తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Most Viewed Movies And Shows: ఓటీటీల్లో గత వారం ఎక్కువ మంది చూసిన సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే.. ఆ సిరీసే టాప్

OTT Most viewed movies and shows: ఓటీటీల్లో గత వారం ఎక్కువ మంది చూసిన సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే.. ఆ సిరీసే టాప్

Hari Prasad S HT Telugu

19 March 2024, 8:13 IST

    • OTT Most viewed movies and shows: ఓటీటీల్లో గత వారం ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్, సినిమాల జాబితాను ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేసింది. వీటిలో మహారాణి వెబ్ సిరీస్ టాప్ లో ఉండటం విశేషం.
ఓటీటీల్లో గత వారం ఎక్కువ మంది చూసిన సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే.. ఆ సిరీసే టాప్
ఓటీటీల్లో గత వారం ఎక్కువ మంది చూసిన సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే.. ఆ సిరీసే టాప్

ఓటీటీల్లో గత వారం ఎక్కువ మంది చూసిన సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే.. ఆ సిరీసే టాప్

OTT Most viewed movies and shows: ఓటీటీల్లో రిలీజ్ అవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లలో వేటిని ప్రేక్షకులు ఎక్కువగా చూస్తున్నారు? దీనిపై ఆర్మాక్స్ మీడియా ప్రతి వారం ఓ రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది. దీని ప్రకారం ప్రతి వారం ఓటీటీల్లో ఎక్కువ వ్యూస్ పొందిన మూవీస్, వెబ్ సిరీస్ ఏవో తెలుసుకోవచ్చు. తాజాగా మార్చి 11 నుంచి మార్చి 17 మధ్య ముగిసిన వారంలో ఎక్కువ వ్యూస్ పొందిన టాప్ 5 మూవీస్, సిరీస్ ఏవో చూడండి.

ట్రెండింగ్ వార్తలు

PM Narendra Modi Biopic: ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో కట్టప్ప!: వివరాలివే

TV Serial Actor Chandu: ఆమె వల్లే మేం విడిపోయాం.. ఆత్మహత్య చేసుకుంటాడనుకోలేదు: సీరియల్ నటుడు చందూ భార్య

OTT Movie: చైన్ బిజినెస్ మోసాలు.. ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Laya: ఆ డైరెక్టర్ చంపుతానని బెదిరించాడు.. 18 ఏళ్లకు నిజం బయటపెట్టిన హీరోయిన్ లయ

ఓటీటీల్లో టాప్ 5 ఇవే..

ఆర్మాక్స్ మీడియా రిపోర్టు ప్రకారం.. గత వారం ఎక్కువ మంది చూసిన టాప్ 5 సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే. అయితే ఇవి కేవలం ఇండియాలో నమోదైన వ్యూస్. అందులోనూ హిందీకి సంబంధించినవే.

మహారాణి వెబ్ సిరీస్- సోనీలివ్

మహారాణి మూడో సీజన్ మార్చి 8న సోనీ లివ్ ఓటీటీలోకి వచ్చింది. ఈ పొలిటికల్ డ్రామా సిరీస్ కు మంచి ఆదరణ లభిస్తోంది. మొదటి రెండు సీజన్లలాగే మూడో సీజన్ కూడా దూసుకెళ్తోంది. తాజాగా గత వారం కూడా ఈ మహారాణి వెబ్ సిరీస్ అత్యధిక వ్యూస్ సంపాదించిన వెబ్ సిరీస్ గా నిలిచింది. ఈ సిరీస్ కు మొత్తం 46 లక్షల వ్యూస్ రావడం విశేషం. రాణీ భారతి అనే పాత్రలో హుమా ఖురేషీ నటించిన ఈ సిరీస్ ను సుభాష్ కపూర్ డైరెక్ట్ చేశాడు.

షోటైమ్ - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లోకి వచ్చిన లేటెస్ట్ వెబ్ సిరీస్ షోటైమ్. బాలీవుడ్ ఇండస్ట్రీ చుట్టూ తిరిగే సిరీస్ ఇది. ప్రస్తుతానికి నాలుగు ఎపిసోడ్ల పార్ట్ 1 మాత్రం స్ట్రీమింగ్ అవుతోంది. కరణ్ జోహార్ నిర్మించిన ఈ షోటైమ్ సిరీస్ లో ఇమ్రాన్ హష్మి, మౌనీ రాయ్, నసీరుద్దీన్ షా, మహిమా మఖ్వానా నటించారు. ఈ వెబ్ సిరీస్ కు గత వారం 44 లక్షల వ్యూస్ వచ్చాయి.

షార్క్ ట్యాంక్ ఇండియా - సోనీలివ్

సోనీలివ్ ఓటీటీలో వస్తున్న ఓ వినూత్నమైన షో ఇది. పారిశ్రామికవేత్తలుగా మారాలనుకుంటున్న కొందరు యువత ఈ షోకి వచ్చే ఇన్వెస్టర్లకు తమ బిజినెస్ ప్లాన్ ను వివరిస్తారు. అది నచ్చితే అందులో వాళ్లు ఇన్వెస్ట్ చేస్తారు. ప్రస్తుతం షార్క్ ట్యాంక్ ఇండియా మూడో సీజన్ స్ట్రీమింగ్ అవుతోంది. గత వారం ఈ షోకి 42 లక్షల వ్యూస్ వచ్చాయి.

మర్డర్ ముబారక్ - నెట్‌ఫ్లిక్స్

నెట్‌ఫ్లిక్స్ లో మార్చి 15న రిలీజైన మర్డర్ మిస్టరీ మూవీ ఇది. ఢిల్లీలోని ఓ క్లబ్ లో జరిగే హత్య, దానిచుట్టూ తిరిగే ఇన్వెస్టిగేషనే ఈ సినిమా. మర్డర్ ముబారక్ మూవీలో బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటులు విజయ్ వర్మ, కరిష్మా కపూర్, డింపుల్ కపాడియా, సంజయ్ కపూర్, పంకజ్ త్రిపాఠీలాంటి వాళ్లు నటించారు. ఈ మూవీకి గత వారం 33 లక్షల వ్యూస్ వచ్చాయి.

బిగ్ గర్ల్స్ డోన్ట్ క్రై- ప్రైమ్ వీడియో

ఓ బోర్డింగ్ స్కూల్, అందులోని నలుగురి ఫ్రెండ్స్ చుట్టూ తిరిగే కథే ఈ బిగ్ గర్ల్స్ డోన్ట్ క్రై. ఈ షో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. గత వారం ఈ సిరీస్ కు 28 లక్షల వ్యూస్ రావడం విశేషం.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం