తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mission Majnu Teaser: చరిత్ర మరిచిన హీరో కథ.. రష్మిక మరో బాలీవుడ్ చిత్రం

Mission Majnu teaser: చరిత్ర మరిచిన హీరో కథ.. రష్మిక మరో బాలీవుడ్ చిత్రం

16 December 2022, 21:43 IST

    • Mission Majnu teaser: రష్మికా మందన్నా నటించిన మరో బాలీవుడ్ చిత్రం మిషన్ మజ్ను. సిద్ధార్థ్ ఆనంద్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ వేదికగా జనవరి 20న విడుదల కానుంది. యాక్షన్ సన్నివేశాలతో ఈ టీజర్ ఆసక్తికరంగా ఉంది.
మిషన్ మజ్ను టీజర్
మిషన్ మజ్ను టీజర్

మిషన్ మజ్ను టీజర్

Mission Majnu teaser: నేషనల్ క్రష్ రష్మికా మందన్నా.. భాషతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. ప్రస్తుతం బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టిన ఈ అమ్మడు అక్కడ ఫుల్ బిజీగా ఉంది. అక్టోబరులో గుడ్‌బై చిత్రంతో బాలీవుడ్ తెరంగేట్రం చేసిన ఈ రష్మిక.. ఇప్పుడు మరో సినిమాతో హిందీ ఆడియెన్స్‌ను పలకరించనుంది. అదే మిషన్ మజ్ను. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా చేస్తున్నాడు. షాంతానూ బాగ్చీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా చేస్తోంది. థియేటర్లలో కాకుండా నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా విడుదల కాబోతుంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్.

ట్రెండింగ్ వార్తలు

Salman Khan: సల్మాన్ ఖాన్ ఆ గుడికి వచ్చి క్షమాపణ అడగాలి.. అలాంటి తప్పు మళ్లీ చేయనని ప్రమాణం చేయాలి: బిష్ణోయ్ సమాజం

Inception 2: నోలాన్ మాస్టర్‌పీస్ మూవీ ఇన్‍సెప్షన్‍కు సీక్వెల్ రానుందా?

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ వదులుకున్న నాలుగు సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఇవే

Prasar Bharati OTT: ప్రభుత్వ ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఆనెలలో ప్రారంభం కానుందా?

ఈ టీజర్ చూస్తుంటే యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వార్, సీక్రెట్ ఏజెంట్ తరహాలో ఉండబోతున్నట్లు చూస్తే అర్థమవుతుంది. ఇందులో సిద్ధార్థ్ తనదైన యాక్షన్ స్టంట్లతో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రం భారత్‌లో అతిపెద్ద కోవర్ట్ ఆపరేషన్ గురించి ఉంటుందని సమాచారం. టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది.

ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా .. రవిసింగ్ బవేజా అనే పాత్రలో నటిస్తుండగా.. రష్మికా.. జ్యోతీ చౌదరీ పాత్రలో కనిపంచనుంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ వేదికగా 2023 జనవరి 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో రష్మిక విభిన్నంగా కనిపిస్తోంది. పూర్తి స్థాయి నార్త్ అమ్మాయి మాదిరి అలరించింది.

ఆర్ఎస్‌వీపీ మూవీస్, గిల్టీ బై అసొసియేషన్, మీడియా ఎల్ఎల్‌పీ పతాకాలంపై రోనా స్క్రీవాలా, అమర్ బుటాల, గరీమా మెహతా నిర్మిస్తున్నారు. శాంతాను బాగ్చీ దర్శకత్వం వహించారు. తనిష్క్ బాగ్చీ, రోచక్ కోహ్లీ, ఆర్కో ప్రావో ముఖర్జి స్వరాలు సమకూర్చగా..కేతన్ సోధా బ్యాక్ గ్రౌండ్ స్కోరు అందించారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ వేదికగా జనవరి 20న విడుదల కానుంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం