తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Lokesh Kanagaraj: న‌టుడిగా ఎంట్రీ ఇస్తోన్న లోకేష్ క‌న‌క‌గ‌రాజ్ - శృతిహాస‌న్‌తో రొమాన్స్

Lokesh Kanagaraj: న‌టుడిగా ఎంట్రీ ఇస్తోన్న లోకేష్ క‌న‌క‌గ‌రాజ్ - శృతిహాస‌న్‌తో రొమాన్స్

08 February 2024, 6:02 IST

  • Lokesh Kanagaraj: కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్ న‌టుడిగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. ఆన్‌స్క్రీన్‌లో శృతిహాస‌న్‌తో రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతోన్నాడు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఈ మ్యూజిక్ వీడియో రాబోతోంది. ల‌వ‌ర్స్ డే కానుక‌గా ఫిబ్ర‌వ‌రి 14న ఈ మ్యూజిక్ వీడియోను రిలీజ్ చేయ‌బోతున్నారు.

లోకేష్ క‌న‌గ‌రాజ్‌,  శృతిహాస‌న్
లోకేష్ క‌న‌గ‌రాజ్‌, శృతిహాస‌న్

లోకేష్ క‌న‌గ‌రాజ్‌, శృతిహాస‌న్

Lokesh Kanagaraj: కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్ ఫ‌స్ట్ టైమ్‌ సిల్వ‌ర్ స్క్రీన్‌పై క‌నిపించ‌బోతున్నాడు. శృతిహాస‌న్‌తో రొమాన్స్ చేయ‌బోతున్నాడు.. అయితే సినిమాలో కాదు. ఓ మ్యూజిక్ వీడియో ద్వారా లోకేష్ క‌న‌గ‌రాజ్ న‌టుడిగా ఎంట్రీ ఇస్తోన్నాడు. ప్రేమ‌ గొప్ప‌ద‌నాన్నిచాటిచెబుతూ సాగే ఈ మ్యూజిక్ వీడియోలో లోకేష్ క‌న‌గ‌రాజ్‌కు జోడీగా శృతిహాస‌న్ న‌టిస్తోంది. ఈ పాట‌ను శృతిహాస‌న్ స్వ‌యంగా రాయ‌డ‌మే కాకుండా దీనికి మ్యూజిక్ కూడా అందించ‌బోతున్న‌ది. కూతురి మ్యూజిక్ వీడియోకు క‌మ‌ల్‌హాస‌న్ ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. త‌న ప్రొడ‌క్ష‌న్ హౌజ్ రాజ్ క‌మ‌ల్ ఇంట‌ర్నేష‌న‌ల్ ద్వారా ఈ మ్యూజిక్ వీడియోను రిలీజ్ చేయ‌నున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Blink OTT Streaming: వీకెండ్‌లో ఈ కన్నడ సై-ఫి థ్రిల్లర్ మూవీ అస్సలు మిస్ కావద్దంటున్న ఓటీటీ ప్రేక్షకులు

Flop Movies With super hit songs: పాట హిట్.. బొమ్మ ఫట్.. తెలుగులో సూపర్ హిట్ సాంగ్స్ ఉన్న ఫ్లాప్ మూవీస్ ఇవే

Korean Movies in Cannes: కేన్స్‌లో దుమ్ము రేపిన ఈ కొరియన్ సినిమాలను ఏ ఓటీటీల్లో చూడాలంటే..

Love Me Trailer: భయపెడుతున్న వైష్ణవి చైతన్య లవ్ మి ట్రైలర్.. ఇంతకీ ఆ దెయ్యం ఎవరు?

ల‌వ‌ర్స్ డే రోజు రిలీజ్‌....

మ్యూజిక్ వీడియో తాలూకు పోస్ట‌ర్‌ను శృతిహాస‌న్ ట్విట్ట‌ర్‌లో షేర్ చేసింది. ఈ పోస్ట‌ర్ వైర‌ల్ అవుతోంది. ల‌వ‌ర్స్ డే కానుక‌గా ఫిబ్ర‌వ‌రి 14న శృతిహాస‌న్‌, లోకేష్ క‌న‌గ‌రాజ్ మ్యూజిక్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేయ‌బోతున్నారు. గురువారం చెన్నైలో ఈ మ్యూజిక్ వీడియో షూటింగ్ ప్రారంభం కానున్న‌ట్లు తెలిసింది. రెండు రోజుల్లో షూటింగ్ మొత్తం కంప్లీట్ చేయ‌నున్న‌ట్లు చెబుతోన్నారు. ఈ మ్యూజిక్ వీడియోలో లోకేష్‌, శృతిహాస‌న్ కెమిస్ట్రీ హైలైట్‌గా ఉండ‌బోతున్న‌ట్లు చెబుతోన్నారు.

న‌టుడిగా ఎంట్రీ...

ఈ మ్యూజిక్ వీడియోతోనే లోకేష్ క‌న‌గ‌రాజ్ న‌టుడిగా ఎంట్రీ ఇస్తోన్నాడు. క‌మ‌ల్‌హాస‌న్‌తో ఉన్నఅనుబంధం కార‌ణంగానే ఈ మ్యూజిక్ వీడియోలో న‌టించ‌డానికి లోకేష్ అంగీక‌రించిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. గ‌తంలో క‌మ‌ల్ హాస‌న్‌, లోకేష్ క‌న‌గ‌రాజ్ కాంబినేష‌న్‌లో విక్ర‌మ్ మూవీ రూపొందింది. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ 500 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

కోలీవుడ్‌లో స్టార్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌రిగా కొన‌సాగుతోన్న‌ లోకేష్ క‌న‌గ‌రాజ్‌కు హీరోగా చాలా అవ‌కాశాలు వ‌స్తున్నాయి. కానీ డైరెక్ట‌ర్‌గా బిజీగా ఉండ‌టంతో వాటిని తిర‌స్క‌రిస్తూ వ‌చ్చాడు. త్వ‌ర‌లోనే హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. కేజీఎఫ్ స్టంట్ మాస్ట‌ర్స్ అన్బుఅరివు డైరెక్ట‌ర్లుగా ఎంట్రీ ఇస్తోన్న మూవీలో లోకేష్ క‌న‌గ‌రాజ్ హీరోగా న‌టించ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

గ‌త ఏడాది మూడు స‌క్సెస్‌లు...

హీరోయిన్‌గా శృతిహాస‌న్ టాలీవుడ్‌లో మ‌ళ్లీ ఫుల్ బిజీగా మారింది. గ‌త ఏడాది సంక్రాంతికి చిరంజీవి వాల్తేర్ వీర‌య్య‌, బాల‌కృష్ణ వీర‌సింహారెడ్డితో బ్లాక్‌బ‌స్ట‌ర్‌ స‌క్సెస్‌ల‌ను అందుకున్న‌ది. స‌లార్‌తో 2023కు ఘ‌న విజ‌యంతో ముగింపు ప‌లికింది. ప్ర‌భాస్ హీరోగా న‌టించిన ఈ మూవీలో ఆద్య అనే అమ్మాయిగా శృతిహాస‌న్ క‌నిపించింది. 650 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన స‌లార్ మూవీ 2023లో ఇండియాలోనే హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న టాప్ టెన్ సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. సెకండ్ పార్ట్ శౌర్యంగ‌ప‌ర్వంలో శృతిహాస‌న్ పాత్ర కీల‌కంగా ఉండ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం అడివిశేష్‌తో డెకాయిట్ అనే మూవీ చేస్తోంది శృతిహాస‌న్‌.

హాలీవుడ్ ఎంట్రీ....

2024లో శృతిహాస‌న్ న‌టిగా హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది. ఇంగ్లీష్ భాష‌లో ది ఐ పేరుతో ఓ మూవీ చేస్తోంది శృతిహాస‌న్‌. సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి డ‌ఫానే ష్మోన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. మార్క్ రౌలీ హీరోగా న‌టిస్తోన్నాడు. కొన్ని ఇంట‌ర్‌నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్‌లో ది ఐ మూవీని స్క్రీనింగ్ చేశారు. వీటిలో శృతిహాస‌న్ యాక్టింగ్‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం