Sabari Song: తల్లి ప్రేమ చూపించేలా శబరి పాట రిలీజ్.. నా చెయ్యి పట్టుకోవే సాంగ్ లిరిక్స్ ఇవే!-varalaxmi sarathkumar sabari movie na cheyyi pattukove lyrical song released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sabari Song: తల్లి ప్రేమ చూపించేలా శబరి పాట రిలీజ్.. నా చెయ్యి పట్టుకోవే సాంగ్ లిరిక్స్ ఇవే!

Sabari Song: తల్లి ప్రేమ చూపించేలా శబరి పాట రిలీజ్.. నా చెయ్యి పట్టుకోవే సాంగ్ లిరిక్స్ ఇవే!

Sanjiv Kumar HT Telugu
Published Apr 23, 2024 06:19 AM IST

Sabari Song Na Cheyyi Pattukove Release: హనుమాన్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ నటించిన పాన్ ఇండియా సినిమా శబరి. ఈ సినిమా నుంచి బిడ్డపై తల్లి ప్రేమ, అనురాగం చూపించే నా చెయ్యి పట్టుకోవే లిరికల్ సాంగ్ రిలీజైంది. మరి ఈ పాట లిరిక్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

తల్లి ప్రేమ చూపించేలా శబరి పాట రిలీజ్.. నా చెయ్యి పట్టుకోవే సాంగ్ లిరిక్స్ ఇవే!
తల్లి ప్రేమ చూపించేలా శబరి పాట రిలీజ్.. నా చెయ్యి పట్టుకోవే సాంగ్ లిరిక్స్ ఇవే!

Sabari Song Na Cheyyi Pattukove Lyrics: వెర్సటైల్ ఆర్టిస్ట్ వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'శబరి'. ఈ చిత్రాన్ని మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. అనిల్ కాట్జ్ దర్శకుడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేశారు.

తాజాగా శబరి సినిమా నుంచి 'నా చెయ్యి పట్టుకోవే..' పాటను విడుదల చేశారు. 'శబరి'ని పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్న విషయం ప్రేక్షకులకు తెలిసిందే. ఈ పాటను సైతం తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళం ఇలా ఐదు భాషల్లో విడుదల చేశారు. 'శబరి' మూవీకి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. ఆయన స్వరపరిచిన బాణీకి తెలుగులో రహమాన్ సాహిత్యం అందించారు. ఈ పాటను అమృతా సురేష్ పాడారు.

'శబరి మ్యూజిక్' ఛానల్ ద్వారా నా చెయ్యి పట్టుకోవే లిరికల్ సాంగ్ విడుదలైంది. మరి అమ్మ ప్రేమన తలిపించేలా ఉన్న ఈ సాంగ్ లిరిక్స్ చూద్దాం.

'నా చెయ్యి పట్టుకోవే చిన్నారి మైనా...

మబ్బుల్లో తేలిపోదా రివ్వు రివ్వునా...

ఓ కొత్త లోకం చేరి తుళ్లి తుళ్లి ఆడుకుందాం ఎంతసేపైనా

నువ్వేమి కోరుకున్నా తెచ్చి ఇవ్వనా...

ఆ నింగి చుక్కలన్నీ తెంచి ఇవ్వనా...

తందానా తాళం వేసి నచ్చిందేదో పాడుకుంటూ

చిందేసి సందడి చేద్దాం కన్నా' అంటూ సాగిందీ గీతం.

ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ కుమార్తెగా నటించిన నివేక్ష మీద ఈ పాటను తెరకెక్కించారు. కొడైకెనాల్ కొండల్లో అందమైన ప్రదేశాల్లో ఈ పాట చిత్రీకరణ చేశారు. తల్లీ కూతుళ్లు ఇద్దరూ విహార యాత్రకు వెళ్లే సమయంలో పాట వస్తుందని విజువల్స్ చూస్తుంటే అర్థం అవుతోంది.

'నా చెయ్యి పట్టుకోవే...' సాంగ్ విడుదలైన సందర్భంగా నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల స్పీచ్ ఇచ్చారు. ''ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభించింది. వరలక్ష్మీ శరత్ కుమార్ గారి నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణ. తల్లిగా ఆమె నటించిన తీరు, కుమార్తె కోసం పడే తపన ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది'' అని నిర్మాత మహేంద్రనాథ్ అన్నారు.

''వరలక్ష్మీ శరత్ కుమార్ గారు తొలిసారి ఓ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా చేశారు. తల్లీ కుమార్తె మధ్య సన్నివేశాలు అందర్నీ ఆకట్టుకుంటాయి. కథలో కీలకమైన సందర్భంలో ఈ సాంగ్ వస్తుంది. భావోద్వేగాలతో కూడిన సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. మే 3న పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల చెప్పారు.

శబరి సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్‌తోపాటు గణేష్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపి, సునయన, రాజశ్రీ నాయర్, మధునందన్, రషిక బాలి (Bombay), వైవా రాఘవ, ప్రభు, భద్రం, కృష్ణతేజ, బిందు పగిడిమర్రి, ఆశ్రిత వేముగంటి, హర్షిని కోడూరు, అర్చన అనంత్, ప్రమోదిని, బేబీ నివేక్ష, బేబీ కృతిక తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

Whats_app_banner