తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Om Bheem Bush Bush Collection: టిల్లు దెబ్బకు పడిపోయిన హారర్ కామెడీ మూవీ.. ఓం భీమ్ బుష్‌ కలెక్షన్స్ ఎంతంటే?

Om Bheem Bush Bush Collection: టిల్లు దెబ్బకు పడిపోయిన హారర్ కామెడీ మూవీ.. ఓం భీమ్ బుష్‌ కలెక్షన్స్ ఎంతంటే?

Sanjiv Kumar HT Telugu

30 March 2024, 15:53 IST

  • Om Bheem Bush 8 Days Collection: తెలుగు ఇండస్ట్రీలో యూనిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా వచ్చిన సినిమా ఓం భీమ్ బుష్. మార్చి 22న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా 8 రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది, హిట్ కావాలంటే ఇంకా ఎన్ని కోట్లు రావాలనే వివరాలు తెలుసుకుందాం.

టిల్లు దెబ్బకు పడిపోయిన హారర్ కామెడీ మూవీ.. ఓం భీమ్ బుష్‌ కలెక్షన్స్ ఎంతంటే?
టిల్లు దెబ్బకు పడిపోయిన హారర్ కామెడీ మూవీ.. ఓం భీమ్ బుష్‌ కలెక్షన్స్ ఎంతంటే?

టిల్లు దెబ్బకు పడిపోయిన హారర్ కామెడీ మూవీ.. ఓం భీమ్ బుష్‌ కలెక్షన్స్ ఎంతంటే?

Om Bheem Bush Box Office Collection: యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ మరోసారి కలిసి నటించిన సినిమా ఓం భీమ్ బుష్. ఈ మూవీ మార్చి 22న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు నుంచి మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ బాగున్నాయి. ఈ క్రమంలో ఓం భీమ్ బుష్ సినిమాకు 8వ రోజు తెలంగాణ ఏపీ రాష్ట్రాల్లో రూ. 21 లక్షలు మాత్రమే వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

PM Narendra Modi Biopic: ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో కట్టప్ప!: వివరాలివే

TV Serial Actor Chandu: ఆమె వల్లే మేం విడిపోయాం.. ఆత్మహత్య చేసుకుంటాడనుకోలేదు: సీరియల్ నటుడు చందూ భార్య

OTT Movie: చైన్ బిజినెస్ మోసాలు.. ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

అయితే, గత వారం రోజులుగా వచ్చిన కలెక్షన్స్‌తో పోలిస్తే 8వ రోజు తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు తక్కువయ్యాయి. ఇక 8 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.63 కోట్ల షేర్, రూ. 12.10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి. వాటిలో నైజాం నుంచి రూ. 3.37 కోట్లు, ఆంధ్రప్రదేశ్ నుంచి రూ. 3.26 కోట్లు వచ్చాయి. అలాగే కర్ణాటక, ఇండియాలోని ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలుపుకుని రూ. 2.10 కోట్లు వసూలు అయ్యాయి. ఇలా ఓవరాల్‌గా ప్రపంచవ్యాప్తంగా 8 రోజుల్లో రూ. 8.73 కోట్ల షేర్, రూ. 16.60 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

అంటే, ఇప్పటివరకు ఓం భీమ్ బుష్ సినిమా 87 శాతం వసూళ్లు మాత్రమే రికవరీ చేసినట్లుడ ట్రేడ్ సంస్థలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి ఓవరాల్‌గా రూ. 9.30 కోట్ల బిజినెస్ అయింది. దాంతో రూ. 10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది. ఇప్పటికీ రూ. 8.73 కోట్లు వచ్చాయి. కాబట్టి, ఓం భీమ్ బుష్ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా రూ. 1.27 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఇలా అయితేనే సినిమా కమర్షియల్‌గా హిట్ టాక్ తెచ్చుకుంటుంది.

కాగా ఓం భీమ్ బుష్ మూవీకి ఇప్పటికే కలెక్షన్స్ తగ్గుముఖం పడుతున్నాయి. వీటికితోడు తాజాగా టిల్లు స్క్వేర్ మూవీ రిలీజైంది. అయితే, ఓం భీమ్ బుష్ మూవీ కలెక్షన్లకు టిల్లు స్క్వేర్ సినిమా ప్రభావం కచ్చితంగా పడే అవకాశం ఉన్నట్లు సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాబట్టి, సుమారు కోటిన్నర కలెక్షన్స్ సాధించి హారర్ కామెడీ సినిమా ఓం భీమ్ బుష్ హిట్ ట్రాక్‌లో పడుతుందా లేదా అనేది చూడాలి.

ఇదిలా ఉంటే, బ్రోచెవారెవరురా మూవీతో మంచి కామెడీ కాంబోగా పేరు తెచ్చుకున్నారు హీరో శ్రీ విష్ణు, కమెడియన్ అండ్ యాక్టర్ ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ. మరోసారి ఈ ముగ్గురి కలయికలో వచ్చిన సినిమానే ఓం భీమ్ బుష్. హారర్ అండ్ కామెడీ జోనర్‌లో వచ్చిన ఓం భీమ్ బుష్ సినిమాకు డైరెక్టర్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం చేశారు. ఆయన ఇంతకుముందు హుషారు, రౌడీ బాయ్స్ వంటి సినిమాలను తెరకెక్కించారు.

వి. సెల్యూలాయిడ్, సునీల్ బలుసు కలిని నిర్మించిన ఓం భీమ్ బుష్ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సమర్పించింది. నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అంటూ వచ్చిన ఈ చిత్రంలో శ్రీ విష్ణు, ప్రియదర్శికి జోడీలుగా ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్ హీరోయిన్లుగా నటించారు. వీరితోపాటు శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చ రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు. అలాగే సినిమాలో హుషారు ఫేమ్ హీరోయిన్ ప్రియా వడ్లమాని అతిథి పాత్రలో కనిపించింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం