Guppedantha Manasu May 5th Episode: ప్రమాదంలో రిషి ప్రాణాలు - శైలేంద్ర వేసిన స్కెచ్ నుంచి రిషి సేఫ్‌గా బయటపడ్డాడా?
05 May 2023, 8:30 IST
Guppedantha Manasu May 5th Episode: రిషిని ఓడించాలంటే అతడి నుంచి జగతి, వసుధారలను దూరం చేయాలని శైలేంద్ర, దేవయాని కలిసి మాస్టర్ ప్లాన్స్ వేస్తారు. వారు వేసిన ప్లాన్ కారణంగా రిషికి ఎలాంటి ప్రమాదం జరిగిందో తెలియాలంటే నేటి గుప్పెడంత మనసు సీరియల్ చూడాల్సిందే...
Guppedantha Manasu
Guppedantha Manasu May 5th Episode: రిషిని ఓడించాలంటే ముందుగా జగతి, వసుధార అడ్డుతొలగించుకోవాలని శైలేంద్ర ఫిక్స్ అవుతాడు. ఆ ప్లాన్‌ను అమలు చేయడం మొదలుపెడతాడు. అమ్మ అనే పిలుపుకు మీరు నోచుకోకపోవడం చూస్తుంటే జాలేస్తుందని జగతిని మాటలతోనే రెచ్చగొడతాడు. . రిషిమీద అంత ప్రేమ ఎందుకు? దేనికోసం ఈ పాకులాట అంటూ ఆమెను మాటలతో హర్ట్ చేస్తాడు. రిషిపై ఆమెకున్నప్రేమను చంపేయాలని అనుకుంటాడు. అతడి మాటలకు జగతి ఫైర్ అవుతుంది.
తల్లికి కొడుకు మీద ఉండే ప్రేమను ఎందుకు అని ప్రశ్నిస్తున్నావా? ఇదే మాటను దేవయానిని అడుగు అంటూ శైలేంద్రకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది. తల్లి ప్రేమ నీకు తెలియదు..అమ్మ ప్రేమకు ప్రశ్నలు, ఆశ్చర్యాలు ఉండవు. అదొక అద్భుతం, అనంతం అంటూ సమాధానమిస్తుంది. జగతి కోపాన్ని శైలేంద్ర లైట్ తీసుకుంటాడు. నీవైపే ప్రేమ ఉంది. రిషివైపు లేదు. నీ అద్భుతమైన ప్రేమకు అర్థం లేదు. లాభం లేదు అంటూ మాటలతోనే ఆమెను దెప్పిపొడుస్తాడు.
కానీ జగతి మాత్రం తన సహనం కోల్పోకుండా తల్లిదండ్రుల ప్రేమలో లాభాపేక్ష, స్వార్థం ఉండదని అంటుంది. రిషి తనను అమ్మ అని పిలువకపోయినా మేడమ్ అనే పిలుపులో ఆ ప్రేమ, అప్యాయత కనిపిస్తున్నాయి. నాకు అది చాలు అంటూ అతడికి సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
జగతి భయం...
శైలేంద్రకు గట్టిగా బదులిచ్చినా అతడి మాటలను మాత్రం జగతి మర్చిపోలేకపోతుంది. రిషికి అతడు ఎలాంటి ఆపద తలపెడతాడో అనే భయంతో ఒంటరిగా రూమ్‌లో కూర్చొని ఆలోచనలో మునిగిపోతుంది. ఆమె డల్‌గా ఉండటం చూసి కారణం ఏమిటని మహేంద్ర అడుగుతాడు. కానీ అతడిని ఏం లేదని చెప్పి మాట దాటివేస్తుంది. కొంచెం తలనొప్పిగా ఉందంటూ అబద్ధం చెబుతుంది. వసుధారతో ఆమెకు కాఫీ పంపిస్తాడు మహేంద్ర.
అక్కడకు వచ్చిన వసుధారతో నీతో కొంచెం మాట్లాడేది ఉందంటూ జగతి అంటుంది. ఆమె మాటలు వసుధారకు అర్థం కావు. అందుకు రిషినికాపాడే విషయంలో మన ఇద్దరి మీద చాలా భారం, బాధ్యతల ఉన్నాయని అంటుంది. నా కొడుకును కాపాడుకోవడం కోసం నేను చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేస్తా...కానీ నువ్వు మాత్రం రిషిని కంటికి రెప్పాలా కాపాడాలి అంటుంది.
జగతికి మాటిచ్చిన వసు
రిషికి దూరంగా ఒంటరిగా ఉన్నప్పుడు బాధపడ్డాను కానీ భయపడలేదు. కానీ ఇప్పుడు రిషి విషయంలో చాలా భయమేస్తుంది. శత్రువులు రిషికి ఏ అపాయం తలపెడతారో అని భయంగా ఉందంటూ జగతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆమెను వసుధార ఓదార్చుతుంది. రిషి మంచివాళ్లకు మంచివాడు. చెడ్డవాళ్లకు చెడ్డవాడు అంటూ జగతిలో వసుధార ధైర్యాన్ని నింపుతుంది. నేను పక్కనుండగా రిషిని ఎవరు ఏం చేయాలేరని అంటుంది.
తల్లికి శైలేంద్ర సలహా...
మరోవైపు రిషిని దెబ్బతీసేందుకు తల్లి దేవయానితో కలిసి శైలేంద్ర కొత్త ప్లాన్‌ను తెరపైకి తీసుకొస్తాడు. అందుకోసం ప్రేమ పేరుతో రిషిని గుప్పిట్లో పెట్టుకోవాలని. జగతి, వసుధారలకు అతడిని దూరం పెట్టాలని తల్లికి సూచిస్తాడు. తమ ప్లాన్ జగతికి తెలిసిందేమోనని అనుమానపడతాడు.
అతడి మాటలకు జగతిని అంత తేలికగా తీసుకోవద్దని దేవయాని సలహా ఇస్తుంది. తల్లి ప్రేమకు ఆమెను దూరం చేసిన తొణకలేదని, తన మాటలతో రిషికి మళ్లీ దగ్గరయ్యిందని అంటుంది. జగతి, వసుధారలే రిషికి పెద్ద బలం వారిని దాటితే రిషిని ఈజీగా దెబ్బకొట్టవచ్చని దేవయాని అంటుంది. అందుకు నా దగ్గర అన్ని ప్లాన్స్ రెడీగా ఉన్నాయని శైలేంద్ర అంటాడు.
శైలేంద్ర ప్లాన్ విన్న ధరణి…
ఇంతలోనే వారి రూమ్‌లో ధరణి కనిపిస్తుంది. ఆమెను చూసి ఇద్దరు షాక్ అవుతారు. దొంగచాటుగా ఉండి మాటలు వినడం ఏంటి? ఈ మాటలను ఎవరికైనా చెబితే ఏం చేస్తానో నాకే తెలియదు అంటూ భార్యకు శైలేంద్ర వార్నింగ్ ఇస్తాడు. ఇదే అదనుగా ధరణిని భరించడం నా వల్ల కావడం లేదని ఆమెపై శైలేంద్రకు లేనిపోనీ చాడీలు చెబుతుంది దేవయాని.
నీ కన్నీళ్లకు ఇక్కడ ఎవరు కరగరు అంటూ ఇద్దరు కలిసి ఆమెను మాటలతోనే ఎడిపిస్తారు. మనం వేసే అడుగులు, ప్లాన్స్ మూడో వ్యక్తికి తెలియకూడదని ఇద్దరు డిసైడ్ అవుతారు. అదే సమయంలో రిషి, వసుధార బయటకు వెళుతూ వారి కంట పడతారు. వారిద్దరి అన్యోన్యతను చూసి అసూయపడతారు. వెళ్లెప్పుడు ఉండే ఉత్సాహం వచ్చేప్పుడు ఉండదని శైలేంద్ర అంటూ ఫోన్ చేతిలోకి తీసుకుంటాడు.
వసుధారకు రిషి సర్ప్రైజ్
ఎప్పుడు కాలేజీ పనులతో బిజీగా ఉండే రిషి, వసుధార రొమాంటిక్ మూడ్‌లోకి వెళ్లిపోతారు. నైట్డ్రైవ్కు వెళతారు. జర్నీలో మీకు ఈ మధ్య ధైర్యం ఎక్కువవుతోందని, జెంటిల్మెన్ కాస్తా లవర్‌బాయ్‌గా మారిపోతున్నారంటూ రిషిని ఉడికిస్తుంది వసుధార. ఇంతకుముందు జెంటిల్మన్ రేషియో ఎక్కువగా ఉండేది..లవర్ బాయ్ రేషియో తక్కువగా ఉండేది...ఇప్పుడు లవర్‌బాయ్ రేషియో ఎక్కువైందని అంటుంది.
ఇలా ఎప్పుడు పడితే అప్పుడు బయటకు రావాచ్చా అంటుంది. ఆమె మాటలకు రిషి...సర్ ఇంటికి వెళ్దాం పదా అంటాడు. ఇంతలోనే మీ సంతోషాన్ని చెడగొట్టే పాపం నాకు ఎందుకు అంటూ సరదాగా జర్నీని కొనసాగించమని వసుధార అతడితో అంటుంది. వసుధారను తీసుకొని రిషి కాలేజీకి వస్తాడు.
నైట్ టైమ్‌లో కాలేజీకి తీసుకురావడం చూసి వసుధార ఆశ్చర్యపోతుంది. ఈ మధ్య సర్ప్రైజ్లు నాకు ఎక్కువైపోతున్నాయని రిషితో అంటుంది. ఇంతలోనే ఓ దుండగుడు రిషిపై కత్తితో దాడిచేస్తాడు. ఆప్రమాదం నుంచి రిషి తృటిలో తప్పించుకోవడంతో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.