Emergency: జయప్రకాశ్‌ నారాయణ్‌గా అనుపమ్‌ ఖేర్‌ లుక్‌ వైరల్‌-anupam kher look as jayaprakash narayan from emergency going viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Anupam Kher Look As Jayaprakash Narayan From Emergency Going Viral

Emergency: జయప్రకాశ్‌ నారాయణ్‌గా అనుపమ్‌ ఖేర్‌ లుక్‌ వైరల్‌

HT Telugu Desk HT Telugu
Jul 22, 2022 01:19 PM IST

Emergency: ఎమర్జెన్సీ మూవీలో లోక్‌ నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌గా కనిపిస్తున్న అనుపమ ఖేర్‌ లుక్‌ ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఈ మూవీని కంగనా రనౌత్‌ డైరెక్ట్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

ఎమర్జెన్సీ మూవీలో ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్
ఎమర్జెన్సీ మూవీలో ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్ (Twitter)

స్వతంత్ర భారతదేశంలో ఓ చీకటి అధ్యాయంగా మిగిలిపోయిన ఎమర్జెన్సీపై అదే పేరుతో బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ఓ మూవీ తెరకెక్కిస్తోంది. ఇందులో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కంగనానే నటిస్తోంది. ఈ మధ్యే ఆమె లుక్‌ బయటకు రాగా.. అది కాస్తా వైరల్‌ అయింది. అచ్చూ ఇందిరాగాంధీలాగా కనిపించిన కంగనా.. ఆమె హావభావాలను కూడా అచ్చుగుద్దినట్లు దించేసింది.

ఇక ఇప్పుడు ఆ ఎమర్జెన్సీని వ్యతిరేకించిన స్వాతంత్ర్య సమరయోధుడు, భారతరత్న లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ పాత్రలో నటిస్తున్న అనుపమ్‌ ఖేర్‌ లుక్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. జేపీ క్యారెక్టర్‌లో తన లుక్‌కు సంబంధించిన ఫొటోను అనుపమ్‌ తన ట్విటర్‌లో షేర్ చేశాడు. "నిజమైన రెబల్‌, ధైర్యంగా ప్రశ్నించిన వ్యక్తి జయప్రకాశ్‌ నారాయణ్‌ పాత్రను కంగనా రనౌత్‌ నటిస్తున్న ఎమర్జెన్సీలో మూవీలో పోషిస్తున్నందుకు సంతోషంగా, గర్వంగా ఉంది" అని అనుపమ్‌ కామెంట్‌ చేశాడు.

1970ల్లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ నియంతృత్వ పోకడలను ప్రశ్నించి, ఆమెకు ఎదురుతిరిగిన నేతగా జయప్రకాశ్‌ నారాయణ్‌కు పేరుంది. భారత స్వాతంత్య్రోద్యమంలో జరిగిన ప్రధానమైన క్విట్‌ ఇండియా మూవ్‌మెంట్‌లోనూ ఆయన పాలుపంచుకున్నారు. ఎమర్జెన్సీని ధిక్కరించిన నేతల్లో జేపీ ముఖ్యమైన వారు. ఆయన పాత్రలో ఇప్పుడు అనుపమ్‌ ఖేర్‌ నటిస్తున్నాడు.

ఎమర్జెన్సీ మూవీ ఫస్ట్‌ లుక్‌, టీజర్‌ను ఈనెల 14న మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. అందులో ఇందిరా గాంధీ పాత్రలో ఎంతో గంభీరంగా కనిపించింది కంగనా రనౌత్‌. ఎంతో జనాదరణ పొందిన నేతగా పేరున్నా.. ఎమర్జెన్సీ అనేది ఇందిరా గాంధీ జీవితంలో ఓ మాయనిమచ్చలా మిగిలిపోయింది. ఆ చీకటి రోజులను ఇప్పుడు కంగనా తన మూవీలో ఎలా చూపించబోతోంది అన్నది ఆసక్తిగా మారింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం