Lootere Web Series: ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సర్వైవల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. అస్సలు మిస్ కావద్దు.. ఎక్కడ చూడాలంటే?-lootere web series watch this thrilling tv show on disney plus hotstar this week ott releases this week ott news ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Lootere Web Series: ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సర్వైవల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. అస్సలు మిస్ కావద్దు.. ఎక్కడ చూడాలంటే?

Lootere Web Series: ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సర్వైవల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. అస్సలు మిస్ కావద్దు.. ఎక్కడ చూడాలంటే?

Hari Prasad S HT Telugu
Mar 18, 2024 11:36 AM IST

Lootere Web Series: ఈ వారం ఓటీటీలోకి ఓ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ రాబోతోంది. ఈ సిరీస్ పేరు లూటేరే. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానున్న ఈ టీవీ షో ఎంతో ఆసక్తి రేపుతోంది.

ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సర్వైవల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. అస్సలు మిస్ కావద్దు.. ఎక్కడ చూడాలంటే?
ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సర్వైవల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. అస్సలు మిస్ కావద్దు.. ఎక్కడ చూడాలంటే?

Lootere Web Series: ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీల్లోకి ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ రాబోతున్నాయి. అయితే వీటిలో ఒక సర్వైవల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మాత్రం ఎంతో ఆసక్తి రేపుతోంది. ఈ సిరీస్ పేరు లూటేరే (Lootere). ఈ సిరీస్ ను క్రియేట్ చేసింది హన్సల్ మెహతా.

గతంలో స్కామ్ 1992, స్కామ్ 2003లాంటి వెబ్ సిరీస్ తోపాటు బాలీవుడ్ లో ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమాలను డైరెక్ట్ చేసిన హన్సల్ నుంచి వస్తున్న సిరీస్ కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.

లూటేరే వెబ్ సిరీస్

లూటేరే వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లోకి రాబోతోంది. ఈ శుక్రవారం (మార్చి 22) నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మధ్యే ట్రైలర్ కూడా రిలీజైంది. ఇదొక సర్వైవల్ థ్రిల్లర్. సోమాలియా దగ్గర సముద్రంలో పైరేట్స్ చేతికి చిక్కుతుంది మన దేశానికి చెందిన ఓ నౌక. అందులో కోట్ల విలువైన వస్తువులతోపాటు పలువురు సిబ్బంది కూడా ఉంటారు.

ఆ సిబ్బందిని ప్రాణాలతో వదిలేయాలంటే భారీగా డబ్బు ఇవ్వాలని పైరేట్స్ డిమాండ్ చేస్తారు. వాళ్ల నుంచి ఆ సిబ్బందిని సురక్షితంగా ఎలా విడిపించారన్నదే ఈ వెబ్ సిరీస్ స్టోరీ. ఈ నెల మొదట్లో వచ్చిన ట్రైలర్ తోనే సిరీస్ పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ట్రైలర్ అంతా చాలా ఆసక్తికరంగా సాగింది.

జై మెహతా ఈ సిరీస్ ను డైరెక్ట్ చేయగా.. హన్సల్ మెహతా, షైలేష్ ఆర్ సింగ్ ప్రొడ్యూస్ చేశారు. సముద్రంలో ప్రయాణించే ఓడలను హైజాక్ చేసి అందులోని సొత్తు దోచుకోవడంలో సోమాలియా పైరేట్స్ ఆరితేరారు. అలాంటి పైరేట్స్ చేతికి భారత్ కు చెందిన ఓ ఓడ చిక్కడం, వాళ్లు అందులోని సిబ్బందిని బందీలుగా చేసుకోవడం, వాళ్లతోపాటు ఓడను విడిపించాలని 5 కోట్ల డాలర్లు డిమాండ్ చేయడంలాంటి సీన్లతో ట్రైలర్ అంతా ఆసక్తికరంగా సాగింది.

నిజానికి రెండేళ్ల కిందటే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి 2022లోనే టీజర్ కూడా రిలీజ్ చేశారు. అయితే మొత్తానికి ఇన్నాళ్లకు ట్రైలర్ రిలీజ్ చేసి స్ట్రీమింగ్ డేట్ కూడా అనౌన్స్ చేయడంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ షోపై హన్సల్ మెహతా స్పందించాడు.

"అంతర్జాతీయ హైజాకింగ్ సంక్షోభం, వాటిని తప్పించుకోవడానికి సిబ్బంది చేసే ప్రయత్నాలను ఈ షో ద్వారా మేము చూపించే ప్రయత్నం చేశాం. ఈ స్టోరీ ప్రేక్షకులను ఎమోషనల్ చేయడంతోపాటు ఓ థ్రిల్లింగ్ అడ్వెంచర్ చేసిన ఫీలింగ్ కలిగిస్తుంది. జై మెహతా, హాట్ స్టార్ తో తొలిసారి కలిసి పని చేయడం ఓ మంచి అనుభవం" అని హన్సల్ మెహతా అన్నాడు. షిప్ హైజాకింగ్ పై తీసిన లూటేరే మార్చి 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ఈ వెబ్ సిరీస్ ఎందుకు చూడాలి?

లూటేరే వెబ్ సిరీస్ రిలీజ్ కు ముందే ఎంతో ఆసక్తి రేపడానికి కారణం ఈ షో క్రియేటర్ హన్సల్ మెహతా. అతడు గతంలో స్కామ్ 1992, స్కామ్ 2003లాంటి నిజ జీవిత స్కామ్ ల కథలను ఎంతో ఆకట్టుకునేలా చిత్రీకరించాడు. ఇక బాలీవుడ్ లో షాహిద్, అలీగఢ్, ఒమెర్టా, ఫరాజ్ లాంటి ఆఫ్ బీట్ సినిమాలను కూడా అందించాడు. అలాంటి హన్సల్ మెహతా క్రియేటర్ గా, అతని తనయుడు డైరెక్టర్ గా వస్తున్న సిరీస్ కావడంతో ఈ థ్రిల్లర్ కచ్చితంగా ఆకట్టుకుంటుందన్న అంచనాలు ఉన్నాయి.

అందులోనూ షిప్ హైజాకింగ్, పైరేట్స్ అనే కాన్సెప్ట్ అంతర్జాతీయంగా కూడా సక్సెస్ అయిన ఫార్ములా. దీనిని ఇండియన్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా వీళ్లు ఎలా తెరకెక్కించారన్నది చూడాలి.