తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Jyothika Suriya Love Story: అందుకే సూర్యను పెళ్లి చేసుకున్నా.. అంతా నెల రోజుల్లోనే అయిపోయింది: జ్యోతిక

Jyothika Suriya Love Story: అందుకే సూర్యను పెళ్లి చేసుకున్నా.. అంతా నెల రోజుల్లోనే అయిపోయింది: జ్యోతిక

Hari Prasad S HT Telugu

18 October 2023, 15:51 IST

  • Jyothika Suriya Love Story: సూర్యను పెళ్లి చేసుకోవడానికి కారణమేంటో చెప్పింది కోలీవుడ్ నటి జ్యోతిక. ఈ ఇద్దరి లవ్ స్టోరీ, పెళ్లి, పిల్లలు సినిమా ఇండస్ట్రీలో ఎంతో ప్రత్యేకమని చెప్పాలి.

సూర్య, జ్యోతిక
సూర్య, జ్యోతిక

సూర్య, జ్యోతిక

Jyothika Suriya Love Story: సూర్య, జ్యోతిక లవ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ అనే చెప్పాలి. అసలు తాను సూర్యను ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో జ్యోతిక ఓ ఇంటర్వ్యూలో వివరించింది. బుధవారం (అక్టోబర్ 18) తన 45వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా తమ పెళ్లి నేపథ్యాన్ని ఆమె చెప్పడం విశేషం. అంతా నెల రోజుల్లోనే అయిపోయినట్లు ఈ సందర్భంగా జ్యోతిక చెప్పింది.

ట్రెండింగ్ వార్తలు

Vazhakku: హీరోతో గొడవ.. సినిమాను నేరుగా వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‍ఫామ్‍లో రిలీజ్ చేసిన డైరెక్టర్

Sharathulu Varthisthai OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Double iSmart Teaser Time: డబుల్ ఇస్మార్ట్ సినిమా టీజర్ రిలీజ్‍కు టైమ్ ఖరారు

Salman Khan: సల్మాన్ ఖాన్ ఆ గుడికి వచ్చి క్షమాపణ అడగాలి.. అలాంటి తప్పు మళ్లీ చేయనని ప్రమాణం చేయాలి: బిష్ణోయ్ సమాజం

సినిమా ఇండస్ట్రీలో సూర్య, జ్యోతికలాంటి స్టార్ హీరో, హీరోయిన్ల పెళ్లి కామనే అయినా.. ఎన్నో ఏళ్లుగా అన్యోన్య దాంపత్యం కొనసాగిస్తున్న వాళ్ల జీవితం మాత్రం ఎంతోమందికి ఆదర్శం. అలా అని వీళ్లు పెళ్లికి ముందే ఎన్నో ఏళ్ల పాటు డేటింగ్ అనో, రిలేషన్‌ లో ఉండటమనో చేయలేదు. ప్రపోజ్ చేయడం నుంచి పెళ్లి వరకూ అంతా నెల రోజుల్లోనే అయిపోయిందని జ్యోతిక చెప్పింది.

సూర్య, జ్యోతిక లవ్ స్టోరీ

ఓ ఇంటర్వ్యూ సందర్భంగా అసలు తాను సూర్యను ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో జ్యోతిక వివరించింది. "సూర్యను నేను పెళ్లి చేసుకోవడానికి అతడు నాకు ఇచ్చిన గౌరవమే ప్రధాన కారణం. మేము తొలిసారి పూవెల్లమ్ కెట్టుప్పర్ అనే సినిమాలో కలిసి నటించాం.

నాతో చాలా క్యాజువల్ గా మాట్లాడాడు. ఆ తర్వాత ఏడు సినిమాల్లో కలిసి నటించాం. ఎవరైనా డైరెక్టర్ ఓ రొమాంటిక్ సీన్ వివరించినప్పుడు సూర్య అంత వరకే నటించేవాడు. దానిని అదునుగా తీసుకునేవాడు కాదు. ఆ గౌరవమే నన్ను ఆకర్షించింది.

ఇక నేను అప్పటికే 10 ఏళ్ల పాటు షూటింగ్ లలో 9 నుంచి 6 వరకూ పని చేసీ చేసీ అలసిపోయాను. నాకు అవసరమైనంత డబ్బు అప్పటికే సంపాదించేశాను. ఆ సమయంలోనే సూర్య నాకు ప్రపోజ్ చేశాడు. నా కుటుంబం కూడా అంగీకరించింది. దీంతో మరీ ఎక్కువగా ఆలోచించకుండా ఆ తర్వాతి నెలలోనే పెళ్లి చేసుకున్నాం" అని జ్యోతిక వివరించింది.

అంతేకాదు సూర్యపై మరిన్ని ప్రశంసలు కురిపించింది. "ఇదేదో మామూలుగా చెప్పడం లేదు. అతడు ఓ తండ్రిగా చాలా సిన్సియర్. తండ్రిగానే కాదు భర్తగానూ సిన్సియరే. సూర్యను చూసి చుట్టు పక్కల వారి భార్యలు.. అతన్ని చూసి నేర్చుకోండి అని తమ భర్తలకు చెప్పడం చూశాను. మేము గడిపిన మధురమైన క్షణాలను అతడు ఇప్పటికీ మరచిపోలేదు. ప్రతిదీ గుర్తంచుకుంటాడు" అని జ్యోతిక చెప్పింది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం