తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dhamaka Controversy: ముగిసిన ధమాకా వివాదం.. ఉప్పర కులస్తులకు క్షమాపణలు చెప్పిన డైరెక్టర్

Dhamaka Controversy: ముగిసిన ధమాకా వివాదం.. ఉప్పర కులస్తులకు క్షమాపణలు చెప్పిన డైరెక్టర్

22 December 2022, 16:19 IST

    • Dhamaka Controversy: ఇటీవల జరిగిన ధమాకా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆ చిత్ర దర్శకుడు త్రినాథరావు నక్కిన చేసిన వ్యాఖ్యలపై ఉప్పర కులస్తులు మండిపడ్డారు. వెంటనే ఆందోళనకు దిగడంతో సదరు దర్శకుడు క్షమాపణలు చెప్పారు.
ధమాకా వివాదం
ధమాకా వివాదం

ధమాకా వివాదం

Dhamaka Controversy: మాస్ మహారాజా రవితేజ నటించిన సరికొత్త చిత్రం ధమాకా. ప్రస్తుతం ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సదరు చిత్ర దర్శకుడు త్రినాథరావు నక్కిన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆ వేడుకలో ఆయన ఉప్పర లొల్లి అనే పదం వాడటంతో.. ఆ కులానికి చెందిన కొంతమంది ఆందోళనకు దిగారు. ఈ అంశంపై ధమాకా దర్శకుడు స్పందించారు. ఈ విధంగా మాట్లాడినందుకు తన పదాలను వెనక్కి తీసుంటున్నాని చెబుతూ ఉప్పర కులస్తులకు క్షమాపణలు చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

Vazhakku: హీరోతో గొడవ.. సినిమాను నేరుగా వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‍ఫామ్‍లో రిలీజ్ చేసిన డైరెక్టర్

Sharathulu Varthisthai OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Double iSmart Teaser Time: డబుల్ ఇస్మార్ట్ సినిమా టీజర్ రిలీజ్‍కు టైమ్ ఖరారు

Salman Khan: సల్మాన్ ఖాన్ ఆ గుడికి వచ్చి క్షమాపణ అడగాలి.. అలాంటి తప్పు మళ్లీ చేయనని ప్రమాణం చేయాలి: బిష్ణోయ్ సమాజం

గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన త్రినాథరావు ఈ సందర్భంగా క్షమాపణలు చెప్పారు. "ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నేను ఉప్పర అనే పదం వాడాను. అది తెలిసి చేయలేదు. తెలియక జరిగిన తప్పునకు ఉప్పర సోదరులకు క్షమాపణలు చెబుతున్నాను. రవితేజ అభిమానుల్లో ఉప్పర సోదరులు కూడా భాగమే. ఇక నుంచి నా సినిమాల్లో కూడా ఉప్పర అనే పదం వాడను. నాపై కోపాన్ని సినిమాపై చూపించకండి. నేను బీసీనే. ఉప్పర సోదరులు కూడా బీసీలో భాగమే. సినిమా ప్రేక్షకుల్లో మీరు భాగమే. నేను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను." అని ఆయన అన్నారు. ఉప్పర పదాన్ని సినీ నటులు, రాజకీయ నాయకులు కూడా బహిష్కరించాలని స్పష్టం చేశారు.

ఇటీవల జరిగిన ధమాకా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు త్రినాథరావు "నీ ఉప్పర లొల్లి ఎంటి" అని వ్యాఖ్యానించారు. దీంతో తమ మనోభావాలు దెబ్బతీశారంటూ ఉప్పర కులస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్ర దర్శకుడు వెంటనే క్షమాణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉప్పర సంఘం అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్ ఆధ్వర్యంలో బుధవారం నాడు ఫిల్మ్ ఛాంబర్ వద్ద ధర్నాకు దిగారు. ఆయనకు వ్యతిరేకంగా ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ అక్కడ బైఠాయించారు. ఆయన దిష్టి బొమ్మను కూడా తగులబెట్టారు.

ఉప్పర పదం వాడటంతో వివాదం చెలరేగడం ఇదే మొదటి సారి కాదు. గతంలో సినీ హీరో విశ్వక్ సేన్ కూడా ఈ పదం వాడటంతో అతడిపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. 2020 లాక్‌డౌన్ సమయంలో జనాలు బయటకు వచ్చి ముచ్చట్లు పెట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన విశ్వక్.. "కరోనా సమయంలో ఉప్పర మీటింగ్‌లు ఏంటి?" అంటూ వీడియో రూపంలో జనాలపై మండిపడ్డాడు. అనంతరం ఉప్పర కులస్తులు అతడికి వ్యతిరేకంగా ఆందోళన చేయడంతో క్షమాపణలు చెప్పాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం