Guppedantha Manasu May 4th Episode: శైలేంద్ర ఈవిల్ ప్లాన్స్ షురూ.. రిషి-జగతీనే టార్గెట్-guppedantha manasu 2023 may 4th episode shailendra evil plans on rishi ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Guppedantha Manasu 2023 May 4th Episode Shailendra Evil Plans On Rishi

Guppedantha Manasu May 4th Episode: శైలేంద్ర ఈవిల్ ప్లాన్స్ షురూ.. రిషి-జగతీనే టార్గెట్

Maragani Govardhan HT Telugu
May 04, 2023 07:45 AM IST

Guppedantha Manasu May 4th Episode: గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్‌లో శైలేంద్ర తన కపటపు ఆలోచనలు అమలు చేసేందుకు ప్రయత్నిస్తాడు. ఇందులో భాగంగా సౌజన్యరావును సిద్ధంగా ఉండమని చెబుతాడు. అంతేకాకుండా జగతీ-రిషిని టార్గెట్ చేసుకుని వారి బంధాన్ని గుర్తుకుతీసుకొస్తూ మాట్లాడతాడు.

గుప్పెడంత మనసు మే 4వ తేదీ ఎపిసోడ్
గుప్పెడంత మనసు మే 4వ తేదీ ఎపిసోడ్

Guppedantha Manasu May 4th Episode: గుప్పెడంత మనసు నిన్నటి ఎపిసోడ్‌లో శైలేంద్ర నటన గురించి జగతీ తెలుసుకుంటుంది. ధరణిని బెదిరించడం చాటుగా విన్న ఆమెకు తన అనుమానం ఇంకా బలపడుతుంది. అనంతరం కాలేజ్‌లో రిషి ఫ్రీ మెడికల్ ఎడ్యూకేషన్ ప్లాన్ గురించి తన ఫ్యామిలీ మెంబర్స్‌కు వివరిస్తాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్లందరూ ఒక్కో పేద విద్యార్థిని సపోర్ట్ చేస్తే ఈ ఫ్రీ మెడికల్ ఎడ్యూకేషన్ సాధ్యమవుతుందని చెబుతాడు. ఇందుకు అందరూ సానుకూలంగా స్పందించడమే కాకుండా రిషి ఐడియాను మెచ్చుకుంటారు. మరోపక్క శైలేంద్రకు మాత్రం ఈ ఐడియా నచ్చదు. కానీ నచ్చినట్లే చప్పట్లు కొడుతూ తన నటనా కౌశలాన్ని ప్రదర్శిస్తాడు.

రిషిపై ప్రశంసల వర్షం..

డాక్టర్ చదివే టాలెంట్ ఉండి కేవలం డబ్బు లేకపోవడం వల్ల చదవలేకపోతున్న పేద విద్యార్థులకు సపోర్ట్ చేయాలని రిషి వివరిస్తాడు. వారందరికీ డీబీఎస్‌టీ కాలేజ్ గేట్స్ ఓపెన్ అయ్యే ఉంటాయనే ప్రజలకు తెలియజేయమని అంటాడు. డాక్టర్స్ మేక్స్ డాక్టర్ అనే క్యాప్షన్ అద్భుతంగా ఉందంటూ జగతీ.. రిషిని ప్రశంసిస్తారు.

సీన్ కట్ చేస్తే ఫ్రీ మెడికల్ ఎడ్యూకేషన్ ప్లాన్ గురించి మీడియాకు తెలియడంతో డీబీఎస్టీ కాలేజ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తారు. ఈ న్యూస్‌ అంతా పాకడంతో అందరూ ఫోన్ చేసి రిషిని అభినందిస్తుంటారు. రిషికి వస్తున్న ప్రశంసలను చూసి శైలేంద్ర కోపంతో రగిలిపోతుంటాడు. ఏదోకటి చేయాలని మదనపడుతుంటాడు. మరోపక్క వసుధార.. రిషిని ప్రశంసలతో ముంచెత్తుతుంది. రిషి సార్ చాలా గ్రేట్ అంటూ జగతీతో అంటుంది. శైలేంద్ర మాత్రం రిషిపై ఈర్ష్యతో మండిపోతుంటాడు. గ్రేట్ కాదు.. వరస్ట్ అని నిరూపిస్తా.. ఎవరైతే బ్రహ్మరథం పడుతుంటారో వారి చేతే రాళ్లు విసిరేలా చేయాలని కాలేజ్ బయటకొచ్చి ఆలోచిస్తుంటాడు.

శైలేంద్ర ప్లాన్ షురూ..

రిషికి చాలా మంచి పేరు వచ్చింది. ప్రతి ఒక్క స్టూడెంట్ తమ ఫ్యామిలీ మెంబర్‌లాగా, సొంత బ్రదర్‌లా చూస్తున్నారు. తను హీరో అయిపోయాడు. రిషిని కాకుండా ఆ స్థానంలో వేరొకరిని ఊహించలేరు.. కానీ ఆ స్థానం నాకు కావాలి అనుకుంటూ శైలేంద్ర ఆలోచనలో పడతాడు. వెంటనే ఫోన్ తీసి సౌజన్యరావుకు కాల్ చేస్తాడు. అంతా గమనించాను.. ఎలా, ఎక్కడ నుంచి మొదలుపెట్టాలో ఆలోచించాను. నువ్వు వచ్చే సమయం ఆసన్నమైంది. చెప్పినప్పుడు సిద్ధంగా ఉండు అంటూ సౌజన్యరావుకు ఆదేశాలు జారీ చేసి ఫోన్ పెట్టేస్తాడు.

ఇంతలో జగతీ ఎంట్రీ ఇస్తుంది. ఎక్స్‌క్యూజ్ మీ అంటూ శైలేంద్రను పలకరిస్తుంది. మీరా పిన్నీ.. అంటూ ఆమెను పలకరిస్తాడు శైలేంద్ర. ఇక్కడ కూర్చున్నావేంటి అని అడుగుతుంది. కాసేపు ఒంటరిగా కూర్చోవాలనిపించిందని, అందుకే కూర్చున్నానని బదులిస్తాడు శైలేంద్ర. మీకేమైనా అభ్యంతరమా లేక ఎండీ గారి పర్మిషన్ ఏమైనా తీసుకోవాలా? ఎంతైనా నేను గెస్టును కదా అంటూ వెటకారంగా సమాధానం చెబుతాడు శైలేంద్ర. ఇందుకు జగతీ నువ్వు గెస్టువేంటి శైలేంద్ర.. నువ్వు ఈ కాలేజ్ ఎండీ రిషి అన్నవి.. అలా అని నువ్వు అనుకోవడం లేదా ఏంటి? అడుగుతుంది. ఎందుకు అనుకోను.. అంతటితో సరిపెట్టుకోమంటారా ఏంటి? అంటూ ప్రశ్నిస్తాడు. ఎనీ వే రిషి సకెస్స్ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. వాడి విజయానికి కారణమేంటాని ఆలోచిస్తే మీరు, వసుధార సపోర్ట్‌గా ఉండి వాడికి బలాన్నిస్తున్నారని చెబుతాడు.

రిషియే మా బలమన్న జగతీ..

ఇందుకు జగతీ మాట్లాడుతూ.. పొరపాటుగా ఆలోచిస్తున్నావ్ శైలేంద్ర.. అతడే మాకు శక్తి.. తన ఆలోచనలతో తనంతటా తాను ఎదిగిన ఓ చెట్టు లాంటి వాడని అంటాడు. తనకు వేర్లే కానీ.. కొమ్మలు కావు. మేము కొమ్మలు లాంటివాళ్లమని చెబుతుంది. ఇంతలో రిషి వస్తాడు. దేని గురించి మాట్లాడుకుంటున్నారు.. కాలేజ్ గురించా అని అడుగుతారు. పిన్నికి నీ గురించి మాట్లాడితే వచ్చే ఆనందం.. ఇంక దేని గురించి రాదు అని శైలేంద్ర రెచ్చగొట్టేలా మాట్లాడతాడు. కరెక్టేనా పిన్ని అనగా.. చాలా కరెక్టుగా చెప్పావ్ శైలేంద్ర. నాకు రిషి, కాలేజ్ రెండు వేర్వేరుగా కనిపించరని బదులిస్తుంది. ఇంతలో రిషి కలగజేసుకుంటూ బిల్డింగ్ వర్క్ గురించి డిస్కస్ చేద్దామని పిలుస్తాడు. దీంతో శైలేంద్ర నాకు తెలిసిన ఓ బిల్డర్ ఉన్నాడు.. పిలవమంటావా అని శైలేంద్ర అనగా.. పిలువు అన్నయ్య అని రిషి అంటాడు.

జగతీ కలగజేసుకుని ఎందుకు రిషి.. పాత బిల్డరు ఉన్నాడుగా.. అతడినే సంప్రదించవచ్చుకదా అని అంటుంది. లేదు మేడమ్ అన్నయ్యకు తెలిసిన వ్యక్తి అయితే నమ్మకంగా పనిచేస్తాడు కదా అని జగతీతో అంటాడు రిషి. అనంతరం ముగ్గురు అక్కడ నుంచి వెళ్తారు.

సీన్ కట్ చేస్తే ఇంట్లో రిషి-వసులు ఏదో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో శైలేంద్ర ఎంట్రీ ఇస్తాడు. వసుకు పని భారం ఎక్కువవుతుందని, కాస్త నాకు కూడా ఇవ్వు అంటాడు. ఇందుకు రిషి స్పందిస్తూ.. ఎవరిని గురించి ఏం మాట్లాడుతున్నావ్.. ఎంతటి కష్టమైన పనైనా వసు సునాయసంగా చేసేస్తుందని వసు గురించి పొగడ్తలు కురిపిస్తాడు. ఈ విషయంలో మనం వసుధార గురించి కంగారు పడాల్సిన పనిలేదు అంటాడు. నాకు ఏదైనా పని ఇవ్వమని శైలేంద్ర అడుగుతాడు. నీకెందుకులే అన్నయ్య అని రిషి అన్నప్పటికీ.. ఖాళీగా ఉంటే నాకు ఏవో పిచ్చి ఆలోచనలు వస్తున్నాయని, నాకు ఏదైనా పని ఇవ్వమని శైలేంద్ర పదే పదే అడుగుతాడు. సరే అన్నయ్య అంటూ రిషి అందుకు అంగీకరిస్తాడు.

రిషిని నిరుత్సాపరచడానికి ప్రయత్నించిన శైలేంద్ర..

ఫ్రీ మెడికల్ ఎడ్యూకేషన్ పక్కాగా అమలు కావాలని రిషి అనగా.. అది చాలా కష్టం రిషి.. మెడికల్ కాస్ట్‌లీ విద్య అది నువ్వెలా ఫ్రీగా ఇస్తావ్ అంటాడు. నేను ఆల్రెడీ చెప్పానుగా డాక్టర్స్ మేక్స్ డాక్టర్స్ అనే మార్గం ఉందని చెబుతాడు. లేదు రిషి.. నాకెందుకు సాధ్యపడదని, మాట వరుసకు అంటారు కానీ.. చేసేటప్పుడు వెనకడుగు వేస్తారని శైలేంద్ర నిరుత్సాపరుస్తాడు. లేదు అన్నయ్య నేను చాలా మందితో మాట్లాడాను వారందరూ నన్ను మెచ్చుకున్నారు. ఇది సాధ్యపడుతుందని, మీరు వర్రీ కావొద్దని.. అవన్నీ నేను చూసుకుంటాను అని అంటాడు. అనంతరం శైలేంద్ర కూడా నువ్వు అనుకున్నది చేయి.. మేమంతా నీ వెనకే ఉంటాము అంటూ నటన ప్రదర్శిస్తాడు.

అనంతరం శైలేంద్ర.. రేయ్ రిషి నువ్వు ఇక్కడే దొరికిపోయావు.. నువ్వు పేదవారికి ఫ్రీ ఎడ్యూకేషన్ ఇద్దామనుకుంటున్నావ్.. నేను అదే అవకాశంగా మార్చుకుంటాను అని అనుకుంటాడు. ఇంతలో ఫైల్ తీసుకుని జగతీ ఎంట్రీ ఇస్తుంది. రిషి ఇప్పుడే ఎందుకు వాటన్నింటి గురించి మాట్లాడుతున్నావ్ అని అడుగుతుంది. ఇందుకు శైలేంద్ర.. జగతీ మనసులో ఏముందో తెలుసుకోవాలని అనుకంటాడు. ఏమైంది పిన్ని అని ప్రశ్నిస్తాడు. ఏం లేదు శైలేంద్ర నీకు ఈ ఫీల్డ్‌లో అనుభవం లేదు కదా.. ఇప్పుడే చెప్పడం ఎందుకు? మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత తెలుసుకుంటే బాగుంటుందని అంటుంది. అదేముంది పిన్ని రిషి అన్నీ అర్థమయ్యేలా చెబుతాడు అంటాడు. అంతటితో ఆగకుండా పిన్నికి నువ్వంటే చాలా ఇష్టమని రిషికి పదే పదే గుచ్చుకునేలా మాట్లాడుతాడు. శైలేంద్ర ఆంతర్యం వసు-జగతీలకు అర్థమవడంతో అనుమానంగా చూస్తుంటారు.

జగతీని అమ్మ అని పిలవమని రిషికి చెప్పిన శైలేంద్ర

నీ ఆనందమే పిన్ని సంతోషమని, ప్రతి విషయంలోనూ నీకు వెన్నంటే ఉండి సపోర్ట్ చేస్తుంది. కొడుకు చేత అమ్మ అని పిలిపించుకోవాలని ఆరాట పడుతుంది తల్లి మనసు అంటూ రిషికి.. జగతీ అమ్మ అని గుర్తు చేస్తుంటాడు. ఆ విషయం రిషికి పెద్దగా నచ్చదని తెలిసి పదే పదే గుర్తు చేస్తుంటాడు. జగతీ-వసు కంగారు పడుతుంటారు. పిన్నిని నువ్వు మేడమ్ అని పిలవడం నాకు నచ్చలేదు రిషి.. తనను నువ్వు అమ్మ అని పిలవొచ్చు కదా అని రిషికి సూచిస్తాడు శైలేంద్ర. ఇంతలో జగతీ కలగజేసుకుని.. శైలేంద్ర ప్లీజ్ ఈ విషయంలో రిషిని ఇబ్బంది పెట్టవద్దు అని జగతీ అక్కడ నుంచి వెళ్లిపోతుంది. అనంతరం శైలేంద్ర కూడా రిషికి సారి చెప్పి అక్కడ నుంచి వెళ్లడంతో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.

IPL_Entry_Point