Netflix OTT: నెట్‌ఫ్లిక్స్‌లో ఈ టాప్ 6 ట్రెండింగ్ సినిమాలు అస్సలు మిస్ అవ్వొద్దు!
Netflix Trending Movies This Week: ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌తో సినిమాలు వస్తుంటాయి. అలా వచ్చిన వాటిలో ఈ వారం 6 బెస్ట్ క్రేజీ సినిమాలు ఉన్నాయి. మరి ఈ మూవీస్ ఏంటీ, వాటి జోనర్స్ ఏంటో తెలుసుకుందాం.
Netflix OTT Trending Movies: ఓటీటీ ఆడియెన్స్ అభిరుచికి తగినట్లుగా డిఫరెంట్ కంటెంట్‌తో వచ్చి ఎంటర్టైన్ చేస్తుంటుంది ప్రముఖ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్. హారర్, థ్రిల్లర్, క్రైమ్, ఫాంటసీ, అడ్వెంచర్, రొమాన్స్, కామెడీ ఇలా అనేక రకాల జోనర్లలో సినిమాలు, వెబ్ సిరీసులను ఓటీటీ లవర్స్ ముందు పెడుతుంటుంది. ఈ వారం కూడా అనేక సినిమాలు, సిరీసులు నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజయ్యాయి. వాటిలో ఈ వారం అస్సలు మిస్ కానీ టాప్ 6 బెస్ట్ సినిమాలు ఏంటీ, వాటి జోనర్స్ ఏంటో చూద్దాం.
మర్డర్ ముబారక్ ఓటీటీ
మర్డర్ ముబారక్ సినిమా ఒక క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్. బాలీవుడ్ హాట్ బ్యూటి సారా అలీ ఖాన్, వర్సటైల్ యాక్టర్ పంకజ్ త్రిపాఠి, కరిష్మా కపూర్, సంజయ్ కపూర్, విజయ్ వర్మ, డింపుల్ కపాడియా వంటి స్టార్ నటీనటులు యాక్ట్ చేసిన ఈ మూవీని హోమి అదజానియా దర్శకత్వం వహించారు. ఓ హోటల్‌లో జరిగిన హత్య నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. మార్చి 15 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న మర్డర్ ముబారక్ మూవీ టాప్ 1 ట్రెండింగ్‌లో ఉంది.
డామ్‌సెల్ ఓటీటీ
ఫాంటసీ అడ్వెంచర్ అండ్ సర్వైవల్ థ్రిలర్ సినిమాగా వచ్చింది డామ్‌సెల్. పెళ్లి అనంతరం అరా రాజ్యపు యువరాజు తన భార్య ఎలోడిని ఫైర్ డ్రాగెన్ ఉన్న గుహలో పడేస్తాడు. ఆ డ్రాగెన్ బారి నుంచి ప్రాణాలతో ఎలోడి రాకుమార్తె ఎలా బయటపడిందనేదే సినిమా కథ. సినిమాలో విజువల్స్, డ్రాగెన్‌తో యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. మార్చి 8 నుంచి ఇంగ్లీషు, తెలుగు, హిందీ, తమిళంలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో 2 స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది.
అన్వేషిప్పిన్ కండేతుమ్
మలయాళ చిత్ర పరిశ్రమలో సూపర్ హిట్ సాధించిన సినిమా అన్వేషిప్పిన్ కండేతుమ్. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ జోనర్ మూవీ. సాధారణంగా ఇలాంటి జోనర్స్‌లో ఒక కేసునే ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు. కానీ, ఈ మూవీలో రెండు హత్య కేసులను ఛేదించే సీన్స్ గ్రిప్పింగ్‌గా, ఎంగేజింగ్‌గా ఉంటాయి. టొవినో థామస్ లీడ్ రోల్‌లో నటించిన ఈ సినిమా మార్చి 8 నుంచి అన్ని భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రదర్శించబడుతోంది. ఈ సినిమా ట్రెండింగ్‌లో మూడో స్థానం సంపాదించుకుంది.
మెర్రీ క్రిస్మస్ ఓటీటీ
విజయ్ సేతుపతి, కత్రీనా కైఫ్ తొలిసారిగా జోడీ కట్టిన సినిమా మెర్రీ క్రిస్మస్. ఇది కూడా ఒక మర్డర్ మిస్టరీ మూవీనే. క్రిస్మస్ రోజున జరిగిన ఓ హత్యకు గల కారణాలు ఏంటీ అని తెలుసుకునే నేపథ్యంలో సాగుతుంది. ఫస్టాఫ్ కాస్తా స్లోగా అనిపించినా తర్వాత ఒక్కో ట్విస్ట్‌తో మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది ఈ సినిమా. దీనికి ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం చేశారు. ఇక హిందీతోపాటు, తెలుగు ఇతర భాషల్లో స్ట్రీమింగ్ అవుతోన్న మెర్రీ క్రిస్మస్ టాప్ 4 స్థానం సంపాదించుకుంది.
తుండు
ఓటీటీలోకి వచ్చిన మరో మలయాళీ హిట్ మూవీ తుండు. రణం, ఖతర్నాక్ చిత్రాలతో తెలుగు వారికి సుపరిచితుడైన బిజూ మీనన్, దసరా సినిమా విలన్ షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ప్రసారం అవుతోంది. రియాజ్ షరీఫ్ తెరకెక్కించిన ఈ మూవీ 6 స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది.
ఇవే కాకుండా బ్లాక్ అడమ్, డంకీ, యానిమల్, ఆర్ట్ ఆఫ్ లవ్, ఐరిష్ విష్ సినిమాలు తర్వాతి స్థానాల్లో వరుసగా ఉన్నాయి.