తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Naa Saami Ranga Ott Release Date: నా సామిరంగ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. మరికొద్ది రోజుల్లోనే..

Naa Saami Ranga OTT Release Date: నా సామిరంగ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. మరికొద్ది రోజుల్లోనే..

Hari Prasad S HT Telugu

30 January 2024, 9:30 IST

    • Naa Saami Ranga OTT Release Date: అక్కినేని నాగార్జున నటించిన నా సామిరంగ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.
నా సామిరంగ మూవీ
నా సామిరంగ మూవీ

నా సామిరంగ మూవీ

Naa Saami Ranga OTT Release Date: సంక్రాంతి సినిమాగా రిలీజై మరోసారి నాగార్జునకు హిట్ ఇచ్చిన మూవీ నా సామిరంగ. పెద్దగా అంచనాలు లేకుండానే రిలీజైన ఈ మలయాళ రీమేక్ బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టడానికి రెడీ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు

Criminal Justice Season 4: సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ క్రిమినల్ జస్టిస్ సీజన్ 4 వచ్చేస్తోంది.. వీడియో ఇదీ

Hari Om OTT: దేశంలోనే తొలి భక్తి ఓటీటీ హరి ఓం.. ప్రారంభిస్తున్న అడల్ట్ కంటెంట్ ఓటీటీ ఉల్లు.. పాపం నుంచి పుణ్యం!

Eesha Rebba: ఆ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో నన్ను హీరోయిన్ అని చెప్పి మోసం చేశారు: ఈషా రెబ్బ

Madgaon Express OTT: ఓటీటీలోకి వచ్చేసిన యానిమల్ యాక్టర్ సూపర్ హిట్ కామెడీ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?

తాజాగా వస్తున్న వార్తల ప్రకారం.. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో ఫిబ్రవరి 15 నుంచి నా సామిరంగ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓటీటీ హక్కుల ద్వారా కూడా ఈ మూవీ మేకర్స్ బాగానే సంపాదించారు.

నా సామిరంగ ఓటీటీ రిలీజ్

నా సామిరంగ సంక్రాంతికి ఒక రోజు ముందు అంటే జనవరి 14న రిలీజైంది. అప్పటికే గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్ లాంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ మలయాళం రీమేక్ తో వస్తున్న నాగార్జున కు హిట్ సాధ్యమేనా అని అనుకున్నారు. కానీ నాగ్ మరోసారి సంక్రాంతి సక్సెస్ సాధించాడు.

హనుమాన్ తర్వాత బ్రేక్ ఈవెన్ సాధించిన మూవీ నా సామిరంగనే. తొలి రోజే రూ.5 కోట్లకుపైగా వసూళ్లతో మొదలుపెట్టిన ఈ సినిమా.. పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర ఎక్కడా తగ్గలేదు. ఇక ఈ సినిమా ఓటీటీ హక్కులు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ దక్కించుకుంది. ఈ హక్కుల ద్వారా కూడా నా సామిరంగ టీమ్ బాగానే సంపాదించినట్లు తెలిసింది.

ఇక మూవీని ఫిబ్రవరి 15 నుంచి స్ట్రీమింగ్ చేయడానికి హాట్‌స్టార్ సిద్ధమవుతోంది. బాక్సాఫీస్ దగ్గర నా సామిరంగ మూవీ రన్ దాదాపు ముగిసింది. దీంతో మూవీ థియేటర్లలో రిలీజైన సరిగ్గా నెల రోజుల తర్వాత ఓటీటీలోకి తీసుకురానున్నారు.

ఈ సినిమా సంక్రాంతికి అంటే నవ్వారు: నాగార్జున

నా సామిరంగ మూవీ సక్సెస్ మీట్ ను ఈ మధ్యే హైదరాబాద్ లో నిర్వహించారు. దీనికి మొత్తం టీమ్ అంతా వచ్చింది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. నా సామిరంగ చేస్తున్నానంటే చాలా మంది నవ్వారని అన్నాడు. సెప్టెంబర్ లో షూటింగ్ మొదలు పెట్టిన మూవీ సంక్రాంతికి రిలీజ్ ఎలా సాధ్యమని వాళ్లు ప్రశ్నించినట్లు చెప్పాడు.

"నా టీమ్ ను ప్రతి రోజూ మిస్ అవుతుంటాను. సంక్రాంతి రిలీజ్ కోసం మేమంతా బిజీగా ఉన్న క్షణాలు గుర్తుకొస్తుంటాయి. సెప్టెంబర్ లో నేను నా సామిరంగ కోసం పని చేస్తున్నానని, సంక్రాంతికి రిలీజ్ అవుతుందని చెబితే చాలా మంది నవ్విన విషయం ఎవరికీ తెలియదు. నా ఫ్యామిలీ కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదు. కానీ మేము మూడు నెలల్లోనే సినిమా చేశాం. రిలీజ్ చేశాం. ఇప్పుడు సక్సెస్ టీమ్ కూడా పెట్టుకున్నాం" అని నాగ్ అన్నాడు.

నా సామిరంగ మూవీకి కీరవాణి మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాలో నాగార్జునతోపాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్ ముఖ్య పాత్రలు పోషించారు. మూవీకి విజయ్ బిన్నీ దర్శకత్వం వహించాడు. థియేటర్లలో హిట్ అయిన నా సామిరంగను ఓటీటీలో చూడటానికి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం