తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pathaan Box Office 1st Week Collections: 300 కోట్ల క్లబ్‌లో పఠాన్.. బాహుబలి-2, కేజీఎఫ్-2 రికార్డు బ్రేక్

Pathaan Box Office 1st Week Collections: 300 కోట్ల క్లబ్‌లో పఠాన్.. బాహుబలి-2, కేజీఎఫ్-2 రికార్డు బ్రేక్

01 February 2023, 9:30 IST

google News
    • Pathaan Box Office 1st Week Collections: షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ చిత్రం వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ సినిమా అత్యంత వేగంగా 300 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రంగా నిలిచింది. దేశవాళీ మార్కెట్‌లో ఈ మైలురాయిని అందుకుని బాహుబలి2, కేజీఎఫ్ 2 రికార్డును బ్రేక్ చేసింది.
పఠాన్ వసూళ్ల వర్షం
పఠాన్ వసూళ్ల వర్షం (ANI Picture Service)

పఠాన్ వసూళ్ల వర్షం

Pathaan Box Office 1st Week Collections: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం పఠాన్. రిపబ్లిక్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఈ సినిమా దేశవాళీ మార్కెట్‌లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ దుమ్మురేపుతోంది. ఒక్క మనదేశంలోనే రూ.300 కోట్ల పైచిలుకు వసూళ్లను సాధించి.. వేగంగా ఈ మైలురాయి అందుకున్న హిందీ చిత్రంగా నిలిచింది.

మంగళవారం ఒక్కరోజే పఠాన్ చిత్రం రూ.21 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. దీంతో 7 రోజుల్లోనే మొత్తం రూ.315 కోట్ల మార్కును అందుకుంది. ఫలితంగా అత్యంత వేగంగా 300 కోట్ల క్లబ్‌లో చేరిన హిందీ చిత్రంగా రికార్డు సృష్టించింది. బాహుబలి-2 హిందీ వెర్షన్ 10 రోజుల్లో ఈ ఘనత సాధించగా.. పఠాన్ 7 రోజుల్లోనే అందుకోవడం విశేషం. దీంతో మొదటి వారంలోనే రూ.315 కోట్లను కొల్లగొట్టింది.

వేగంగా 300 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రాల్లో పఠాన్ అగ్రస్థానంలో ఉండగా.. బాహుబలి-2, కేజీఎఫ్-2 రెండో స్థానంలో ఉన్నాయి. పఠాన్-7 రోజుల్లో, బాహబలి 2- 10 రోజుల్లో, కేజీఎఫ్ 2- 11 రోజుల్లో, ఆమీర్ ఖాన్ దంగల్- 13 రోజుల్లో, సంజూ-16 రోజుల్లో, టైగర్ జిందాహై-16 రోజుల్లో 300 కోట్ల మైలురాయిని అందుకున్నాయి. వీటి తర్వాత ఆమీర్ ఖాన్ పీకే-17 రోజుల్లో, హృతిక్ రోషన్ వార్-19 రోజుల్లో 300 కోట్ల మార్కును అధిగమించాయి.

మొత్తానికి పఠాన్ 7 రోజుల్లో 315 కోట్ల నెట్ వసూళ్లను సాధించి.. కేజీఎఫ్-2 రికార్డును అధిగమించింది. ఇప్పటికే అత్యంత వేగంగా 200 కోట్ల మార్కును అందుకున్న చిత్రంగానూ పఠాన్ ఘనత సాధించింది. సినిమా విడుదలకు ముందే రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి.

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ విడుదల కానుంది. దీపికా పదుకొణె హీరోయిన్‌గా చేసిన ఈ సినిమాలో జాన్ అబ్రహం కీలక పాత్ర పోషించారు. విశాల్-శేఖర్ సంగీత దర్శకత్వం వహించారు.

తదుపరి వ్యాసం