తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ntr 30 Update: నెల రోజులు ఆల‌స్యంగా ఎన్టీఆర్ - కొర‌టాల శివ సినిమా షురూ

Ntr 30 Update: నెల రోజులు ఆల‌స్యంగా ఎన్టీఆర్ - కొర‌టాల శివ సినిమా షురూ

27 February 2023, 9:39 IST

  • Ntr 30 Update: ఎన్టీఆర్ ద‌ర్శ‌కుడు కొర‌టాల‌ శివ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ సినిమా మార్చిలో మొద‌లుకావాల్సింది. కానీ తార‌క‌ర‌త్న మ‌ర‌ణంతో వాయిదాప‌డింది. ఈ సినిమా ఎప్పుడు ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉందంటే..

ఎన్టీఆర్
ఎన్టీఆర్

ఎన్టీఆర్

Ntr 30 Update: జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత ఎన్టీఆర్ - కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. రెండేళ్ల క్రితం క్రేజీ ప్రాజెక్ట్‌ను అనౌన్స్‌చేశారు. కానీ ఈ సినిమా సెట్స్‌పైకి రావ‌డానికి అవాంత‌రాలు ఎదుర‌వుతూనే ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Brahmamudi May 15th Episode: బ్రహ్మముడి- బిడ్డ తల్లి కోసం వెళ్లిన కావ్య కిడ్నాప్- 5 లక్షలకు బేరం- భార్యపై రాజ్‌కు ఆ డౌట్

Karthika deepam2: కార్తీక దీపం 2 సీరియల్.. దీప కూతురు కాకపోయినా ముఖ్యమేనన్న సుమిత్ర.. వంటలక్కని ఇమిటేట్ చేసిన కార్తీక్

Guppedantha Manasu Serial: వ‌సు ప్ర‌శ్న‌ల‌కు శైలేంద్ర ఉక్కిరిబిక్కిరి - మ‌ను క‌ష్టాల‌కు పుల్‌స్టాప్ - దేవ‌యాని అనుమానం

NNS May 15th Episode: బెడిసికొట్టిన మనోహరి ప్లాన్​- ఒక్కటైన అమర్​, భాగీ- తప్పించుకున్న సరస్వతి- నిజం తెలుసుకున్న అరుంధతి

మార్చి 20 నుంచి షూటింగ్‌ను ప్రారంభించ‌బోతున్న‌ట్లు అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ అనౌన్స్‌చేశారు. కానీ తార‌క‌ర‌త్న మ‌ర‌ణంతో మ‌రోసారి ఈ సినిమా వాయిదాప‌డింది. ఫిబ్ర‌వ‌రి 24న నిర్వ‌హించాల్సిన పూజా కార్య‌క్ర‌మాల‌ను నిలిపివేస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

ఈ ఓపెనింగ్ ఈవెంట్‌ను మార్చి 18న నిర్వ‌హించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఆస్కార్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతున్నారు. అందువ‌ల్లే మార్చి 15 త‌ర్వాతే ఓపెనింగ్ ఈవెంట్‌ను జ‌రుప‌నున్న‌ట్లు స‌మాచారం. ఏప్రిల్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్‌ను మొద‌లుపెట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిసింది.

ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీక‌పూర్ హీరోయిన్‌గా న‌టించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. హీరోయిన్ రోల్‌కు సంబంధించి ఇటీవ‌లే జాన్వీక‌పూర్‌పై ఫొటోషూట్‌నుచేసిన‌ట్లు తెలిసింది.

ఈ సినిమాలో బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీఖాన్ విల‌న్‌గా న‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం. క‌ళ్యాణ్‌రామ్‌తో క‌లిసి సుధాక‌ర్ మిక్కిలినేని ఈ భారీ బ‌డ్జెట్ సినిమాను నిర్మిస్తోన్నారు. ఎన్టీఆర్ హీరోగా న‌టిస్తోన్న 30వ సినిమా ఇది. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందించ‌బోతున్నారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం