తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Janhvi Kapoor On Nepotism: అలా అనడం నిజంగా బాధించింది.. జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు

Janhvi Kapoor on Nepotism: అలా అనడం నిజంగా బాధించింది.. జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు

09 February 2023, 15:05 IST

    • Janhvi Kapoor on Nepotism: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నెపోటిజంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. తనను నెపో బేబీ అనడం బాధించిందని స్పష్టం చేసింది. గతేడాది రెండు హిట్లను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఆసక్తికర విషయాలను షేర్ చేసింది.
జాన్వీ కపూర్
జాన్వీ కపూర్ (AFP)

జాన్వీ కపూర్

Janhvi Kapoor on Nepotism: అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయగా చిత్రసీమలో అరంగేట్రం చేసింది జాన్వీ కపూర్. అంతేకాకుండా తండ్రి బోనీ కపూర్ బాలీవుడ్‌లో పెద్ద నిర్మాత. సోదరుడు, బాబాయిలు, కజిన్స్ ఇలా అందరూ సినీ ఇండస్ట్రీలోనే ఉన్నారు. ఇంకేముంది జాన్వీ కపూర్‌కు చిత్రసీమలో అవకాశాలు వాటంతటా అవే వస్తాయి. పుట్టగానే స్టార్ అయిపోయింది. అంటూ ఆమెపై ఎన్నో విమర్శలు వచ్చాయి. అంతటితో ఆగకుండా బాలీవుడ్‌లో ఇటీవల కాలంలో నెపోటిజం ట్రెండ్ అవడంతో ఓ రేంజ్‌లో నెట్టింట ఆమెను ట్రోల్ చేశారు. అయినప్పటికీ వీటన్నింటినీ భరించి వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది జాన్వీ. గతేడాది ఆమె నటించిన రెండు సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. అయితే ఇంత కష్టపడుతున్నప్పటికీ తనను నెపోటిజం కీ బచ్చీ(బందుప్రీతి బిడ్డ) అంటూ దూషిస్తున్నారని వాపోతోంది ఈ ముద్దుగుమ్మ. ఆ మాటలు తనను ఎంతగానో బాధిస్తున్నాయని తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు

Kiara Advani: గేమ్‍ ఛేంజర్ ‘జరగండి’ పాటపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెెప్పిన కియారా.. ఈ సాంగ్‍కు ఎన్ని రోజుల షూటింగ్ అంటే..

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

"మీరు ఏం చేసినా కానీ కొంతమంది మీలో తప్పులను మాత్రమే వెతుకుంటారు. ఎందుకంటే వారికి అదే ముఖ్యమైన అనుభూతిని కలిగిస్తుంది. ఫలితంగా ఎప్పుడూ హెడ్ లైన్స్‌లో మీరే నిలుస్తారు. నా బలాలు, బలహీనతలు నాకు తెలుసు. నేను ఎప్పుడు మంచి పని చేసినా, చేయకపోయినా తెలుసుకోవాలనే లక్ష్యంతో ఉన్నాను. నా గత రెండు చిత్రాల ద్వారా నా వద్ద ఏమైనా ఆఫర్లు ఉన్నాయా అని నిర్ధారించుకున్నాను" అని జాన్వీ తెలిపింది.

"నీకు నటించడం రాకపోతే ఎందుకు ప్రయత్నిస్తున్నావ్? నెపో బేబీ అని ఎవరైనా అన్నప్పుడు పడ్డ కష్టానికి ఎంతో బాధేస్తుంది. ఎవరైనా నా పనిని మెచ్చుకుని, నిర్మాణాత్మక అభిప్రాయాన్ని ఇచ్చినప్పుడు వారిని గౌరవిస్తాను. ఉదాహారణకు మిలీలో నా నటనను మెచ్చుకుని, మరోక చిత్రంలో మెరుగుపరచుకోవాలని సూచించారు అప్పుడు వారి పట్ల గౌరవం ఏర్పడుతుంది. అయితే కొంతమంది మాత్రం కావాలని ఆనందాన్ని దూరంచేయడానికి ప్రయత్నిస్తారు." అని జాన్వీ స్పష్టం చేసింది.

జాన్వీ కపూర్ గతేడాది నటించిన మిలీ, గుడ్ లక్ జెర్రీ లాంటి చిత్రాలు ఓటీటీలో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందాయి. ఆమె నటనకు ప్రశంసలు వచ్చాయి. ఆమె 2018లో ఇషాన్ కట్టర్‌తో కలిసి ధడక్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం