Eagle new trailer: దళం, సైన్యం కాదు దేశం వచ్చినా ఆపుతాను: ఈగల్ నుంచి మరో పవర్‌ఫుల్ ట్రైలర్
Eagle new trailer: మాస్ మహారాజా రవితేజ నటించిన ఈగల్ మూవీ నుంచి మరో ట్రైలర్ బుధవారం (ఫిబ్రవరి 7) రిలీజైంది. పవర్‌ఫుల్ యాక్షన్, డైలాగులతో ఈ ట్రైలర్ మూవీపై అంచనాలను పెంచేసింది.
Eagle new trailer: టైగర్ నాగేశ్వరరావు మూవీ ఇచ్చిన షాక్ తర్వాత రవితేజ ఇప్పుడు ఈగల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ మూవీ శుక్రవారం (ఫిబ్రవరి 9) రిలీజ్ కానుండగా.. బుధవారం (ఫిబ్రవరి 7) మేకర్స్ మరో ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ మధ్యే సినిమా మొత్తం చూసి అద్భుతంగా ఉందంటూ రవితేజ చేసిన కామెంట్స్ లాగే ఈ కొత్త ట్రైలర్ ఉంది. పవర్‌ఫుల్ యాక్షన్, డైలాగులతో అదిరిపోయింది
ఈగల్ కొత్త ట్రైలర్
నిమిషంన్నర నిడివి ఉన్న ఈ ఈగల్ కొత్త ట్రైలర్ మొదట వచ్చిన ట్రైలర్ కంటే కూడా బాగుంది. ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ లు, రవితేజ మాస్ డైలాగులతో ఈ ట్రైలర్ నింపేశారు. లుంగీ కట్టుకొని, చేతిలో గన్ను పట్టుకొని రవితేజ ఓ డిఫరెంట్ లుక్ లో కనిపించాడు. ఈ కొత్త ట్రైలర్ ను డైరెక్టర్లు అనిల్ రావిపూడి, బాబీ, హరీష్ శంకర్ రిలీజ్ చేశారు.
దళం, సైన్యం కాదు దేశమే వచ్చినా అడ్డుకుంటాను అంటూ రవితేజ ఈ ట్రైలర్ లో చెప్పిన ఓ డైలాగు బాగుంది. ఇక ఇలాంటి వాళ్లను చాలా మందిని చూశాను అని అవసరాల శ్రీనివాస్ ఓ డైలాగ్ అంటే.. ఆ చాలా మంది చివరిగా చూసింది అతన్నే అని నవదీప్ అనడం రవితేజ పాత్రను ఓ రేంజ్ లో ఎలివేట్ చేసింది. మొదట వచ్చిన ట్రైలర్ కూడా రవితేజ పాత్ర గురించి నవదీప్, అనుపమ మాట్లాడుతుండగా మొదలవుతుంది.
ఈగల్ మూవీపై రవితేజ రివ్యూ
ఇక ఈ మధ్యే తన ఈగల్ మూవీని రవితేజ చూసి రివ్యూ కూడా ఇచ్చాడు. రిలీజ్‌కు మూడు రోజుల ముందే రవితేజతో పాటు సినిమా యూనిట్ ఈగల్ మూవీని స్పెషల్‌గా షో వేసుకొని చూశారు. ఈ ప్రివ్యూ చూసిన రవితేజ హ్యాపీగా కనిపించారు. ఈగల్ అవుట్‌పుట్ విషయంలో ఐ యామ్ సూపర్ సాటిస్పైడ్ అంటూ కామెంట్స్ చేశారు. దర్శకుడిని అభినందించారు. రవితేజ సినిమా చూస్తూ ఎంజాయ్ చేసిన వీడియోను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఈగల్ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేయాలని నిర్మాత నిర్ణయించుకున్నారు. కానీ సంక్రాంతి బరిలో గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ, హనుమాన్ సినిమాలు నిలవడంతో థియేటర్ల సమస్య ఏర్పడింది. ఒకేసారి ఐదు స్ట్రెయిట్ సినిమాలు రిలీజైతే అన్ని సినిమాలు నష్టపోయే ప్రమాదం ఉండటంతో ఫిలింఛాంబర్, ప్రొడ్యూసర్ గిల్డ్ కలిసి సంక్రాంతి నిర్మాతలతో చర్చలు జరిపి ఈగల్‌ను ఫిబ్రవరి 9కి వాయిదావేశారు.
ఈగల్ ప్రీరిలీజ్ బిజినెస్, టికెట్ల ధరలు
ఈగల్ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా రూ.23 కోట్లుగా ఉంది. ఈ సినిమాకు పెద్దగా పోటీ లేకపోవడంతో బ్రేక్ ఈవెన్ అందుకోవడం కష్టం కాకపోవచ్చు. ఈ వీకెండ్ లో యాత్ర 2తోపాటు లాల్ సలామ్ మాత్రమే రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాల నుంచి ఈగల్ కు పోటీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. వచ్చే శుక్రవారం (ఫిబ్రవరి 16) ఊరు పేరు భైరవకోన రానుంది.
అప్పటి వరకూ ఈగల్ హవా నడవచ్చు. ఇక ఈ మూవీ మేకర్స్ టికెట్ల ధరలను అందుబాటులో ఉంచి మంచి ఎత్తుగడ వేశారు. ఈగల్ మూవీ సింగిల్ స్క్రీన్ టికెట్ ధర రూ.150, మల్టీప్లెక్స్ రూ.200గా ఉంచారు. టికెట్ల ధరలు తగ్గించడం కూడా తమ సినిమాకు ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు.