేరుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే ఈ సినిమా వసూళ్ల మీద అల్లు అర్జున్ ప్రభావం చూపించనున్నాడు.

అల్లు అర్జున్
అల్లు అర్జున్

అల వైకుంఠపురంలో షెహజాదా పేరుతో హిందీలో రిమేక్ అయింది. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు ఫిబ్రవరి 17వ తేదీన రానుంది. అంతకుముందే తెలుగులో విడుదలైన అల వైకుంఠపురంలో హిందీ డబ్బింగ వెర్షన్ యూట్యూబ్(Youtube)లో రానుంది. కార్తీక్ ఆర్యన్ షెహజాదా విడుదల ఫిబ్రవరి 10న విడుదల కావాల్సింది. కానీ ఒక వారం వెనక్కి వెళ్లింది. ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే దానికి రెండు వారాల ముందు అల వైకుంఠపురములో హిందీ-డబ్బింగ్ వెర్షన్ యూట్యూబ్ లో విడుదల కానుంది. తెలుగులో అల్లు అర్జున్(Allu Arjun) నటించిన అల వైకుంఠపురం ఆధారంగా షెహజాదా రూపొందించారు. రిమేక్‌ థియేటర్లలోకి రావడం కంటే.. ముందు.. హిందీ వెర్షన్ విడుదల అవుతుండటంతో దాని ప్రభావం బాక్సాఫీస్ మీద పడే అవకాశం ఉంది.

గోల్డ్‌మైన్ టెలిఫిల్మ్స్ అల వైకుంఠపురం హిందీ డబ్బింగ్ వెర్షన్‌ను ఫిబ్రవరి 2న తమ యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేస్తామని, ఉచితంగా అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. హిందీ వెర్షన్ విడుదలపై షెహజాదా టీమ్ తో గోల్డ్‌మైన్‌కు విభేదాలు ఉన్నట్టుగా టాక్ నడుస్తోంది. అల్లు అర్జున్(Allu Arjun) నటించిన పుష్ప ది రైజ్ విజయం సాధించిన తర్వాత.., గోల్డ్‌మైన్‌ మనీష్ షా.. అల వైకుంఠపురంలో హిందీ వెర్షన్ ను థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.

అయితే ఈ ప్రకటనతో అప్పుడు.. కార్తిక్ ఆర్యన్(Karthik Aryan) హర్ట్ అయ్యాడట. ఆ సమయంలో షెహజాదా నుండి తప్పుకుంటానని బెదిరించాడు. చివరికి షెహజాదా నిర్మాతలు.. మనీష్ షాతో మాట్లాడి సెట్ చేశారు. ఆ తర్వాత చిత్రీకరణ కొనసాగింది. రోహిత్ ధావన్ దర్శకత్వం వహించిన షెహజాదాలో కృతి సనన్, పరేష్ రావల్, రోనిత్ రాయ్, మనీషా కొయిరాలా కూడా నటించారు.

'అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో హిందీలో శాటిలైట్ హక్కులతో పాటు డిజిటల్ హక్కులను నేను కలిగి ఉన్నాను. ఎప్పుడు విడుదల చేయాలనేది మా ఇష్టం.' అని మనీష్ షా అంటున్నాడు.

అల వైకుంఠపురంలో(ala vaikunthapuramuloo) హిందీ డబ్బింగ్ వెర్షన్ విడుదలైతే.. ఎంతో కొంత షెహజాదా మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇప్పటికే పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కు హిందీలోనూ క్రేజ్ పెరిగిపోయింది. కొంతైనా అల్లు అర్జున్ ప్రభావం షెహజాదా సినిమా వసూళ్ల మీద ఉండనుందని చర్చించుకుంటున్నారు.

Whats_app_banner