తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Salman Khan: స‌ల్మాన్ నోట స‌మంత పాట‌... తన ఫేవరేట్ సాంగ్ ఇదేనని చెప్పిన సల్లూభాయ్

Salman Khan: స‌ల్మాన్ నోట స‌మంత పాట‌... తన ఫేవరేట్ సాంగ్ ఇదేనని చెప్పిన సల్లూభాయ్

27 June 2022, 7:32 IST

  • ఫుష్ప(pushpa) సినిమాలోని ఊ అంటావా మావ పాట మ్యూజిక్ ల‌వ‌ర్స్ అంద‌రిలో ఫుల్ జోష్ ను నింపింది. తాజాగా ఈ పాట‌కు స్టార్ హీరో అభిమానిగా మారిపోయాడు. అత‌డు ఎవ‌రంటే...

స‌మంత‌
స‌మంత‌ (instagram)

స‌మంత‌

పుష్ప సినిమాలోని ఊ అంటావా మావ పాట సెన్సేష‌న‌ల్ హిట్‌గా నిలిచింది. భాషాభేదాల‌తో సంబంధం లేకుండా మ్యూజిక్ ల‌వ‌ర్స్ అంద‌రిని ఈ స్పెషల్సాంగ్ అలరించింది. ఇందులో అల్లు అర్జున్‌తో(allu arjun) క‌లిసి స‌మంత(samantha) వేసిన స్టెప్పుల‌కు అభిమానులు ఫిదా అయ్యారు. కెరీర్‌లో స‌మంత న‌టించిన తొలి ఐటెంసాంగ్ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.

ట్రెండింగ్ వార్తలు

Megalopolis Movie: 1977 లోఅనౌన్స్ - 2024లో రిలీజ్ - గాడ్ ఫాద‌ర్ డైరెక్ట‌ర్‌ వెయ్యి కోట్ల హాలీవుడ్ మూవీ ఏదో తెలుసా?

Raju Yadav: ఆ క్రికెటర్‌కు జరిగిన సర్జరీ ఆధారంగా గెటప్ శ్రీను రాజు యాదవ్ మూవీ: డైరెక్టర్

India Biggest Overseas Hit: చైనాలో 30 కోట్లకుపైగా టికెట్స్ అమ్ముడుపోయిన ఇండియన్ సినిమా ఇదే.. RRR కాదు!

Single Screen Theatres: సినీ ల‌వ‌ర్స్‌కు షాక్‌ - తెలంగాణ‌లో సింగిల్ స్క్రీన్ థియేట‌ర్లు మూత - కార‌ణం ఇదే

ఈ పాట‌లో అందాల ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్న‌ది. ఈ ప్ర‌త్యేక‌గీతంలో స‌మంత న‌టించ‌డానికి అంగీక‌రించ‌డం హాట్‌టాపిక్‌గా మారింది. ఇందులో స‌మంత ఎలా క‌నిపిస్తుందోన‌ని ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురుచూశారు. స‌మంత‌లోని గ్లామ‌ర్ కోణాన్ని కొత్త‌గా చూపించి అల‌రించారు ద‌ర్శ‌కుడు సుకుమార్‌. రెగ్యులర్ ఐటెంసాంగ్స్ భిన్నంగా ఈ పాటకు ట్యూన్స్ ను కంపోజ్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్(devisriprasad). మ్యూజిక్ ల‌వ‌ర్స్ తో స్టార్స్ సైతం ఊ అంటావా మావ పాట బాగుందంటూ ప్ర‌శంస‌లు కురిపించారు.

తాజాగా ఈ ఐటెం సాంగ్ కు మరో స్టార్ హీరో అభిమానిగా మారిపోయాడు. అత‌డు మ‌రెవ‌రో కాదు స‌ల్మాన్ ఖాన్‌(salman khan). ఐఫా అవార్డ్స్ వేడుక‌లో గ‌త ఏడాది విడుద‌లైన సినిమాల్లో మీలో స్ఫూర్తిని నింపిన బాగా ఇష్ట‌మైన పాట ఏద‌ని ఓ రిపోర్ట‌ర్ అడిగిన పాట‌కు ఊ అంటావా మావ పాట అని స‌ల్మాన్ ఖాన్ బ‌దులిచ్చాడు. అంతేకాకుండా ఈ పాట‌లోని కొన్ని లైన్స్‌ను పాడి వినిపించాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారుతోంది.

గత నెలలో దుబాయ్ లో ఐఫా వేడుకలో జరిగాయి. ఈ అవార్డు ఫంక్షన్ కు సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ‌త ఏడాది చివ‌ర‌లో విడుద‌లైన పుష్ప చిత్రం క‌మ‌ర్షియ‌ల్‌గా పెద్ద స‌క్సెస్‌గా నిలిచింది. టాలీవుడ్‌లో అతి పెద్ద విజ‌యాల్లో ఒక‌టిగా రికార్డును క్రియేట్ చేసింది. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి పుష్ప ది రైజ్ పేరుతో సీక్వెల్‌ను తెర‌కెక్కిస్తున్నారు ద‌ర్శ‌కుడు సుకుమార్‌.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం