Karthikeya 2 Hindi Collections: హిందీలో దుమ్ము రేపుతున్న కార్తికేయ 2 కలెక్షన్లు-karthikeya 2 hindi collections are still high after 3rd weekend ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Karthikeya 2 Hindi Collections Are Still High After 3rd Weekend

Karthikeya 2 Hindi Collections: హిందీలో దుమ్ము రేపుతున్న కార్తికేయ 2 కలెక్షన్లు

HT Telugu Desk HT Telugu
Aug 29, 2022 09:48 PM IST

Karthikeya 2 Hindi Collections: హిందీలో దుమ్ము రేపుతోంది కార్తికేయ 2 మూవీ. మూవీ రిలీజై ఆదివారం నాటికి 16 రోజులు కాగా.. ఇప్పటికీ మంచి కలెక్షన్లు రాబడుతోంది.

కార్తికేయ 2 మూవీ హిందీ కలెక్షన్లపై తరణ్ ఆదర్శ్ ట్వీట్ లోని ఫొటో
కార్తికేయ 2 మూవీ హిందీ కలెక్షన్లపై తరణ్ ఆదర్శ్ ట్వీట్ లోని ఫొటో (twitter)

Karthikeya 2 Hindi Collections: ఓ చిన్న సినిమాగా, తెలుగు రాష్ట్రాల్లోనూ సరిగా థియేటర్లు దొరకని పరిస్థితుల్లో రిలీజైన నిఖిల్‌ సిద్ధార్థ్‌ కార్తికేయ 2 మూవీ.. ఇప్పుడు హిందీ బెల్ట్‌లోనూ దూసుకెళ్తోంది. మూవీకి పాజిటివ్‌ టాక్‌ రావడంతోపాటు బాలీవుడ్‌లో రిలీజైన పెద్ద సినిమాలు కూడా బోల్తా పడటంతో అక్కడ థియేటర్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ పోయింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కార్తికేయ 2 మూవీ 3 వేల స్క్రీన్లలో ఉండటం విశేషం. ఈ సినిమా హిందీ బెల్ట్‌లో 16 రోజులు కలిపి రూ.23.53 కోట్లు వసూలు చేసింది. మూడో వీకెండ్‌ కూడా చెప్పుకోదగిన స్థాయిలో వసూలు చేసింది. ట్రేడ్‌ అనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ ప్రకారం.. కార్తికేయ 2 గత శుక్రవారం రూ.82 లక్షలు, శనివారం రూ.1.65 కోట్లు, ఆదివారం రూ.1.77 కోట్లు రాబట్టింది.

నిజానికి ఆదివారం ఇంకా ఎక్కువ వసూలు అయ్యే ఛాన్స్‌ ఉన్నా.. ఇండియా, పాకిస్థాన్‌ మ్యాచ్‌ వసూళ్లపై ప్రభావం చూపినట్లు తరణ్‌ ఆదర్శ్‌ చెప్పాడు. హిందీ బెల్ట్‌లో కార్తికేయ 2 స్క్రీన్లు క్రమంగా పెరుగుతూ రావడంతో అదే స్థాయిలో బాక్సాఫీస్‌ కలెక్షన్లు కూడా పెరిగాయి. మొత్తానికి మూడో వీకెండ్ ముగిసే సమయానికి అక్కడ ఈ మూవీ రూ.20 కోట్ల మార్క్‌ దాటింది.

కృష్ణతత్వాన్ని చాటి చెప్పిన ఈ సినిమా నార్త్‌ ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంది. ఈ మిస్టరీ థ్రిల్లర్‌ మూవీ.. బాలీవుడ్‌ టాప్‌ స్టార్లు ఆమిర్‌ఖాన్‌, అక్షయ్‌కుమార్‌ నటించిన లాల్‌ సింగ్‌ చడ్డా, రక్షాబంధన్‌లతోపాటు తాజాగా రిలీజైన లైగర్‌ మూవీకి కూడా గట్టి పోటీ ఇస్తోంది. ఇప్పటికూ ఓవరాల్‌గా రూ.100 కోట్లకుపైగా వసూలు చేసిన కార్తికేయ 2 ఎవరూ ఊహించని విజయం సాధించింది.

IPL_Entry_Point