తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthikeya 2 Ott Release Date: కార్తికేయ 2 ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే

Karthikeya 2 OTT Release Date: కార్తికేయ 2 ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే

10 September 2022, 15:26 IST

  • Karthikeya 2 OTT Release Date: నిఖిల్(Nikhil), అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా న‌టించిన కార్తికేయ 2 చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్‌గా 130 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఈ ఏడాది టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌ల‌లో ఒక‌టిగా నిలిచిన ఈ సినిమా ఎప్పుడూ ఓటీటీలో రిలీజ్ కానుందంటే...

కార్తికేయ 2 మూవీలో నిఖిల్
కార్తికేయ 2 మూవీలో నిఖిల్ (twitter)

కార్తికేయ 2 మూవీలో నిఖిల్

Karthikeya 2 OTT Release Date: నిఖిల్ హీరోగా న‌టించిన కార్తికేయ 2 (karthikeya 2) మూవీ తెలుగుతో పాటు బాలీవుడ్ చక్కటి వసూళ్లను సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నది. కృష్ణుడి కంక‌ణం కోసం ఓ యువ‌కుడు సాగించిన ప్ర‌యాణానికి అడ్వెంచ‌ర‌స్‌, థ్రిల్లింగ్ అంశాల‌ను జోడించి ద‌ర్శ‌కుడు చందూ మొండేటి ఈ సినిమాను తెర‌కెక్కించాడు.

ట్రెండింగ్ వార్తలు

Pushpa 2 Anasuya First Look: పుష్ప 2 నుంచి అనసూయ ఫస్ట్ లుక్.. దాక్షాయణి మళ్లీ వచ్చింది

Devara First Single: దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేది ఆ రోజే.. ఫియర్ సాంగ్ అంటూ భయపెడుతున్న మేకర్స్

Janhvi Kapoor Partner: తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పిన జాన్వీ కపూర్.. ఈ లక్షణాలు తప్పనిసరిగా ఉండాల్సిందేనట

Panchayat 3 Trailer: పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ వచ్చేసింది.. మరింత రాజకీయం, నవ్వులతో అదిరిపోయింది

వరల్డ్ వైడ్ గా 130 కోట్ల వసూళ్లు...

వ‌ర‌ల్డ్ వైడ్‌గా కార్తికేయ 2 సినిమా 130 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. హిందీలోనే (Bollywood) కార్తికేయ 2 ముప్పై రెండు కోట్ల రూపాయల క‌లెక్ష‌న్స్ సొంతం చేసుకొని నిర్మాత‌ల‌కు భారీగా లాభాల్ని తెచ్చిపెట్టింది. తొలిరోజు కేవలం ఏడు లక్షలు మాత్రమే కలెక్షన్స్ మాత్రమే రాబట్టిన ఈ సినిమా మౌత్ టాక్ బాగుండటంతో రోజురోజుకు వసూళ్లు పెరుగుతూ వచ్చాయి. ఒకానొక దశలో బాలీవుడ్ అగ్ర హీరోలు ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ ఛడ్డా, అక్షయ్ కుమార్ రక్షాభందన్ సినిమాల వసూళ్లను కార్తికేయ 2 అధిగమించింది. తెలుగులో(Tollywood) మిడ్ రేంజ్ సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

Karthikeya 2 OTT Release Date: ఓటీటీ రిలీజ్ తేదీ..

థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల్ని అల‌రించిన కార్తికేయ 2 ఈ నెలాఖ‌రున ఓటీటీలో సంద‌డి చేయ‌బోతున్నట్ల తెలిసింది. ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్‌ను జీ5 (Zee5) సంస్థ ద‌క్కించుకున్న‌ది. సెప్టెంబ‌ర్ 30 కార్తికేయ 2 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు సమాచారం. తెలుగు, హిందీ వెర్ష‌న్స్ మాత్ర‌మే రిలీజ్ కాబోతున్న‌ట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. త్వ‌ర‌లోనే కార్తికేయ ఓటీటీ రిలీజ్ డేట్‌పై క్లారిటీ రానుంది.

Karthikeya 2 story: కృష్ణతత్వంతో ...

కృష్ణతత్వానికి అడ్వెంచరస్ థ్రిల్లింగ్ అంశాలను జోడించి దర్శకుడు చందూ మొండేటి ఈ సినిమాను తెరకెక్కించాడు. 2014లో రూపొందిన కార్తికేయకు కొనసాగింపుగా ఈ సినిమా తెరకెక్కింది. ఫస్ట్ పార్ట్ సక్సెస్ గా నిలవగా సెకండ్ పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కార్తికేయ 2 కు కొనసాగింపుగా కార్తికేయ 3 రాబోతున్నట్లు ఇటీవలే నిఖిల్ ప్రకటించాడు.

(ఇదీ మీకు నచ్చుతుంది: కార్తికేయ 2 మూవీ రివ్యూ)

సెప్టెంబ‌ర్ 23న మ‌ల‌యాళం కార్తికేయ 2 రిలీజ్‌

కార్తికేయ 2 మూవీ మ‌ల‌యాళంలో సెప్టెంబ‌ర్ 23న థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతున్న‌ట్లు నిఖిల్ తెలిపారు. మ‌ల‌యాళ వెర్ష‌న్‌కు పెద్ద సంఖ్య‌లోనే థియేట‌ర్లు దొరికిన‌ట్లు సమాచారం. కార్తికేయ 2 చిత్రంలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ (Anupama parameswaran) హీరోయిన్‌గా న‌టించింది.అనుప‌మ్ ఖేర్(Anupam kher) కీల‌క అతిథి పాత్ర‌లో న‌టించాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం