తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nagababu Slams Tammareddy: తమ్మారెడ్డిపై విరుచుకుపడిన నాగబాబు.. నీ** మొగుడు ఖర్చు పెట్టాడా? అంటూ వ్యాఖ్యలు

Nagababu Slams Tammareddy: తమ్మారెడ్డిపై విరుచుకుపడిన నాగబాబు.. నీ** మొగుడు ఖర్చు పెట్టాడా? అంటూ వ్యాఖ్యలు

10 March 2023, 14:42 IST

    • Nagababu Slams Tammareddy: ఆర్ఆర్ఆర్ సినిమాపై నెగిటివ్ కామెంట్లు చేసినందుకు గాను తమ్మారెడ్డి భరద్వాజ్‌పై మెగా బ్రదర్ నాగబాబు ఘాటు వ్యాఖ్యలు. పరుష పదజాలంతో సోషల్ మీడియా వేదికగా తన స్పందనను తెలియజేశారు.
తమ్మారెడ్డిపై నాగబాబు ఫైర్
తమ్మారెడ్డిపై నాగబాబు ఫైర్

తమ్మారెడ్డిపై నాగబాబు ఫైర్

Nagababu Slams Tammareddy:మెగా బ్రదర్ నాగబాబు ప్రస్తుతం ఏది మాట్లాడిన వైరల్ అవుతోంది. అలాగే వివాదానికి దారితీస్తుంది. కొన్నిసార్లు ఆయన మాటలు నేరుగా ఎవరికి, ఎక్కడ తగాలలో అక్కడ తగులుతోంది. వీలుచిక్కినప్పుడల్లా రాజకీయాలపై మాట్లాడే ఆయన.. తన అన్న చిరంజీవి, తమ్ముడు పవన్ కల్యాణ్ జోలికి వస్తే మాత్రం తనదైన శైలిలో బదులిస్తారు. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాపై సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ చేసిన కామెంట్లపై విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా వేదికగా ఘాటు వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు.

ట్రెండింగ్ వార్తలు

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

PM Narendra Modi Biopic: ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో కట్టప్ప!: వివరాలివే

తమ్మారెడ్డి భరద్వాజ్ రెండు రోజుల క్రితం ఓ ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ.. "ఆస్కార్ అవార్డు కోసం ఆర్ఆర్ఆర్ టీమ్ రూ.80 కోట్లు ఖర్చు పెట్టింది. ఆ డబ్బుతో మేము 8 సినిమాలు తీసి ముఖాన కొడతాం. కేవలం ఫ్లైట్ టికెట్స్ కోసమే అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు." అంటూ కామెంట్లు చేశారు. దీంతో ఆయన మాటలు నెట్టింట విపరీతంగా వైరల్ అయ్యాయి. నెటిజన్లు, ఫ్యాన్స్ తమ్మారెడ్డిపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. ఆయనను తీవ్రంగా ట్రోలింగ్ చేశారు. తాజాగా నాగబాబు కూడా ట్విటర్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తమ్మారెడ్డి వ్యాఖ్యలకు నాగబాబు కౌంటర్ ఇస్తూ.. "ఎవరికి వారే ఇలా అనుకుంటున్నారు" అని ఇంగ్లీష్‌లో పెట్టి.. "నీ** మొగుడు ఖర్చు పెట్టాడారా 80 కోట్ల ఆస్కార్ కోసం?" అంటూ ట్విటర్ వేదికగా తీవ్రంగా విమర్శించారు. అంతటితో ఆగకుండా "ఆర్ఆర్ఆర్ మీద కామెంట్ చేసినందుకు వైసీపీ వారి భాషలో సమాధానం" అంటూ బ్రాకెట్‌లో పెట్టి అగ్నికి ఆజ్యం పోశారు.

తమ్మారెడ్డి భరద్వాజ్ వ్యాఖ్యలపై చిత్రసీమలో పలువురు స్పందించారు. దిగ్గజ దర్శకుడు రాఘవేంద్రరావు సైతం కౌంటర్ ఇచ్చారు. "మిత్రుడు భరద్వాజ్‌.. తెలుగు సినిమాకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు దర్శకుడికి, తెలుగు నటులకు ప్రపంచ వేదికలపై మొదటిసారి వస్తున్న పేరును చూసి గర్వపడాలి. అంతే కానీ 80 కోట్ల ఖర్చు అంటూ చెప్పడానికి నీ వద్ద అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? జేమ్స్ కామెరూన్, స్పీల్ బర్గ్ లాంటి వారు డబ్బు తీసుకుని మన సినిమా గొప్పతనాన్ని పొగుడుతున్నారని నీ ఉద్దేశమా?" అంటూ సున్నితంగానే గట్టిగా బదులిచ్చారు

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసిన ఆర్ఆర్ఆర్ హవానే నడుస్తోంది. ఈ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్‌కు నామినేట్ కావడంతో సోషల్ మీడియాలో ఫుల్ బజ్ ఏర్పడింది. ఇందులో భాగంగా దర్శకుడు రాజమౌళి, హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ సైతం అమెరికాకు వెళ్లి సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 12న జరగనుంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం