తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Miss Perfect Review: లావణ్య త్రిపాఠి కొత్త సిరీస్ ‘పర్‌ఫెక్ట్‌’గా ఉందా? మిస్ పర్‌ఫెక్ట్‌ రివ్యూ

Miss Perfect Review: లావణ్య త్రిపాఠి కొత్త సిరీస్ ‘పర్‌ఫెక్ట్‌’గా ఉందా? మిస్ పర్‌ఫెక్ట్‌ రివ్యూ

02 February 2024, 12:50 IST

    • Miss Perfect OTT Web Series Review in Telugu: లావణ్య త్రిపాఠి, బిగ్‍బాస్ ఫేమ్ అభిజిత్ ప్రధాన పాత్రలు పోషించిన మిస్ పర్‌ఫెక్ట్‌ వెబ్ సిరీస్ నేడు డిస్నీ+ హాట్‌స్టార్ ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ సిరీస్ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకోండి.
Miss Perfect Review: లావణ్య త్రిపాఠి కొత్త సిరీస్ ‘పర్‌ఫెక్ట్‌’గా ఉందా?
Miss Perfect Review: లావణ్య త్రిపాఠి కొత్త సిరీస్ ‘పర్‌ఫెక్ట్‌’గా ఉందా?

Miss Perfect Review: లావణ్య త్రిపాఠి కొత్త సిరీస్ ‘పర్‌ఫెక్ట్‌’గా ఉందా?

Miss Perfect Web Series Review: వెబ్ సిరీస్: మిస్ పర్‌ఫెక్ట్‌; ప్రధాన నటీనటులు: లావణ్య త్రిపాఠి, అభిజిత్ దుద్దల, అభిజ్ఞ వుతలూరు, ఝాన్సీ, హర్షవర్దన్, మహేశ్ విట్టా, హర్ష్ రోహన్, సునైనా, మోహన శ్రీ; కథ, స్క్రీన్‍ప్లే: ఫ్రాన్సిస్ థామస్, శృతి రామచంద్రన్; ఎడిటర్: రవితేజ గిరిజల; మ్యూజిక్ డైరెక్టర్: ప్రశాంత్ ఆర్ విహారీ; డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ: ఆదిత్య జవ్వాది; నిర్మాత: సుప్రియ యార్లగడ్డ; డైరెక్టర్: విశ్వక్ కండేరావ్; స్ట్రీమింగ్: డిస్నీ+ హాట్‍స్టార్, ఫిబ్రవరి 2 నుంచి

ట్రెండింగ్ వార్తలు

PM Narendra Modi Biopic: ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో కట్టప్ప!: వివరాలివే

TV Serial Actor Chandu: ఆమె వల్లే మేం విడిపోయాం.. ఆత్మహత్య చేసుకుంటాడనుకోలేదు: సీరియల్ నటుడు చందూ భార్య

OTT Movie: చైన్ బిజినెస్ మోసాలు.. ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Laya: ఆ డైరెక్టర్ చంపుతానని బెదిరించాడు.. 18 ఏళ్లకు నిజం బయటపెట్టిన హీరోయిన్ లయ

హీరోయిన్ లావణ్య త్రిపాఠి, బిగ్‍బాస్ విన్నర్ అభిజిత్ ప్రధాన పాత్రల్లో నటించిన మిస్ పర్‌ఫెక్ట్‌ వెబ్ సిరీస్ డిస్నీ+ హాట్‍స్టార్ వెబ్ సిరీస్‍లో నేడు స్ట్రీమింగ్‍కు వచ్చింది. వరుణ్ తేజ్‍తో పెళ్లి తర్వాత లావణ్య చేసిన తొలి ప్రాజెక్ట్ ఇదే. ట్రైలర్‌తో మిస్ పర్‌ఫెక్ట్‌ వెబ్ సిరీస్‍పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ప్రమోషన్లను కూడా టీమ్ బాగా చేసింది. మరి, ఈ మిస్ పర్‌ఫెక్ట్‌ సిరీస్ ఎలా ఉందో ఈ ఫుల్ రివ్యూలో చూడండి.

కథ ఇదే..

ఢిల్లీలో మేనేజ్‍మెంట్ కన్సల్టెంట్‍గా పని చేసే లావణ్య రావు (లావణ్య త్రిపాఠి).. జాబ్‍లో భాగంగా హైదరాబాద్‍కు వస్తుంది. లావణ్యకు క్లీనింగ్ అంటే ప్రాణం. ప్రతీది క్లీన్‍గా, పర్‌ఫెక్ట్‌గా ఉండాలనుకునేలా ఓసీడీ ఉంటుంది. లావణ్య ఇంట్లో జ్యోతి (అభిజ్ఞ) పని మనిషిగా చేరుతుంది. హైదరాబాద్‍లో లావణ్య ఉండే అపార్ట్‌మెంట్లో వేరే ఫ్లాట్‍లో రోహిత్ (అభిజిత్) ఉంటాడు. లావణ్య హైదరాబాద్ రాగానే కరోనా వైరస్ కారణంగా లాక్‍డౌన్ పడుతుంది. దీంతో లావణ్య, రోహిత్ ఒక కంపెనీ అయినా ఈ విషయం ఇద్దరికీ తెలియదు. కరోనా వల్ల తాను పనికి రాలేకపోతున్నా అని, ఈ విషయం రోహిత్‍కు చెప్పాలని లావణ్యను జ్యోతి అడుగుతుంది. దీంతో రోహిత్.. ఫ్లాట్‍కు లావణ్య వెళుతుంది. అయితే, ఆ విషయం చెప్పకుండా ఇల్లు గందరగోళంగా ఉంటే క్లీన్ చేస్తుంది. దీంతో లావణ్యను పని మనిషి అనుకుంటాడు రోహిత్. లావణ్య నిజం తెబుదామనే ప్రయత్నిస్తూనే.. చెప్పకుండా లక్ష్మి అనే పేరుతో రోజూ రోహిత్ ఇంటికి వెళుతుంటుంది. ఈ క్రమంలో లావణ్యతో రోహిత్ ప్రేమలో పడతాడు. మరి లావణ్య పని మనిషి కాదని, తన పైఆఫీసర్ అని రోహిత్‍కు తెలుస్తుందా? లావణ్య కూడా రోహిత్‍ను ప్రేమించిందా? నిజం చెబుతుందా? వారి ప్రేమ సక్సెస్ అవుతుందా? అనేదే మిస్ పర్‌ఫెక్ట్‌ వెబ్ సిరీస్‍లో ప్రధాన అంశాలుగా ఉన్నాయి.

ఓసీడీ.. కరోనా.. లవ్

ఓసీడీ (అతి శుభ్రత) కాన్సెప్ట్‌తో ఏడేళ్ల కిందట డైరెక్టర్ మారుతీ తెరకెక్కించిన మహానుభావుడు సినిమా బాగానే వర్కౌట్ అయింది. కరోనా అడుగుపెట్టిన తర్వాత ఈ ఓసీడీ అనేది బాగా పాపులర్ అయింది. ఇప్పుడు.. ఓసీడీ కాన్సెప్ట్‌తో కరోనా టైమ్ బ్యాక్‍డ్రాప్‍లో లవ్ స్టోరీతో ‘మిస్ పర్‌ఫెక్ట్’ వెబ్ సిరీస్ వచ్చింది. 2021 కొవిడ్ ఫస్ట్ లాక్‍‍డౌన్ టైమ్ లైన్‍లో ఈ సిరీస్ ఉంటుంది.

కథనం ఇలా..

అతి శుభ్రత వల్ల లావణ్య రావు (లావణ్య త్రిపాఠి) లవ్ ఫెయిల్ అవడంతో ఈ సిరీస్ మొదలవుతుంది. దీంతో ఆమెకు శుభ్రత అంటే ఎంత పిచ్చో మొదట్లోనే క్లారిటీ ఇచ్చేశాడు దర్శకుడు విశ్వక్. మెయిన్ స్టోరీలోకి వచ్చేందుకు ఎక్కువ సమయం తీసుకోలేదు. లావణ్య హైదరాబాద్ రావడం.. రోహిత్ (అభిజిత్)ను కలవడాన్ని మొదటి ఎపిసోడ్‍లోనే చూపించాడు. పని మనిషిగా చేసే జ్యోతి (అభిజ్ఞ)కి కూడా సింగర్ అవ్వాలనే లక్షాన్ని పెట్టి.. ఆ క్యారెక్టర్‌పై కూడా క్యారియాసిటీ కలిగించాడు. ఉన్నది కొన్ని క్యారెక్టర్లే అయినా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాడు.

అయితే, పని మనిషి రాదని చెప్పేందుకు వెళ్లి.. రోహిత్ ఫ్లాట్ అంతా లావణ్య క్లీన్ చేస్తుంది. అయితే రోజూ అలాగే చేస్తుండడం అంత కన్విన్సింగ్‍గా అనిపించదు. అయితే, లావణ్యకు ఓడీసీ ఉండడం, కథకు అదే మెయిన్ పాయింట్ కావటంతో దానికి మినహాయింపు ఇవ్వొచ్చు. పని మనిషి లక్ష్మిగా వచ్చే లావణ్యను అభిజిత్ ఇష్టపడడం, ఆమెకు వంట చేసిపెట్టడం కాస్త ఫీల్ గుడ్‍లా ముందుకు సాగుతుంది. అయితే, సరదా సన్నివేశాలు ఎక్కువగా లేకపోవటంతో ఫ్లాట్‍గా సాగుతున్నట్టు అనిపిస్తుంటుంది.

లక్ష్మి ఎవరో కనిపెట్టేందుకు జ్యోతి, యూట్యూబర్ అయిన అతడి తమ్ముడు కార్తిక్ (హర్ష్ రోహన్), వాచ్‍మెన్ శీను (మహేశ్ విట్టా) చేసే ప్రయత్నాలతో ఫన్ జనరేట్ చేసేందుకు డైరెక్టర్ ప్రయత్నించాడు. లావణ్య తండ్రి గోకుల్ రావు (హర్షవర్ధన్), రాజ్యలక్ష్మి (ఝాన్సీ) మధ్య లవ్ స్టోరీని ఓ ఎపిసోడ్‍లో కాస్త ఎక్కువ చూపించినట్టు అనిపిస్తుంది. అక్కడ కాస్త కథ పక్కదారి పట్టినట్టు అనిపిస్తుంది. కాసేపటికి మళ్లీ ట్రాక్‍పైకి వస్తుంది.

లక్ష్మి పని మనిషి కాదని, తన ఆఫీస్‍లో అసెస్‍మెంట్ చేసేందుకు వచ్చిన మేనేజర్ అని రోహిత్‍కు నిజం తెలియడాన్ని కన్విన్సింగ్‍గా చూపించాడు డైరెక్టర్. మరీ ఎక్కువ డ్రామాకు పోలేదు. ఎమోషన్స్ కూడా నేచురల్‍గానే అనిపిస్తాయి. అయితే, కామెడీ అనుకున్నంత లేకపోవటంతో ఈ సిరీస్ కొన్ని చోట్ల ల్యాగ్ అనిపిస్తుంది. రోహిత్‍కు నిజం తెలియడం ఖాయమని ప్రేక్షకుల్లో ముందే అంచనా రావడం కూడా అంతగా క్యూరియాసిటీ మెయింటెన్ కాదు. అయితే, చివరి ఎపిసోడ్ కాస్త ఇంట్రెస్టింగ్‍గా సాగుతుంది. లావణ్య, రోహిత్ ఎలా కలుస్తారన్న ఆసక్తి కలుగుతుంది.

టెక్నికల్ అంశాలు

‘మిస్ పర్‌ఫెక్ట్’ సిరీస్‍ను కథకు కట్టుబడే తెరకెక్కించాడు దర్శకుడు విశ్వక్. అయితే, థామస్, శృతి రాసుకున్న కథ అంత కొత్తగా లేదు. లాక్‍డౌన్, ఓసీడీ చుట్టూ దర్శకుడు కొన్ని కామెడీ సన్నివేశాలను క్రియేట్ చేసి ఉంటే ఈ సిరీస్ మరింత ఎంటర్‌టైనింగ్‍గా అనిపించేది. అయితే, ఎమోషన్లను సహజంగా చూపించాడు దర్శకుడు. ప్రశాంత్ ఆర్ విహారీ మ్యూజిక్ ఈ సిరీస్‍కు సూటైంది. హృద్యంగా సాగుతుంది. లాక్‍డౌన్ బ్యాక్‍డ్రాప్ కావడంతో ఎక్కువగా అపార్ట్‌మెంట్‍లోనే ఈ సిరీస్ సాగుతుంది. డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ ఆదిత్య జవ్వాది పని తనం కూడా మెప్పిస్తుంది. నిర్మాణ విలువలు కూడా అన్నపూర్ణ స్టూడియోస్‍కు తగ్గట్టుగా మెరుగ్గా ఉన్నాయి.

నటీనటుల పర్ఫార్మెన్స్

లావణ్య రావు పాత్రలో లావణ్య సరిగ్గా సూటయ్యారు. పాత్రకు ఆమె పూర్తి న్యాయం చేశారు. నటన పరంగా లావణ్యకు ఫుల్ మార్క్స్ పడతాయి. రోహిత్ పాత్రలో అభిజిత్ కూడా సెటిల్‍గా చేశాడు. హ్యాండ్‍సమ్‍గా కనిపించటంతో పాటు పర్ఫార్మెన్స్ కూడా మెరుగ్గా చేశాడు. అభిజ్ఞ కూడా నటనతో ఆకట్టుకున్నారు. సలార్ ఫేమ్ హర్ష్ రోహన్, మహేశ్ విట్టా, ఝాన్సీ, హర్షవర్దన్ తమ పరిధిలో ఆకట్టుకున్నారు.

మొత్తంగా..

‘మిస్ పర్‌ఫెక్ట్’ వెబ్ సిరీస్ ఆశించిన స్థాయిలో ఎంటర్‌టైనింగ్‍గా లేకపోయినా.. కొన్ని ఫీల్ గుడ్ మూవ్‍మెంట్స్ ఉన్నాయి. లవ్ స్టోరీలో కొత్తదనం లేకపోవడం, ఆసక్తికరంగా సాగకపోవడం ప్రతికూలతలుగా అనిపిస్తాయి. అయితే, ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేకపోవడం ఈ సిరీస్‍కు ప్లస్ పాయింట్. ఎంచక్కా ఫ్యామిలీతో కలిసి చూసేయవచ్చు. పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా టైమ్ పాస్ కోసం ఈ వీకెండ్‍లో ఈ సిరీస్‍ను చూసేయవచ్చు.

రేటింగ్: 2.5/5

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం