తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Jeevan Labh Plan : Lic సూపర్ ప్లాన్.. రూ. 233 పెట్టుబడితో 17 లక్షల రిటర్న్

Jeevan Labh Plan : LIC సూపర్ ప్లాన్.. రూ. 233 పెట్టుబడితో 17 లక్షల రిటర్న్

HT Telugu Desk HT Telugu

17 April 2022, 15:21 IST

google News
    • LIC జీవన్ లాభ్ పాలసీలో పెట్టుబడి పెట్టడం ద్వారా అద్భుతమైన రిటర్న్స్ అందిస్తుంది. ప్రతి నెలా కేవలం రూ. 233 డిపాజిట్ చేయడం ద్వారా చివరిలో 17 లక్షల భారీ ఫండ్‌ను పొందవచ్చు. ఇక ఈ పాలసీ గురించి మరింతగా తెలుసుకుందాం.
LIC Jeevan Labh Plan
LIC Jeevan Labh Plan

LIC Jeevan Labh Plan

LIC Jeevan Labh Policy : దేశంలోనే అతిపెద్ద బీమా కంపెనీ అయిన LIC తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు అద్భుత పథకాలను అందిస్తూనే ఉంటుంది. ఎల్‌ఐసి అన్ని సామాజిక వర్గాలను ఆకట్టుకునే విధంగా పథకాలను రూపొందిస్తుంది. మీరు కూడా సురక్షితమైన పెట్టుబడులతో మిలియనీర్ కావాలనుకుంటే, LIC పాలసీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో LIC జీవన్ లాభ్ పాలసీ ఒకటి. ఇది ఎండోమెంట్ పాలసీ. ఈ పాలసీతో పాలసీదారులు బీమా రక్షణతో పాటు పొదుపు ప్రయోజనాలను పొందుతారు. దీనిలో మీరు ప్రతి నెలా కేవలం రూ. 233 డిపాజిట్ చేయడం ద్వారా చివరిలో 17 లక్షల భారీ ఫండ్‌ను పొందవచ్చు. ఇక ఈ పాలసీ గురించి మరింతగా తెలుసుకుందాం.

LIC జీవన్ లాభ్

LIC జీవన్ లాభ్ పాలసీకి షేర్ మార్కెట్‌తో ఎలాంటి సంబంధం లేదు. మార్కెట్ పెరిగినా, తగ్గినా, అది మీ పెట్టుబడిపై ఏమాత్రం ప్రభావం చూపదు. అంటే, ఈ పథకంలో మీ డబ్బు పూర్తిగా సురక్షితం. ఇది పరిమిత ప్రీమియం ప్లాన్. పిల్లల వివాహాలను, చదువులు, ఆస్తుల కొనుగోలు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్లాన్‌ను రూపొందించారు.

LIC జీవన్ లాభ్ ప్లాన్ ఫీచర్ పాలసీ లాభాలతో పాటు సురిక్షితమైన పెట్టుబడి.

8 నుంచి 59 ఏళ్ల లోపు వారు ఈ పాలసీని సులభంగా తీసుకోవచ్చు.

పాలసీ వ్యవధి 16 నుంచి 25 ఏళ్ల వరకు ఉంటుంది

కనీసం రూ.2 లక్షల హామీ మొత్తాన్ని తీసుకోవాలి

గరిష్ట మొత్తంపై పరిమితి లేదు.

3 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లింపుపై రుణ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.

ప్రీమియంపై పన్ను మినహాయింపు, పాలసీ హోల్డర్ మరణిస్తే.. నామినీకి సమ్ అష్యూర్డ్ , బోనస్ ప్రయోజనాలు లభిస్తాయి.

నామినీకి కలిగే ప్రయోజనం

పాలసీ వ్యవధిలో పాలసీదారు మరణిస్తే.. అప్పటికే అన్ని ప్రీమియంలను చెల్లించినట్లయితే, నామినీకి డెత్ బెనిఫిట్‌గా డెత్ సమ్ అష్యూర్డ్, సింపుల్ రివర్షనరీ బోనస్, ఫైనల్ అడిషన్ బోనస్ లభిస్తాయి. అంటే, నామినీకి అదనపు బీమా మొత్తం లభిస్తుంది.

తదుపరి వ్యాసం