తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Saindhav Villain: ఆయన బయోపిక్ చేయాలి.. తెలుగు ఫేవరేట్ హీరోల గురించి చెప్పిన సైంధవ్ విలన్

Saindhav Villain: ఆయన బయోపిక్ చేయాలి.. తెలుగు ఫేవరేట్ హీరోల గురించి చెప్పిన సైంధవ్ విలన్

Sanjiv Kumar HT Telugu

07 January 2024, 13:48 IST

  • Nawazuddin Siddiqui About Saindhav Movie: బాలీవుడ్ పాపులర్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ తెలుగులో విలన్‌గా ఎంట్రీ ఇస్తున్న సినిమా సైంధవ్. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్ ఫేవరేట్ హీరోలు, సైంధవ్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు.

ఆయన బయోపిక్ చేయాలి.. తెలుగు ఫేవరేట్ హీరో గురించి చెప్పిన సైంధవ్ విలన్
ఆయన బయోపిక్ చేయాలి.. తెలుగు ఫేవరేట్ హీరో గురించి చెప్పిన సైంధవ్ విలన్

ఆయన బయోపిక్ చేయాలి.. తెలుగు ఫేవరేట్ హీరో గురించి చెప్పిన సైంధవ్ విలన్

Saindhav Villain Nawazuddin Siddiqui Interview: విక్టరీ వెంకటేష్ 75వ చిత్రంగా వస్తోంది సైంధవ్. మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ సైంధవ్‌కు వెరీ ట్యాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల వస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ చిత్రంతో తెలుగులో పరిచయం అవుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Devara Fear Song: దేవర నుంచి వచ్చేసిన ఫియర్ సాంగ్.. పవర్‌ఫుల్‍గా ఫస్ట్ పాట: చూసేయండి

Adivi Sesh: హనీమూన్ ఎక్స్‌ప్రెస్ వదిలిన అడవి శేష్.. అన్నపూర్ణ ఏడెకరాల ప్రాంగణంలో అప్డేట్

Keerthy Suresh Kalki 2898 AD: కల్కి 2898 ఏడీలో కీర్తి సురేష్.. ప్రభాస్‌కు ప్రాణ మిత్రుడిగా మహానటి

Murari Heroin: మురారి సినిమాలో మహేశ్‍కు జోడీగా సోనాలీ కంటే ముందు ఈ బాలీవుడ్ భామను అనుకున్నారట!

ఈ నేపథ్యంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ ఇంటర్వ్యూలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. మీ నటనతో దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందారు.. తెలుగులోకి రావడానికి ఎందుకింత ఆలస్యమైయింది? అన్న ప్రశ్నకు..

"ప్రతి నటుడు ఒక మంచి కథ కోసం ఎదురుచూస్తాడు. నేను కూడా అలా సరైన స్క్రిప్ట్ కోసం ఎదురుచూశాను. అది 'సైంధవ్’ తో కుదిరింది. చాలా ఆసక్తికరమైన కథ ఇది. వెంకటేష్ గారితో కలసి పని చేయడం ఎవరికైనా ఒక డ్రీమ్. ఆయనతో కలసి పని చేయడం చాలా అనందంగా ఉంది" అని నవాజుద్దీన్ సిద్ధిఖీ అన్నారు.

విలన్ పాత్రలు తగ్గించారు.. సైంధవ్‌లో విలన్ గా కనిపించడానికి ప్రత్యేకమైన కారణం ఉందా ?

"నేను ఎప్పుడూ విలన్, హీరో పాత్ర అని చూడలేదు. పాత్ర ఆసక్తికరంగా ఉందా లేదా అనేదే ముఖ్యం. కొన్ని సార్లు పాజిటివ్ రోల్స్ కంటే నెగిటివ్ రోల్స్ లో పెర్ఫార్మ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సైంధవ్ లో దర్శకుడు శైలేష్ చాలా యూనిక్ రోల్ ని డిజైన్ చేశారు. నటించడానికి చాలా అవకాశం వున్న పాత్ర.

తొలి సినిమాకే డబ్బింగ్ చెప్పారు?

ఈ విషయంలో దర్శకుడు శైలేష్ ప్రేరణ ఇచ్చారు. నా నటనకు వేరే ఎవరో డబ్బింగ్ చెప్పడం కూడా నాకు ఇష్టం ఉండదు. పాత్రలో ఆ డెప్త్ రాదు. ఇందులో నాది హైదరాబాది పాత్ర. హిందీ, కొంచెం తెలుగు రెండూ మాట్లాడే పాత్ర. ఆ పాత్రకు నేను డబ్బింగ్ చెబితేనే న్యాయం జరుగుతుంది. భాషని, భావాన్ని అర్ధం చేసుకొని చెప్పాను. ఏదైనా కొత్త భాష నేర్చుకున్నప్పుడు మొదట్లో కొంత కష్టంగానే ఉంటుంది. భాష గురించి తెలుసుస్తున్న కొద్ది అది సులువైపోతుంది. నాకు ప్రామ్టింగ్ మీద నమ్మకం లేదు. ఎంత కష్టమైన నా డైలాగులని నేర్చుకుని చెప్పడమే ఇష్టం. సైంధవ్‌లో కూడా అలా ప్రతిది నేర్చుకొని చెప్పాను.

తెలుగు సినిమాలు చూస్తారా ?

చాలా తెలుగు సినిమాలు చూశాను. వెంకటేష్ గారు చేసిన ఫ్యామిలీ సబ్జెక్ట్ చూస్తుంటాను. ఆయన హిందీలో చేసిన అనారి సినిమా కూడా చూశాను. ప్రతి నటుడిని నుంచి నేర్చుకోవాల్సినది చాలా ఉంటుంది. వెంకటేష్ గారు చాలా కూల్ గా ఉంటారు. ఎప్పుడూ ప్రశాంతంగా కనిపిస్తారు. లొకేషన్ కి వచ్చిన ముందే డైలాగ్స్ అన్నీ నేర్చుకొని వస్తారు. యాక్షన్ సీన్స్ లో చాలా రిస్క్ లు తీసుకున్నారు. ఎలాంటి డూప్ లేకుండా స్వయంగా యాక్షన్ చేశారు. ఇందులో ఆయనది చాలా ఇంటెన్స్ క్యారెక్టర్. ఈ ప్రయాణంలో ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ముఖ్యంగా ఆయనకి సహనం ఎక్కువ. అది ఆయన నుంచి తప్పకుండా నేర్చుకోవాలి.

దర్శకుడు శైలేష్ గురించి ?

శైలేష్ చాలా ప్రొఫిషనల్ డైరెక్టర్. తనకి చాలా క్లారిటీ ఉంటుంది. ఎడిటింగ్ కూడా తన మైండ్ లో ఉంటుంది. ఎంత షూట్ చేయాలనేది తనకు పూర్తి క్లారిటీ ఉంది. నా క్యారెక్టర్ ని చాలా ఇంప్రవైజ్ చేశాడు. అవకాశం ఉన్న ప్రతి చోట మెరుగుపరిచాడు. తను కథ చెప్పినప్పుడే ఇది తప్పకుండా పెద్ద విజయం సాధించే చిత్రం అవుతుందనే నమ్మకం కలిగింది. కథని ఎంత అద్భుతంగా చెప్పాడో అంతే అద్భుతంగా చిత్రాన్ని తీశాడు. తను చిత్ర పరిశ్రమలోకి వచ్చి కేవలం ఐదేళ్లు అవుతుంది. కానీ చాలా అపూర్వమైన అనుభవం అతనిలో కనిపిస్తుంది. అన్ని విషయాలపై తనకి సంపూర్ణమైన స్పష్టత ఉంటుంది.

ఇందులో మీకు సవాల్ గా అనిపించిన అంశం ఏమిటి ?

హెవీ యాక్షన్ ఉన్న చిత్రమిది. యాక్షన్ సీక్వెన్స్ లు చేయడం కాస్త సవాల్ గా అనిపించింది. మీరు చూస్తున్నపుడు ఇందులో యాక్షన్ ఎంత కష్టమో అర్ధమౌతుంది. వెంకటేష్ గారితో కలసి పని చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. ఇందులో వెంకటేష్ గారు చాలా డిఫరెంట్ పాత్రలో కనిపిస్తారు. కొత్త అవతార్ లో వెంకీ గారిని చూస్తారు. ఆయన 75 వ చిత్రంలో భాగం కావడం ఆనందంగా ఉంది.

ఇందులో మీకు మెమరబుల్ మూమెంట్ ?

శ్రీలంక షెడ్యూల్ మర్చిపోలేను. సముద్రంలో బోట్ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నాం. బోట్ పై స్పీడ్ గా వెళుతున్నాను. అకస్మాత్తుగా ఒక పెద్ద అల వచ్చింది. దీంతో ఒక్కసారి బోట్ వదిలేసి అలతో పాటు పైకి లేచాను. అదృష్టవశాత్తు.. మళ్లీ బోట్ లోనే ల్యాండ్ అయ్యాను. (నవ్వుతూ) ఆ సీన్ సినిమాలో ఉంటుంది. ఆ సీక్వెన్స్ ని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ చిత్రం కోసం దాదాపు 40 రోజులు పని చేశాను. నా పాత్ర పట్ల చాలా తృప్తితో ఉన్నాను. చాలా మంచి క్యారెక్టర్. ప్రేక్షకులు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది.

టాలీవుడ్ లో మీ ఫేవరేట్ యాక్టర్ ?

అందరూ ఇష్టమే. ప్రతి ఒక్కరిలో ఒక యూనిక్ నెస్ ఉంటుంది. ఓషో పాత్ర చేయాలని ఉంది. అవకాశం వస్తే ఆయన బయోపిక్ చేస్తాను. టాలీవుడ్ చాలా ప్రొఫెషనల్ గా ఉంది. ఇక్కడ సమయపాలన చక్కగా ఉంది. నాని గారు, రానా గారితో కలసి మాట్లాడాను. వారితో కలసినప్పుడు నటన గురించి చాలా అంశాలని పంచుకున్నాం. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ చాలా ప్రొఫిషినల్ ప్రొడక్షన్ హౌస్. భవిష్యత్ లో వారు చేసే చిత్రాలలో నటించాలని కోరుకుంటాను.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం