Ntr vs Ramcharan: ఎన్టీఆర్ వర్సెస్ రామ్‌చరణ్ - బెస్ట్ యాక్టర్ అవార్డు కోసం పోటీపడుతోన్నస్టార్స్
Ntr vs Ramcharan: క్రిటిక్ ఛాయిస్ సూపర్ అవార్డుల్లో బెస్ట్ యాక్టర్ అవార్డు కోసం ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఒకరితో మరొకరు పోటీపడబోతుండటం టాలీవుడ్ అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది
Ntr vs Ramcharan: గోల్డెన్ గ్లోబ్‌తో పాటు పలు ప్రతిష్టాత్మక అవార్డు వేడుకలలో ఆర్ఆర్ఆర్ మెరిసింది. అంతర్జాతీయ పురస్కారాలను దక్కించుకొని కొత్త చరిత్రను సృష్టించింది. తాజాగా అమెరికాకు చెందిన క్రిటిక్ ఛాయిస్ సూపర్ అవార్డ్స్‌లో ఆర్ఆర్ఆర్ రెండు విభాగాల్లో పోటీపడబోతున్నది.
బెస్ట్ యాక్షన్ ఫిల్మ్‌తో పాటు బెస్ట్ యాక్టర్ కేటగిరీల్లో ఈ సినిమా నామినేట్ అయ్యింది. అయితే బెస్ట్ యాక్టర్ కేటగిరీలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు వేర్వేరుగా పోటీలోనిలిచారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను ఇద్దరి పేర్లు నామినేషన్స్‌లో ఉన్నట్లు క్రిటిక్ ఛాయిస్ సూపర్ సంస్థ ప్రకటించింది. బెస్ట్ యాక్టర్ అవార్డు కోసం ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఒకరితో మరొకరు పోటీపడబోతుండటం ఆసక్తికరంగా మారింది.
మార్చి 16న అవార్డ్ విన్నర్స్‌ను ప్రకటించబోతున్నారు. ఈ అవార్డు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లలో ఎవరికి దక్కుతుందన్నది అభిమానుల్లో ఎగ్జైటింగ్‌గా మారింది. క్రిటిక్ ఛాయిస్ సంస్థ ట్వీట్‌ను నందమూరి ఫ్యాన్స్‌తో పాటు మెగా అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఆస్కార్‌కు షార్ట్ లిస్ట్ అయ్యింది ఆర్ఆర్ఆర్.
ఈ ఆస్కార్ ఈవెంట్ కోసం రాజమౌళి, రామ్‌చరణ్ అమెరికా వెళ్లారు. వీరిద్దరు అమెరికాలో సందడి చేస్తోన్న ఫొటోలు వైరల్‌గా మారాయి. ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ నటించారు. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించారు. పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ఇండియాలో గత ఏడాది మార్చి 25న రిలీజైంది.