తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Renu Desai In Tiger Nageswara Rao: టైగర్‌ నాగేశ్వర రావులో రేణు దేశాయ్‌.. ఆమె క్యారెక్టర్‌ ఏంటో తెలుసా?

Renu Desai in Tiger Nageswara Rao: టైగర్‌ నాగేశ్వర రావులో రేణు దేశాయ్‌.. ఆమె క్యారెక్టర్‌ ఏంటో తెలుసా?

HT Telugu Desk HT Telugu

29 September 2022, 17:05 IST

    • Renu Desai in Tiger Nageswara Rao: టైగర్‌ నాగేశ్వర రావు మూవీలో రేణు దేశాయ్‌ నటిస్తోంది. రవితేజ నటిస్తున్న ఈ పాన్‌ ఇండియా మూవీ నుంచి రేణు క్యారెక్టర్‌కు సంబంధించి ఓ గ్లింప్స్‌ను మేకర్స్‌ గురువారం (సెప్టెంబర్ 29) రిలీజ్‌ చేశారు.
టైగర్ నాగేశ్వర రావు మూవీలో రేణు దేశాయ్
టైగర్ నాగేశ్వర రావు మూవీలో రేణు దేశాయ్

టైగర్ నాగేశ్వర రావు మూవీలో రేణు దేశాయ్

Renu Desai in Tiger Nageswara Rao: మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న పాన్‌ ఇండియా మూవీ టైగర్‌ నాగేశ్వర రావు నుంచి గురువారం (సెప్టెంబర్‌ 29) ఓ అదిరిపోయే అప్‌డేట్‌ వచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో రేణు దేశాయ్‌ నటిస్తుండటం విశేషం. వంశీ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీని అభిషేక్ అగర్వాల్‌ ప్రొడ్యూస్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు

Prabhas: నా బుజ్జిని చూస్తారా: కల్కి 2898 ఏడీపై ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వైరల్

Prasanna Vadanam OTT Release date: ప్రసన్న వదనం ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ఇలా చేస్తే 24 గంటలు ముందుగానే చూడొచ్చు..

Devara fear song promo: దేవర ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ ప్రోమో చూశారా.. అదిరిపోయిన బీజీఎం

Suresh Babu on Theatres: ఓటీటీ మమ్మల్ని దెబ్బ కొడుతోంది.. థియేటర్లలను ఫంక్షన్ హాల్స్‌గా మార్చాల్సిందే: సురేశ్ బాబు

భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమాలో హేమలత లవణం అనే ముఖ్యమైన పాత్రలో రేణు దేశాయ్ కనిపించబోతోంది. ఆమె క్యారెక్టర్‌కు సంబంధించిన గ్లింప్స్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. 1970ల్లో స్టువర్ట్‌పురంలోని ఓ దొంగ బయోపిక్‌గా ఈ టైగర్ నాగేశ్వర రావు తెరకెక్కుతోంది. ఇందులో హేమలత లవణం చాలా ముఖ్యమైన, బలమైన క్యారెక్టర్‌. అందులో రేణు దేశాయ్‌ కనిపించనుండటం విశేషం.

హేమలత లవణం ఓ సామాజిక కార్యకర్త, రచయిత. సమాజంలో అంటరానితనంపై పోరాడిన వ్యక్తి. అలాంటి వ్యక్తి క్యారెక్టర్‌లో ఇప్పుడు రేణు కూడా చాలా పవర్‌ఫుల్‌గా కనిపించింది. 18 ఏళ్ల తర్వాత రేణు దేశాయ్‌ని బిగ్‌ స్క్రీన్‌పైకి స్వాగతిస్తున్నట్లుగా చెబుతూ ఆమె క్యారెక్టర్‌ను మేకర్స్‌ పరిచయం చేశారు. ఇందులో ఓ తెల్ల చీర కట్టుకొని మరో ఇద్దరితో కలిసి నడుచుకుంటూ వెళ్తున్న రేణుని చూపించారు.

ఈ క్యారెక్టర్‌ ఇంట్రడక్షన్‌ కోసం జీవీ ప్రకాశ్‌ ఇచ్చిన మ్యూజిక్‌ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఈ మూవీలో రవితేజ సరసన నుపుర్‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్‌ ఫిమేల్‌ లీడ్స్‌గా కనిపించారు. ఈ టైగర్‌ నాగేశ్వర రావు మూవీ తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీల్లో రానుంది.

ఇప్పటికే ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ బాలీవుడ్ విలక్షణ నటుడు కీలక పాత్ర పోషిస్తున్నారని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి నిర్మాత అయిన అభిషేక్ అగర్వాల్ గతంలో నిర్మించిన కశ్మీర్ ఫైల్స్ చిత్రంలో అనుపమ్ పోషించిన పుష్కర్ నాథ్ పండిట్ పాత్ర సినిమాకే హైలెట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం