తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Payal Rajput Tamil Debut: పాయ‌ల్ రాజ్‌పుత్‌ త‌మిళ్ డెబ్యూ సినిమా ఫ‌స్ట్‌లుక్ రిలీజ్‌...

payal rajput tamil debut: పాయ‌ల్ రాజ్‌పుత్‌ త‌మిళ్ డెబ్యూ సినిమా ఫ‌స్ట్‌లుక్ రిలీజ్‌...

06 June 2022, 12:19 IST

  • ఆర్ఎక్స్  100 తో పాటు తెలుగులో ప‌లు చిత్రాల్లో గ్లామ‌ర్ పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్న‌ది పాయ‌ల్ రాజ్‌పుత్‌. త్వ‌ర‌లోనే హీరోయిన్ గా  గోల్‌మాల్ సినిమాతో త‌మిళంలో ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌దామె. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను సోమ‌వారం ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది పాయల్ రాజ్ పుత్...

పాయ‌ల్ రాజ్‌పుత్‌
పాయ‌ల్ రాజ్‌పుత్‌ (instagram)

పాయ‌ల్ రాజ్‌పుత్‌

ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది పంజాబీ సుందరి పాయల్ రాజ్‌పుత్‌. అభినయం కంటే అందంతోనే ఈ సినిమాలో ఆకట్టుకున్న ఆమె యువతరం కలల రాణిగా మారిపోయింది. గ్లామర్ నమ్ముకొని తెలుగు చిత్రసీమలో లో నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉన్న ఈ ముద్దుగుమ్మ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లపై దృష్టిసారిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Kiara Advani: గేమ్‍ ఛేంజర్ ‘జరగండి’ పాటపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెెప్పిన కియారా.. ఈ సాంగ్‍కు ఎన్ని రోజుల షూటింగ్ అంటే..

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

తాజాగా పాయల్ రాజ్ పుత్ త‌మిళంలో అరంగేట్రం చేయ‌బోతున్న‌ది. గోల్‌మాల్ పేరుతో ఓ సినిమా చేస్తోంది. ఈ చిత్రంలో జీవా,మిర్చి శివ హీరోలుగా న‌టిస్తున్నారు. పాయ‌ల్ రాజ్‌పుత్‌తో పాటు తాన్య‌హోప్ మ‌రో హీరోయిన్ గా న‌టిస్తోంది. సోమవారం ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను పాయ‌ల్ రాజ్‌పుత్ త‌న ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానుల‌తో పంచుకున్న‌ది. నాయ‌కానాయిక‌ల‌తో పాటు జంతువుల ఫొటోలు పోస్ట‌ర్‌లో ఉండ‌టం ఆస‌క్తిని పంచుతోంది.

త‌మిళంలో తాను న‌టించిన తొలి సినిమాను ప్రేక్ష‌కుల‌తో క‌లిసి చూసేందుకు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న‌ట్లు పాయ‌ల్ రాజ్‌పుత్ పేర్కొన్న‌ది. మారిష‌స్ బ్యాక్‌డ్రాప్‌లో ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి పొన్ కుమార‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం తెలుగులో మంచు విష్ణుతో ఓ సినిమా చేస్తోంది పాయ‌ల్ రాజ్‌పుత్‌. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.

 

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం