What Pathaan's Success says?: బాయ్ కాట్ కాల్స్ ‘పఠాన్’ ఘన విజయానికి దోహదపడ్డాయా?-pathaan a slap on the face of hate politics an insightful analysis ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  What Pathaan's Success Says?: బాయ్ కాట్ కాల్స్ ‘పఠాన్’ ఘన విజయానికి దోహదపడ్డాయా?

What Pathaan's Success says?: బాయ్ కాట్ కాల్స్ ‘పఠాన్’ ఘన విజయానికి దోహదపడ్డాయా?

HT Telugu Desk HT Telugu
Jan 31, 2023 06:35 PM IST

What Pathaan's Success says?: బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ (Sharukh Khan), దీపిక పదుకోన్ (deepika padukone) లీడ్ రోల్స్ లో నటించిన పఠాన్ (Pathaan) సినిమా అంచనాలకు అందని ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. వివాదాలు, బహిష్కరణ పిలుపులు సినిమా విజయానికి తోడ్పడ్డాయా?

పఠాన్ సినిమాలో దీపిక పదుకోన్, షారూఖ్ ఖాన్
పఠాన్ సినిమాలో దీపిక పదుకోన్, షారూఖ్ ఖాన్ (HT_PRINT)

What Pathaan's Success says?: మనోభావాలను దెబ్బతీసే సన్నివేశాలో, డైలాగులో, దుస్తులో, దృశ్యాల్లో ఉన్నాయంటూ సినిమాలను బాయ్ కాట్ (boycott) చేయాలనే పిలుపులు ఈ మధ్య కాలంలో భారత్ లో ఎక్కువయ్యాయి. ఇలాంటి కొన్ని వివాదాలు కొన్నిసార్లు ఆయా సినిమాల విజయాలకు దోహదపడ్డాయి. మరికొన్ని సార్లు సినిమా ఫ్లాప్ కావడానికి కూడా కొంతవరకు కారణమయ్యాయి. తాజాగా, బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన పఠాన్ (Pathaan) సినిమా కూడా పెద్ద ఎత్తున వివాదాల బారిన పడింది. అది షారూఖ్ (Sharukh Khan), దీపిక పదుకోన్ (deepika padukone) ల సినిమా కావడం, అందులో ఒక పాటలో దీపిక కాషాయ రంగు బికినీలో అభ్యంతరకర నృత్య రీతుల్లో పాల్గొనడం.. సినిమా (Pathaan) వివాదాస్పదం కావడానికి మరింత కారణమయ్యాయి. ఈ సినిమాను బహిష్కరించాలని బీజేపీ (BJP) నేతలు, పలు హిందుత్వ సంఘాలు పిలుపునిచ్చాయి. సోషల్ మీడియాలో కూడా ఈ బాయ్ కాట్ (boycott) పిలుపు బాగా ట్రెండ్ అయింది. ఒక దశలో ఈ ప్రచారం సినిమా (Pathaan) విజయావకాశాలను కచ్చితంగా దెబ్బతీస్తుందని భావించారు.

What Pathaan's Success says?: భారీ విజయం

కానీ, పఠాన్ (Pathaan) సినిమా కమర్షియల్ గా ఘన విజయం సాధించింది. విడుదలైన వారం లోపే రూ. 500 కోట్ల క్లబ్ లో చేరింది. సాధారణ మాస్, మసాలా సినిమా అయినప్పటికి, ఇలాంటి సినిమాలు గతంలో చాలానే వచ్చినప్పటికీ పఠాన్ (Pathaan) సినిమా అనూహ్యంగా అద్భుత విజయం సాధించింది. సాధారణంగా భారత్ లో దేశభక్తి సినిమాలు కచ్చితంగా విజయవంతమవుతుంటాయి. దానికి షారూఖ్ (Sharukh Khan), దీపిక (deepika padukone) ల ఇమేజ్, హాలీవుడ్ రేంజ్ టేకింగ్, క్యాచీ ట్యూన్స్ తోడయ్యాయి. వీటితో పాటు వివిధ వర్గాల నుంచి వచ్చిన బాయ్ కాట్ (boycott) పిలుపు కూడా సినిమా విజయానికి హెల్ప్ అయిందన్న వాదన వినిపిస్తోంది.

What Pathaan's Success says?: ఎందుకింత ఘనవిజయం?

మొదట్లో పఠాన్ (Pathaan) బహిష్కరణ (boycott) కోసం గట్టిగానే పిలుపులు వినిపించాయి. దేశవ్యాప్తంగా బీజేపీ నేతలు, హిందుత్వ సంఘాలు ఈ విషయంలో గట్టిగానే ఆన్ లైన్ లో, ఆఫ్ లైన్ లో ప్రచారం నిర్వహించాయి. అయితే, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా.. సినిమాల వంటి అనవసర వివాదాల జోలికి వెళ్లవద్దని, ముస్లింలకు దగ్గర కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అప్పటి నుంచి కొంతవరకు పఠాన్ పై విద్వేష ప్రచారం (hate speech) తగ్గుముఖం పట్టింది. అలాగే, సినిమా బావుంటే ఎలాంటి వివాదాలు కూడా ఆ సినిమా విజయాన్ని దెబ్బతీయలేవనే వాదన ఎలాగూ ఉంది. అది కాకుండా, పఠాన్ (Pathaan) విజయానికి పలు కారణాలను విశ్లేషకులు వివరిస్తున్నారు. అవి..

What Pathaan's Success says?: ఇవి కూడా కారణం కావచ్చు..

  • చాలా రోజుల తరువాత షారూఖ్ (Sharukh Khan) నటించిన సినిమా కావడం, దీపిక పదుకోన్ (deepika padukone) హీరోయిన్ కావడం సినిమా (Pathaan) పై ఆసక్తిని పెంచింది. సినిమా అభిమానులు, షారూఖ్ (Sharukh Khan) అభిమానులు ఏ వివాదాలను, ఏ బాయ్ కాట్ (boycott) పిలుపులను పట్టించుకోకుండా ఒకటికి రెండు సార్లు సినిమా చూశారు.
  • సాధారణ ప్రేక్షకులు కూడా పెద్ద ఎత్తున ఈ సినిమాను చూస్తున్నారు. విద్వేష ప్రచారం (hate speech) తమపై ప్రభావం చూపదని స్పష్టం చేయడానికి కూడా వారు పఠాన్ (Pathaan) చూడడానికి వెళ్తున్నారు.
  • సినిమాలకు రాజకీయ రంగు పులమకూడదనే భావనలో ఉన్నవారు, రాజకీయ ప్రయోజనాల కోసం విద్వేష ప్రచారం (hate speech) చేయడాన్ని వ్యతిరేకించేవారు ఈ సినిమా (Pathaan) ను చూస్తున్నారు.
  • పఠాన్ (Pathaan) సినిమాను బాయ్ కాట్ చేయాలన్న ప్రచారం ప్రారంభమైన నాటి నుంచి కూడా.. షారూఖ్ (Sharukh Khan) నుంచి కానీ, దీపిక పదుకోన్ (deepika padukone) నుంచి కానీ, సినిమా యూనిట్ నుంచి కానీ ఎలాంటి ప్రతిస్పందన వెలువడలేదు. ఎవరు కూడా ఈ ప్రచారంపై రియాక్ట్ కాలేదు.. వివాదాన్ని పెద్దది చేసే వ్యాఖ్యలు చేయలేదు. ఈ డిఫెన్సివ్ స్ట్రాటెజీ కూడా సినిమా (Pathaan) విజయానికి కారణమైంది.
  • దేశం ఎదుర్కొంటున్న నిజమైన సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే ఇలా బాయ్ కాట్ (boycott) పిలుపులు ఇస్తున్నారన్న విషయం తమకు అర్థమైందని స్పష్టం చేయడానికి కూడా ప్రేక్షకులు ఈ సినిమా (Pathaan) కోసం థీయేటర్లకు వెళ్తున్నారు.

Whats_app_banner