తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sabari Movie: వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ త‌ప్ప ఇలాంటి రోల్ చేసే హీరోయిన్లు క‌నిపించ‌లేదు - శ‌బ‌రి డైరెక్ట‌ర్ కామెంట్స్‌

Sabari Movie: వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ త‌ప్ప ఇలాంటి రోల్ చేసే హీరోయిన్లు క‌నిపించ‌లేదు - శ‌బ‌రి డైరెక్ట‌ర్ కామెంట్స్‌

30 April 2024, 13:21 IST

  • Sabari Movie: వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ సింగిల్ సిట్టింగ్‌లోనే శ‌బ‌రి మూవీ క‌థ‌కు ఒకే చెప్పింద‌ని ద‌ర్శ‌కుడు అనిల్ కాట్జ్ అన్నాడు. శ‌బ‌రి బ‌డ్జెట్ పెర‌గ‌డానికి గ‌ల కారాణాల్ని అనిల్ కాట్జ్ రివీల్ చేశాడు.

శ‌బ‌రి మూవీ
శ‌బ‌రి మూవీ

శ‌బ‌రి మూవీ

Sabari Movie: వరలక్ష్మీ శరత్ కుమార్ హీరోయిన్ న‌టించిన తెలుగు మూవీ శ‌బ‌రి మే 3న పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ అవుతోంది. బి గోపాల్, ఏఎస్ రవికుమార్ చౌదరి, మదన్ దగ్గర పలు చిత్రాలకు ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన అనిల్ కాట్జ్ 'శబరి' సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కితోన్న శ‌బ‌రి మూవీ గురించి ప్ర‌మోష‌న్స్‌లో ద‌ర్శ‌కుడు అనిల్ కాట్జ్‌ ప‌లు ఇంట్రెస్టింగ్ విష‌యాల్ని వెల్ల‌డించారు. అవి ఏమిటంటే?

ట్రెండింగ్ వార్తలు

Devara fear song promo: దేవర ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ ప్రోమో చూశారా.. అదిరిపోయిన బీజీఎం

Suresh Babu on Theatres: ఓటీటీ మమ్మల్ని దెబ్బ కొడుతోంది.. థియేటర్లలను ఫంక్షన్ హాల్స్‌గా మార్చాల్సిందే: సురేశ్ బాబు

Prabhas Instagram Story: ప్రభాస్ పెళ్లి కాదు.. అతని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వెనుక అసలు విషయం ఇదీ

Preminchoddu: షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడు.. మూడేళ్లు కష్టపడి సినిమా తీశాడు.. హీరో కామెంట్స్

ప్రేమ‌లో నిజాయితీ ఉంటుంది...

నాలుగైదేళ్ల క్రితం శ‌బ‌రి మూవీ చేయాల‌నే ఆలోచన వచ్చింది. ప్రాణానికి మించి మనం దేనిని అయినా ప్రేమిస్తే... అది ప్రాణం తీసేంత ద్వేషంగా మారే అవకాశం ఉంది అన్న‌దే శ‌బ‌రి ద్వారా నేను చెబుదామనుకున్న పాయింట్. తల్లి కుమార్తె ప్రేమ నేపథ్యంలో ఈ పాయింట్ చెబితే బావుంటుందని శ‌బ‌రి కథ రాసుకున్నా.

శ‌బ‌రి టైటిల్‌...

రామాయణం ఇతిహాసాన్ని తీసుకుంటే శబరికి రాముడు సొంత కొడుకు కాదు. ఆయన వస్తారని ఎన్నో ఏళ్లు ఎదురు చూసింది. రుచిగా ఉన్న ఫలాలు మాత్రమే ఇవ్వాలని, ఒకవేళ ఆ ఫలాల వల్ల ప్రమాదం ఉందేమోనని ఎంగిలి చేసి రాముడికి ఇస్తుంది శ‌బ‌రి.

ఆవిడ ప్రేమలో ఓ నిజాయతీ ఉంది. శ‌బ‌రి మూవీలోని ప్రధాన పాత్రలో ఈ లక్షణాలు అన్నీ ఉన్నాయి. త‌ల్లి అనుబంధంతో సాగే ఈ క‌థ‌కు శ‌బ‌రి టైటిల్ అయితేనే స‌రిపోతుంద‌ని అనిపించింది. శబరి అంటే సంస్కృతంలో 'ఆడ పులి' అని అర్థం. . అందుకని..ఆ టైటిల్ పెట్టాను.

ఒకే త‌ర‌హా ఇమేజ్‌కు ప‌రిమితం కాకుండా...

స్త్రీ ప్రధాన పాత్రల్లో చేయగల సత్తా ఉన్న ఆరిస్టులు ఇండియాలో తక్కువ మంది ఉన్నారు. ఆ కొందరిలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ ఒక‌రు. ఒకే త‌ర‌హా ఇమేజ్‌కు ప‌రిమితం కాకుండా హీరోయిన్‌గా న‌టిస్తూనే 'పందెం కోడి 2, తార తప్పటై, విక్రమ్ వేద, సర్కార్ వంటి సినిమాల్లో డిఫ‌రెంట్ రోల్స్ చేశారు.

విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా క‌నిపించారు. ఆమె ఆఫ్ స్క్రీన్ క్యారెక్టరైజేషన్ నచ్చింది. నేను చెప్పిన క‌థ న‌చ్చి సింగిల్ సిట్టింగ్ లో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ శ‌బ‌రి సినిమాను ఓకే చేశారు. క‌థ‌లో పెద్దగా మార్పులు చేర్పులు ఏమీ చెప్పలేదు.

వరలక్ష్మి గారు డైరెక్టర్స్ ఆర్టిస్ట్. ఆవిడ డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో ప‌నిచేశారు కనుక కెమెరా, షాట్స్ గురించి చాలా అవగాహన ఉంటుంది. క‌థ‌, సీన్స్ గురించి ఎక్కువ వివరించాల్సిన అవసరం ఉండదు. ఒక్క‌సారి చెబితే ఈజీగా చేసుకుంటూ వెళ్లిపోతారు.

శశాంక్…గణేష్ వెంకట్రామన్…

వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ ఈ సినిమాను అంగీక‌రించార‌ని తెలిసిన త‌ర్వాతే నిర్మాత మ‌హేంద్ర‌నాథ్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయ‌డానికి అంగీక‌రించాడు. శ‌బ‌రిలో వరలక్ష్మి శరత్ కుమార్ కుమార్తెగా బేబీ నివేక్ష నటించారు. . ప్రేక్షకులకు రిప్రజెంటేషన్ తరహా పాత్ర‌లో శ‌శాంక్ క‌నిపిస్తాడు. గణేష్ వెంకట్రామన్ మ‌రో మెయిన్ రోల్ చేశాడు.

బ‌డ్జెట్ పెరిగింది...

శ‌బ‌రి కథ రాసేటప్పుడు హిల్ స్టేషన్ బ్యాక్ డ్రాప్ అనుకున్నా. థ్రిల్లర్ సినిమాల్లో హిల్ స్టేషన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తుంది. వైజాగ్‌లో ఈ సినిమాను షూట్ చేయాల‌ని అనుకున్నాం. కానీ అక్క‌డి ప‌రిస్థితులు అంత‌గా బాగాలేక‌పోవ‌డంతో కొడైకెనాల్ వెళ్లాం. అందువల్ల కొంత బడ్జెట్ ఎక్కువైంది.

'హనుమాన్' వంటి సినిమాలకు బడ్జెట్ ఎక్కువైనా విజయం సాధించిన తర్వాత అందరూ హ్యాపీ. అలాంటి రిజ‌ల్ట్ మా సినిమాకు వ‌స్తుంద‌ని న మ్ముతున్నాం.కథలో యూనివర్సల్ అప్పీల్ ఉండ‌టంతో పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో రిలీజ్ చేస్తున్నాం. శ‌బ‌రి మూవీ మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని నమ్ముతున్నా. ఇది థ్రిల్లర్ మాత్రమే కాదు... చాలా ఎమోషన్స్ ఉంటాయి.. అని ద‌ర్శ‌కుడు అనిల్ కాట్జ్ చెప్పాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం