తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sreeleela Remuneration: రెమ్యూనరేషన్ భారీగా డిమాండ్ చేస్తున్న శ్రీలీల.. ఎంతో తెలిస్తే షాకవుతారు?

Sreeleela Remuneration: రెమ్యూనరేషన్ భారీగా డిమాండ్ చేస్తున్న శ్రీలీల.. ఎంతో తెలిస్తే షాకవుతారు?

02 March 2023, 17:20 IST

    • Sreeleela Remuneration: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల వరుస పెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఆఫర్లు రావడంతో ఈ ముద్దుగుమ్మ తన రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచిందట. సినిమాకు దాదాపు కోటిన్నర డిమాండ్ చేస్తోందట.
శ్రీలీల
శ్రీలీల

శ్రీలీల

Sreeleela Remuneration: టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. పెళ్లిసందడితో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ గతేడాది ధమాకా సినిమాతో ప్రేక్షకులను పలకరించి సాలిడ్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ మూవీ సక్సెస్‌తో ఏకంగా ఈ అమ్మడు చేతిలో 8 సినిమాలు ఉన్నాయి. వైష్ణవ్ తేజ్, నవీన్ పోలిశెట్టి, మహేశ్ బాబు, పవన్ కల్యాణ్, విజయ్ దేవరకొండ సరసన సినిమాలు చేసే ఛాన్స్ దక్కించుకుంది. ఈ విధంగా వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశం కొట్టేయడంచో శ్రీలీల తన పారితోషికాన్ని భారీగా పెంచేసింది.

ట్రెండింగ్ వార్తలు

Salman Khan: సల్మాన్ ఖాన్ ఆ గుడికి వచ్చి క్షమాపణ అడగాలి.. అలాంటి తప్పు మళ్లీ చేయనని ప్రమాణం చేయాలి: బిష్ణోయ్ సమాజం

Inception 2: నోలాన్ మాస్టర్‌పీస్ మూవీ ఇన్‍సెప్షన్‍కు సీక్వెల్ రానుందా?

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ వదులుకున్న నాలుగు సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఇవే

Prasar Bharati OTT: ప్రభుత్వ ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఆనెలలో ప్రారంభం కానుందా?

ప్రస్తుతం కొత్త సినిమాల కోసం ఏకంగా కోటిన్నర వరకు ఈ ముద్దుగుమ్మ డిమాండ్ చేస్తున్నట్లు ఫిల్మ్ వర్గాల అంచనా. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లుగా సినిమా ఆఫర్లు వస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆలోచనలో ఈ బ్యూటీ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకో దాదాపు రూ.1.5 కోట్ల వరకు పారితోషికం డిమాండ్ చేస్తుందట.

తొలుత కొన్ని కన్నడ సినిమాలతో చిత్రసీమలో అరంగేట్రం చేసిన శ్రీలీల పెళ్లి సందడి చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం మాస్ మహారాజా రవితేజతో ధమాకా సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఆ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో ఈ ముద్దుగుమ్మకు ఇంక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది.

ఇతర హీరోయిన్ల కంటే కూడా శ్రీలీల ఈ విధంగా వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకెళ్తోంది. కెరీర్ ఆరంభంలో పూజా హెగ్డే, రష్మిక మందన్నాకు కూడా ఇదే విధంగా వరుస ఆఫర్లు వచ్చాయి. ఏక కాలంలో అరడజనుకు పైగా చిత్రాలతో వీరిద్దరూ టాలీవుడ్‌లో స్టార్ హోదాను అనుభవించారు. తాజాగా శ్రీలీల కూడా వీరి మార్గంలోనే దూసుకెళ్తోంది. అయితే ఇంత త్వరగా పవన్ కల్యాణ్, మహేష్ బాబు సినిమాల్లో శ్రీలీలకు అవకాశం రావడం మిగిలిన హీరోయిన్లను షాక్‌కు గురిచేస్తోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం