Adipurush Poster Release: 'మంత్రం కన్నా నీ నామం గొప్పది.. జై శ్రీరామ్'.. ఆదిపురుష్ పోస్టర్ విడుదల-prabhas shares adipurush latest poster on the occasion of sri rama navami ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Prabhas Shares Adipurush Latest Poster On The Occasion Of Sri Rama Navami

Adipurush Poster Release: 'మంత్రం కన్నా నీ నామం గొప్పది.. జై శ్రీరామ్'.. ఆదిపురుష్ పోస్టర్ విడుదల

Maragani Govardhan HT Telugu
Mar 30, 2023 07:38 AM IST

Adipurush Poster Release: ప్రభాస్ నటించిన సరికొత్త చిత్రం ఆదిపురుష్. ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. శ్రీరామనవమి సందర్భంగా లేటెస్ట్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ జూన్ 16న విడుదల కానుంది.

ఆదిపురుష్ లేటెస్ట్ పోస్టర్
ఆదిపురుష్ లేటెస్ట్ పోస్టర్

Adipurush Poster Release: పాన్ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిదే. రామాయణం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ పౌరాణిక చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీత పాత్రలో మెరిసింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల కాగా.. తాజాగా సరికొత్త అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. ఈ రోజు శ్రీరామ నవమి సందర్భంగా ఆదిపురుష్ టీమ్ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.

సీత, లక్ష్మణ, ఆంజనేయ సమేతంగా ఉన్న శ్రీ రాముడు పోస్టర్‍‌ను విడుదల చేసింది. అటు, ఇటు సీత, లక్ష్మణులు, పాదాల వద్ద హనుమంతుడు నమస్కరిస్తున్నట్లున్న ఈ ఫొటో ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రభాస్ షేర్ చేస్తూ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు తెలిపారు.

“మంత్రం కన్నా గొప్పది నీ నామం జై శ్రీ రామ్” అంటూ ప్రభాస్ ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. హిందీలోనూ ఈ వాక్యాలను రాశారు ప్రభాస్. ప్రస్తుతం ఈ పోస్టర్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇప్పటి వరకు యానిమేషన్ రూపంలో ఉన్న ఫొటోలను, టీజర్లను విడుదల చేసిన ఆదిపురుష్ టీమ్ పై విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. అయితే తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ మాత్రం లైవ్లీగా ఉంది. నిజంగానే ప్రభాస్, కృతి నటించారన్నట్లుగా ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. జూన్ 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా.. సీతగా బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు. అంతేకాకుండా టీ-సిరీస్, రెట్రోపైల్స్ బ్యానర్లలో భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్ నిర్మిస్తున్నారు. తన్హాజీ ఫేమ్ ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సాచేత్ పరంపరా సంగీతాన్ని సమకూరుస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ఏకకాలంలో విడుదల కానుంది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.