తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guntur Kaaram Record: గుంటూరు కారం ఆల్‌టైమ్ రికార్డు.. ఆ ఒక్క థియేటర్లోనే..

Guntur Kaaram Record: గుంటూరు కారం ఆల్‌టైమ్ రికార్డు.. ఆ ఒక్క థియేటర్లోనే..

Hari Prasad S HT Telugu

29 January 2024, 8:19 IST

    • Guntur Kaaram Record: గుంటూరు కారం మూవీ అరుదైన ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. సంక్రాంతికి రిలీజైన ఈ మూవీ సుదర్శన్ థియేటర్లో అత్యంత వేగంగా రూ.కోటి గ్రాస్ వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది.
గుంటూరు కారం మూవీలో మహేష్ బాబు
గుంటూరు కారం మూవీలో మహేష్ బాబు

గుంటూరు కారం మూవీలో మహేష్ బాబు

Guntur Kaaram Record: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం మూవీ ఓ ఆల్ టైమ్ రికార్డును సొంతం చేసుకుంది. మహేష్ కు కోటగా భావించే హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సుదర్శన్ 35 ఎంఎం థియేటర్లో అత్యంత వేగంగా రూ.కోటి గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసిన సినిమాగా నిలవడం విశేషం. ఈ థియేటర్లో ఆడిన అన్ని మహేష్ బాబు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు

Prime Video OTT Top Movies: ప్రైమ్ వీడియోలో టాప్‍కు దూసుకొచ్చిన యాక్షన్ మూవీ.. టాప్-10లో ఉన్నవి ఇవే

Vidya Vasula Aham OTT: నేరుగా ఓటీటీలోకి విద్యా వాసుల అహం సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు

The Goat Life OTT: పృథ్విరాజ్ సుకుమారన్ ‘ది గోట్ లైఫ్’ ఓటీటీ రిలీజ్ ఆలస్యం.. స్ట్రీమింగ్‍కు వచ్చేది అప్పుడేనా?

OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న జర హట్కే జర బచ్కే మూవీ.. స్ట్రీమింగ్ తేదీ ఫిక్స్.. తెలుగులో కూడా..

గుంటూరు కారం రికార్డు

సంక్రాంతి సందర్భంగా రిలీజైన గుంటూరు కారం మూవీ సుదర్శన్ 35 ఎంఎం థియేటర్లో 17 రోజుల్లోనే రూ.కోటి గ్రాస్ వసూలు చేసింది. అత్యంత వేగంగా ఈ మార్క్ అందుకున్న సినిమాగా నిలిచింది. మహేష్ బాబుకు ఈ థియేటర్ ఎందుకంత స్పెషలో ఈ సినిమా మరోసారి నిరూపించింది. సుదర్శన్ 35 ఎంఎంలో రూ.కోటికిపైగా గ్రాస్ వసూలు చేసిన ఏడో సినిమా ఇది.

గతంలో మురారి (రూ.1.2 కోట్లు), ఒక్కడు (రూ.1.47 కోట్లు), అతడు (రూ.1.04 కోట్లు), పోకిరి (రూ.1.61 కోట్లు), మహర్షి (రూ.1 కోటి), సరిలేరు నీకెవ్వరు (రూ.1.06 కోట్లు) సినిమాలు కూడా రూ.కోటి కంటే ఎక్కువ వసూలు చేశాయి. అయితే వీటన్నింటిలో గుంటూరు కారం మూవీ మాత్రం అత్యంత వేగంగా కోటి గ్రాస్ వసూళ్లు సాధించడం విశేషం.

నిజానికి గుంటూరు కారం మూవీకి తొలి రోజు నుంచే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఈ మూవీ వసూళ్లపైనా విమర్శలు వచ్చాయి. నిర్మాత నాగవంశీ సినిమా కలెక్షన్లను ఎక్కువ చేసి చూపిస్తున్నాడని అన్నారు. అయితే ఈ మూవీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాతో తమకు కూడా లాభాలు వచ్చినట్లు కృష్ణా జిల్లా డిస్ట్రిబ్యూటర్ కూడా చెప్పాడు.

ఈ సినిమాలో మహేష్ బాబుతోపాటు శ్రీలీల, మీనాక్షి చౌదరి, రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్ లాంటి వాళ్లు నటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ కాంబినేషన్ లో వచ్చిన మూడో మూవీ ఇది. గతంలో అతడు, ఖలేజా మూవీస్ వచ్చాయి. ఇక ప్రస్తుతం మహేష్ తన తర్వాతి సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. ఇది డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో రానుంది.

ఈ మూవీ స్క్రిప్ట్ పని పూర్తయిందని ఈ మధ్యే రైటర్ విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. సినిమా షూటింగ్ మార్చిలో ప్రారంభం కావచ్చని భావిస్తున్నారు. ఇండియానా జోన్స్ లాగా ఈ మూవీ ఉండబోతోందని ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీని పాన్ వరల్డ్ లెవల్లో తీయాలని రాజమౌళి భావిస్తున్నాడు. దీంతో మహేష్ కెరీర్లో అతి భారీ బడ్జెట్ తో రానున్న సినిమాగా ఇది నిలవనుంది.

ఈ సినిమా కోసం మహేష్ ఈ మధ్యే జర్మనీ వెళ్లాడు. అయితే మహేష్, రాజమౌళి సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మామూలుగానే జక్కన్న తన సినిమాకు చాలా ఎక్కువ టైమ్ తీసుకుంటాడు. ఆ లెక్కన ఎస్ఎస్ఎంబీ29 ఇప్పట్లో వచ్చే అవకాశాలైతే లేవనే చెప్పాలి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం