తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Family Star First Song: ఫ్యామిలీ స్టార్ సందడి షురూ.. మెలోడియస్ సాంగ్ ప్రోమో రిలీజ్.. ‘ఇంకేం.. ఇంకేం కావాలే’ కాంబో రిపీట్

Family Star First Song: ఫ్యామిలీ స్టార్ సందడి షురూ.. మెలోడియస్ సాంగ్ ప్రోమో రిలీజ్.. ‘ఇంకేం.. ఇంకేం కావాలే’ కాంబో రిపీట్

05 February 2024, 22:09 IST

    • Family Star First Song - Nandanandanaa: ఫ్యామిలీ స్టార్ సినిమా నుంచి సర్‌ప్రైజ్ వచ్చింది. ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది. ఫుల్ సాంగ్ డేట్‍ను కూడా మూవీ టీమ్ వెల్లడించింది.
Family Star First Song: ఫ్యామిలీ స్టార్ సందడి షురూ.. మెలోడియస్ సాంగ్ ప్రోమో రిలీజ్
Family Star First Song: ఫ్యామిలీ స్టార్ సందడి షురూ.. మెలోడియస్ సాంగ్ ప్రోమో రిలీజ్

Family Star First Song: ఫ్యామిలీ స్టార్ సందడి షురూ.. మెలోడియస్ సాంగ్ ప్రోమో రిలీజ్

Family Star First Song: రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా సందడి మొదలైంది. ఏప్రిల్ 5వ తేదీన ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు మూవీ టీమ్ ఇటీవలే పేర్కొంది. అయితే, ఇప్పటి నుంచే ఈ సినిమాకు బజ్ తెచ్చేందుకు రెడీ అయింది. గోతగీవిందం తర్వాత విజయ్ - దర్శకుడు పరశురాం కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఫ్యామిలీ స్టార్ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రెడీ అయింది. ‘నందనందనా’ అంటూ ఈ పాట ఉండనుంది. ఈ సాంగ్ ప్రోమో నేడు (ఫిబ్రవరి 5) రిలీజ్ అయింది.

ట్రెండింగ్ వార్తలు

Heeramandi 2: హీరామండి వెబ్ సిరీస్‍ రెండో సీజన్ వస్తుందా? డైరెక్టర్, యాక్టర్ ఏం చెప్పారంటే..

OTT Web Series: నేహా శర్మ పాపులర్ వెబ్ సిరీస్ మూడో సీజన్ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు

Devara Fear Song: దేవర నుంచి వచ్చేసిన ఫియర్ సాంగ్.. పవర్‌ఫుల్‍గా ఫస్ట్ పాట: చూసేయండి

Adivi Sesh: హనీమూన్ ఎక్స్‌ప్రెస్ వదిలిన అడవి శేష్.. అన్నపూర్ణ ఏడెకరాల ప్రాంగణంలో అప్డేట్

ఫ్యామిలీ స్టార్ సినిమా నుంచి నందనందనా అంటూ ఈ పాట మెలోడియస్‍గా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ మరోసారి హృదయాన్ని హత్తుకునే ట్యూన్ ఇచ్చారని ఈ ప్రోమోను చూస్తే అర్థమవుతోంది. నందనందనా అనే హమ్మింగ్ ఆకట్టుకునేలా ఉంది. హీరోహీరోయిన్లు విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ ఈ ప్రోమోలో కనిపించారు. ఈ పాటను సిద్ధ్ శ్రీరామ్ పాడారని టీమ్ వెల్లడించింది. అనంత్ శ్రీరామ్ లిరిక్స్ రాశారు.

ఫుల్ సాంగ్ ఎప్పుడంటే..

ఫ్యామిలీ స్టార్ నుంచి ‘నందనందనా’ ఫుల్ పాట ఫిబ్రవరి 7న రానుంది. ఈ విషయాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రకటించింది. “ఫ్యామిలీ స్టార్ మ్యూజికల్ అడ్వెంచర్ ఓ మైమరిపించే మెలోడీతో మొదలుకానుంది. నందనందనా ప్రోమో వచ్చేసింది. పూర్తి పాట ఫిబ్రవరి 7వ తేదీన మీ ముందుకు రానుంది” ట్వీట్ చేసింది.

ఆ కాంబో మళ్లీ..

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన గీతగోవిందం (2018) సినిమాలో ‘ఇంకేం.. ఇంకేం కావాలే’ పాట ఏ స్థాయిలో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పాటతో ఆ సినిమాకు ఫుల్ క్రేజ్ వచ్చింది. గోపీ సుందర్ స్వరపరిచిన ఆ పాటను సిద్ధ్ శ్రీరామ్ ఆలపించారు.

అనంత్ శ్రీరామ్ రిలిక్స్ అందించారు. డైరెక్టర్ పరుశురామ్ టేకింగ్ కూడా సరిగ్గా సరిపోయింది. దీంతో ఆ సాంగ్ ఫుల్ హిట్ అయింది. అయితే, ఫ్యామిలీ స్టార్‌లో ‘నందనందనా’ పాటకు అదే కాంబో రిపీట్ అవుతోంది. ఈ సాంగ్‍కు గోపీసుందర్ ట్యూన్స్ ఇవ్వగా.. సిద్ధ్ శ్రీరామ్ పాట పాడారు. అనంత్ శ్రీరామ్ సంగీతం అందించారు. ‘ఇంకేం.. ఇంకేం కావాలే’ కాంబో మళ్లీ రిపీట్ అవుతోంది. మరి.. ‘నందనందనా’ ఆ రేంజ్‍లో ఆకట్టుకుంటుందేమో చూడాలి.

ఫ్యామిలీ స్టార్ సినిమాలో విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో పిల్లల తండ్రిగా పక్కా ఫ్యామిలీ మ్యాన్‍లా విజయ్ కనిపించనున్నారు. గ్లింప్స్‌లో ఉన్న ‘ఐరనే వంచాలా ఏంటి’ అనే డైలాగ్ బాగా ఫేమస్ అయింది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకేటశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.

ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర పార్ట్-1 వాయిదా పడడం ఖాయం కావటంతో ఇటీవలే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది ఫ్యామిలీ స్టార్. ఏప్రిల్ 5వ తేదీన ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ముందుగా సంక్రాంతికే తీసుకొస్తామని ప్రకటించగా.. అప్పటికి సిద్ధం కాకపోవడంతో వాయిదా పడింది. ఎట్టకేలకు ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం