తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Eagle 3 Days Box Office Collections: ఇది మాసోడి జాతర.. ఈగల్ మూడు రోజుల బాక్సాఫీస్ కలెక్షన్లు ఇవీ

Eagle 3 days box office collections: ఇది మాసోడి జాతర.. ఈగల్ మూడు రోజుల బాక్సాఫీస్ కలెక్షన్లు ఇవీ

Hari Prasad S HT Telugu

12 February 2024, 13:55 IST

    • Eagle First Week end box office collections: మాస్ మహారాజ రవితేజ నటించిన ఈగల్ మూవీ మూడు రోజుల బాక్సాఫీస్ కలెక్షన్లను మూవీ టీమ్ అధికారికంగా రిలీజ్ చేసింది. ఇది మాసోడి జాతర అంటూ సోషల్ మీడియాలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలెక్షన్ల వివరాలు షేర్ చేసింది.
ఈగల్ మూడు రోజుల బాక్సాఫీస్ కలెక్షన్లు ఇవీ
ఈగల్ మూడు రోజుల బాక్సాఫీస్ కలెక్షన్లు ఇవీ

ఈగల్ మూడు రోజుల బాక్సాఫీస్ కలెక్షన్లు ఇవీ

Eagle First Week end box office collections: టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటించిన ఈగల్ మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తూనే ఉంది. తొలి రోజే సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినా.. కలెక్షన్లు మాత్రం బాగానే ఉన్నాయి. మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.30 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధికారికంగా వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు

Prime Video OTT Top Movies: ప్రైమ్ వీడియోలో టాప్‍కు దూసుకొచ్చిన యాక్షన్ మూవీ.. టాప్-10లో ఉన్నవి ఇవే

Vidya Vasula Aham OTT: నేరుగా ఓటీటీలోకి విద్యా వాసుల అహం సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు

The Goat Life OTT: పృథ్విరాజ్ సుకుమారన్ ‘ది గోట్ లైఫ్’ ఓటీటీ రిలీజ్ ఆలస్యం.. స్ట్రీమింగ్‍కు వచ్చేది అప్పుడేనా?

OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న జర హట్కే జర బచ్కే మూవీ.. స్ట్రీమింగ్ తేదీ ఫిక్స్.. తెలుగులో కూడా..

ఈగల్ బాక్సాఫీస్ కలెక్షన్లు ఇవీ

రవితేజ నటించిన ఈగల్ మూవీ గత శుక్రవారం (ఫిబ్రవరి 9) రిలీజైన విషయం తెలిసిందే. తొలి రోజే రూ.11 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లతో చెలరేగిన ఈగల్.. తర్వాతి రెండు రోజులు కూడా అదే దూకుడు కొనసాగించింది. మూడు రోజులు కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.30.6 కోట్లు వసూలు చేసినట్లు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సోషల్ మీడియా ఎక్స్ ద్వారా వెల్లడించింది.

"ఇది మాసోడి జాతర.. ఈగల్ మూవీ తొలి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.30 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఈ బ్లాక్ బస్టర్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ను మీకు దగ్గర్లోని థియేటర్లలో వెంటనే చూడండి" అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా లేటెస్ట్ కలెక్షన్ వివరాలతో ఓ స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. ఇందులో రవితేజ ఓ గన్నుపై చేయి పెట్టి రాజసంగా కూర్చొని ఉండటం చూడొచ్చు.

ఈగల్ సక్సెస్ మీట్

ఈగల్ మూవీ సక్సెస్ మీట్ ను ఆదివారం (ఫిబ్రవరి 11) నిర్వహించారు. ఇందులో రవితేజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. "ఈగల్ మూవీకి ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్‌కు చాలా ఆనందంగా ఉంది.

నా పాత్ర మేకోవర్‌కి చాలా మంచి ప్రశంసలు వస్తున్నాయి. కార్తిక్ ఈ కథ చెప్పినప్పుడే ఆ క్యారెక్టర్‌కి చాలా ఎగ్జయిట్ అయ్యాను. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి అభినందనలు. హరీష్ శంకర్‌తో వచ్చే మిస్టర్ బచ్చన్‌తో హ్యాట్రిక్ కొడుతున్నాం" అని రవితేజ అన్నాడు.

ఈగల్ ఎలా ఉందంటే?

ఈగ‌ల్ స్టైలిష్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ. గ్యాంగ్‌స్ట‌ర్ మూవీకి చిన్న‌పాటి సోష‌ల్ మేసేజ్‌ను జోడించి డైరెక్ట‌ర్ కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని ఈ మూవీని తెర‌కెక్కించాడు. ర‌వితేజ‌కు మాస్‌లో ఉన్న ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని హీరోయిజం, ఎలివేష‌న్స్‌తో ద‌ర్శ‌కుడు గ‌ట్టెక్కాల‌ని అనుకున్నారు. అందుకు త‌గ్గ‌ట్లే ఫ‌స్ట్ హాఫ్ మొత్తం సాగుతుంది.

సెకండాఫ్‌లో ఒక్కో ట్విస్ట్‌ను రివీల్ చేస్తూ వెళ్లాడు. స‌హ‌దేవ‌వ‌ర్మ‌, ర‌చ‌న ప్రేమాయ‌ణాన్ని అందంగా చూపించారు. కాంట్రాక్ట్ కిల్ల‌ర్‌గా ఉన్న స‌హ‌దేవ‌వ‌ర్మ ఇండియాకు వ‌చ్చిన ఆక్ర‌మ ఆయుధాల వ్యాపారాన్ని ఎందుకు అడ్డుకోవాల‌నుకున్న‌ది ఎమోష‌న‌ల్ సీన్‌తో క‌న్వీన్సింగ్‌గా ఆవిష్క‌రించారు.

స‌హ‌దేవ వ‌ర్మ‌గా ర‌వితేజ స్టైలిష్‌గా క‌నిపించాడు. ర‌వితేజ ఎలివేష‌న్స్‌, యాక్ష‌న్ సీన్స్‌లో అత‌డి ఎన‌ర్జీ మెప్పిస్తుంది. డైలాగ్ డెలివ‌రీ కొత్త‌గా ఉంది. న‌ళినీరావు అనే జ‌ర్న‌లిస్ట్‌గా అనుప‌మ యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్ర చేసింది. ర‌చ‌న‌గా కావ్య థాప‌ర్ సినిమాలో క‌నిపించేది త‌క్కువ టైమే. ర‌వితేజ‌తో ఆమె కెమిస్ట్రీ బాగుంది. ర‌వితేజ అసిస్టెంట్‌గా న‌వ‌దీప్‌తోపాటు మ‌ధుబాల, శ్రీనివాస అవ‌స‌రాల ప్ర‌తి ఒక్క పాత్ర‌ను ఇంట్రెస్టింగ్‌గా డైరెక్ట‌ర్ రాసుకున్నాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం