తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Adipurush Hanuman Poster: ఆదిపురుష్ నుంచి మరో అప్డేట్.. హనుమాన్ పోస్టర్ రిలీజ్ చేసిన ప్రభాస్

Adipurush Hanuman Poster: ఆదిపురుష్ నుంచి మరో అప్డేట్.. హనుమాన్ పోస్టర్ రిలీజ్ చేసిన ప్రభాస్

06 April 2023, 8:16 IST

    • Adipurush Hanuman Poster: ఆదిపురుష్ మూవీ నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ సినిమాలోని హనుమంతుడి పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ప్రభాస్ ఈ లుక్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ఆదిపురుష్ నుంచి హనుమాన్ పోస్టర్ విడుదల
ఆదిపురుష్ నుంచి హనుమాన్ పోస్టర్ విడుదల

ఆదిపురుష్ నుంచి హనుమాన్ పోస్టర్ విడుదల

Adipurush Hanuman Poster: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ నుంచి ఇటీవలే ఓ సరికొత్త పోస్టర్ విడుదలైన సంగతి తెలిసిందే. శ్రీ రామనవమి కానుకగా ఈ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. తాజాగా మరో సరికొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. నేడు హనుమాన్ జయంతి సందర్భంగా ఈ సినిమాలోని హనుమంతుడి లుక్‌ను రిలీజ్ చేసింది. ఈ మేరకు ప్రభాస్ తన సోషల్ మీడియా వేదికగా ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. దేవదత్త నాగే ఈ సినిమాలో హనుమాన్ నటిస్తుండటంతో ఆయన పాత్రకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Siddharth40: సిద్ధార్థ్ హీరోగా 40వ సినిమా.. తెలుగు తమిళంలో ద్విభాషా చిత్రం.. డైరెక్టర్ ఎవరంటే?

Devara vs NBK 109: బాక్సాఫీస్ వద్ద బాబాయి, అబ్బాయి పోటీ ఉండనుందా?

Kalki 2898 AD Bujji: ‘బుజ్జీ’ కోసం భారీ ఈవెంట్ ప్లాన్ చేసిన కల్కి 2898 ఏడీ టీమ్.. ఎప్పుడు.. ఎక్కడ అంటే!

OTT: ఓటీటీలో అదరగొడుతున్న అభినవ్ గోమఠం కామెడీ డ్రామా సినిమా.. మరో మైల్‍స్టోన్ దాటేసింది

అంతేకాకుండా హనుంతుడి గురించి వివరిస్తూ పోస్టర్‌ను షేర్ చేశారు ప్రభాస్. "రామ్ కే భక్త్ అవుర్ రామ్ కథ కే ప్రాణ్.. జై పవనపుత్ర హనుమాన్" అంటూ ఆదిపురుష్‌లోని హనుమాన్ లుక్‌ను విడుదల చేశారు. అంతేకాకుండా ఈ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలియజేశారు.

ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి వివాదాలు తలెత్తుతున్నాయి. రామాయణం ఆధారంగా తీసిన ఆదిపురుష్‌లో రాముడిగా ప్రభాస్ వేషధారణ దగ్గర నుంచి గ్రాఫిక్స్ వరకు పలు విమర్శలను ఎదుర్కొంటోంది చిత్రబృందం. ఇటీవల శ్రీ రామ నవమికి విడుదలై పోస్టర్‌పై కూడా విమర్శలు వచ్చాయి. తాజాగా హనుమాన్ పోస్టర్ విడుదలవడంతో ఈ సారి ఎలాంటి వివాదాలో తలెత్తుతాయో చూడాలి.

రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా.. సీతగా బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు. అంతేకాకుండా టీ-సిరీస్, రెట్రోపైల్స్ బ్యానర్లలో భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్ నిర్మిస్తున్నారు. తన్హాజీ ఫేమ్ ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సాచేత్ పరంపరా సంగీతాన్ని సమకూరుస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ఏకకాలంలో విడుదల కానుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం