తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Lal Salaam Trailer: రజనీకాంత్ లాల్ సలామ్ ట్రైలర్ వచ్చేసింది.. స్పెషల్ అట్రాక్షన్‌గా కపిల్ దేవ్

Lal Salaam Trailer: రజనీకాంత్ లాల్ సలామ్ ట్రైలర్ వచ్చేసింది.. స్పెషల్ అట్రాక్షన్‌గా కపిల్ దేవ్

Hari Prasad S HT Telugu

07 February 2024, 19:11 IST

    • Lal Salaam Trailer: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లాల్ సలామ్ మూవీ ట్రైలర్ బుధవారం (ఫిబ్రవరి 7) రిలీజైంది. క్రికెట్, మత ఘర్షణలతో ఈ ట్రైలర్ అంతా చాలా ఆసక్తికరంగా సాగింది. టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు.
రజనీకాంత్ లాల్ సలామ్ ట్రైలర్ వచ్చేసింది
రజనీకాంత్ లాల్ సలామ్ ట్రైలర్ వచ్చేసింది

రజనీకాంత్ లాల్ సలామ్ ట్రైలర్ వచ్చేసింది

Lal Salaam Trailer: మత సామరస్యాన్ని చాటుతూ ఇండియా గొప్పదనాన్ని చాటేలా రజనీకాంత్ నటించిన లాల్ సలామ్ మూవీ ట్రైలర్ ఉంది. శుక్రవారం (ఫిబ్రవరి 9) రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ బుధవారం (ఫిబ్రవరి 7) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

NNS 21st May Episode: ​​​​సరస్వతిని చంపాలని చూసిన మనోహరి.. భాగీ మోసం చేసిందని కోపంతో వెళ్లిపోయిన అమర్

Prasanth Varma Ranveer Singh: హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ భారీ బడ్జెట్ మూవీ అటకెక్కినట్లేనా?

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల‌లో ప్ర‌భాస్ క‌ల్కి 2898 ఏడీ రిలీజ్ - తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే

Sreemukhi: అజిత్ కంటే ముందు గుడ్ బ్యాడ్ అగ్లీ టైటిల్ శ్రీముఖిదే - రిలీజ్‌కు నోచుకోని తెలుగు యాంక‌ర్ బోల్డ్ మూవీ

ఇందులో మొయిద్దీన్ భాయ్ అనే ఓ పవర్ ఫుల్ పాత్రలో రజనీ నటించాడు. ఓ వైపు క్రికెట్, మరోవైపు మత ఘర్షణలతో సాగిన ఈ ట్రైలర్ లో వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు.

లాల్ సలామ్ ట్రైలర్

రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ ఐదేళ్ల తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టుకొని ఈ లాల్ సలామ్ మూవీ తెరకెక్కించింది. ఓ క్రికెట్ మ్యాచ్ రెండు గ్రామాల మధ్య ఉద్రిక్తతలకు ఎలా దారితీసింది? ఆ తర్వాత అది కాస్తా మత ఘర్షణలుగా ఎలా మారింది? వీటిని చల్లార్చేందుకు మొయిద్దీన పాత్రలో రజనీకాంత్ ఏం చేశాడన్నది ఈ లాల్ సలామ్ స్టోరీగా కనిపిస్తోంది.

ట్రైలర్ చాలా ఆసక్తికరంగా సాగింది. మొదట్లోనే ఓ క్రికెట్ మ్యాచ్, అదే సమయంలో గ్రామంలో గొడవలను చూపించారు. ప్రశాతంగా ఉన్న ఊరిని శ్మశానంగా మారుస్తున్నారన్న వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. మూవీలో లీడ్ రోల్స్ లో విష్ణు విశాల్, విక్రాంత్ కనిపించారు. ఈ ట్రైలర్ నిమిషం తర్వాతగానీ రజనీ ఎంట్రీ ఉండదు. సూపర్ స్టార్ ఎంట్రీ కూడా అదిరిపోయింది.

ఈ మత ఘర్షణలను ఓ క్రికెట్ టోర్నమెంట్ ద్వారా చల్లార్చాలనుకునే మొయిద్దీన్ భాయ్ పాత్రలో రజనీ కనిపించాడు. ట్రైలర్ లో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. అతడు ప్లేయర్స్ కు శిక్షణ ఇస్తూ కనిపించాడు. మతాన్ని నమ్మితే మనసులో ఉంచుకో.. మానవత్వాన్ని అందరితో పంచుకో అంటూ ట్రైలర్ చివర్లో రజనీ ఓ పవర్ ఫుల్ డైలాగ్ కూడా చెప్పాడు.

రజనీ భారీ రెమ్యునరేషన్

ఈ లాల్ సలామ్ మూవీలో రజనీకాంత్ ది అతిథి పాత్రే. సుమారు 40 నిమిషాల పాటు మాత్రమే కనిపించనున్నాడు. అయితే దీనికోసమే అతడు రూ.40 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవడం విశేషం. అంటే నిమిషానికి రూ.కోటి వసూలు చేశాడన్న మాట. గతేడాది జైలర్ మూవీ సూపర్ డూపర్ హిట్ తో మళ్లీ గాడిలో పడిన రజనీ.. ఇప్పుడీ లాల్ సలామ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

తెలుగులోనూ ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. అయితే గురువారం (ఫిబ్రవరి 8) రిలీజ్ కానున్న యాత్ర 2, శుక్రవారం (ఫిబ్రవరి 9) రిలీజ్ కానున్న రవితేజ ఈగల్ సినిమాల నుంచి లాల్ సలామ్ కు గట్టి పోటీ ఎదురు కానుంది. ఈ రెండు సినిమాల పోటీని తట్టుకొని రజనీ మూవీ ఎంత వరకూ నిలబడుతుందో చూడాలి.

ఇక ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు. అంతేకాదు ఈ మూవీ కోసం అతడు ఇద్దరు దివంగత సింగర్ల వాయిస్ ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రీక్రియేట్ చేయడం విశేషం. బంబా బక్యా, హమీద్ ల వాయిస్ ను మరోసారి ఈ సినిమాలో ప్రేక్షకులు విననున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం