తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Businessman Advance Bookings: రీరిలీజ్‌ అడ్వాన్స్ బుకింగ్స్‌లో బిజినెస్‌మ్యాన్ మూవీ సరికొత్త రికార్డు

Businessman advance bookings: రీరిలీజ్‌ అడ్వాన్స్ బుకింగ్స్‌లో బిజినెస్‌మ్యాన్ మూవీ సరికొత్త రికార్డు

Hari Prasad S HT Telugu

07 August 2023, 16:37 IST

    • Businessman advance bookings: రీరిలీజ్‌ అడ్వాన్స్ బుకింగ్స్‌లో బిజినెస్‌మ్యాన్ మూవీ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటి వరకూ ఏ రీరిలీజ్ మూవీకి దక్కని రికార్డు ఇది.
బిజినెస్‌మ్యాన్ మూవీలో మహేష్ బాబు
బిజినెస్‌మ్యాన్ మూవీలో మహేష్ బాబు

బిజినెస్‌మ్యాన్ మూవీలో మహేష్ బాబు

Businessman advance bookings: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బిజినెస్‌మ్యాన్ మూవీ రీరిలీజ్ కానున్న విషయం తెలుసు కదా. మహేష్ బర్త్ డే అయిన ఆగస్ట్ 9న ఈ మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా రీరిలీజ్ కు ముందే రికార్డులను తిరగరాసింది. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లోనే రికార్డు కలెక్షన్లు రాబట్టింది.

ట్రెండింగ్ వార్తలు

Swatantrya Veer Savarkar ott release date: స్వాతంత్య్ర వీర్ సావర్కర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ఆ ప్రత్యేకమైన రోజునే..

Gam Gam Ganesha Trailer: ఆనంద్ దేవరకొండ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

Payal Rajput: చిక్కుల్లో పాయల్ రాజ్‌పుత్.. నిర్మాతల మండలికి రక్షణ ప్రొడ్యూసర్ ఫిర్యాదు

Top 10 IMDb rating movies: ప్రపంచ సినిమాలో అత్యుత్తమ ఐఎండీబీ రేటింగ్ కలిగిన టాప్ 10 మూవీస్ ఇవే.. ఈ ఓటీటీల్లో చూడండి

ఇప్పటి వరకూ ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఒక్క హైదరాబాద్ లోనే రూ.కోటి దాటడం విశేషం. రీరిలీజ్ అయిన సినిమాల్లో ఇలా హైదరాబాద్ లోనే, అందులోనూ అత్యంత వేగంగా రూ.కోటి అడ్వాన్ బుకింగ్స్ వసూలు చేసిన తొలి సినిమా ఈ బిజినెస్‌మ్యాన్. దీనిని బట్టి మహేష్ కు ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

మహేష్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో 2012లో ఈ సినిమా రిలీజైంది. అప్పట్లో సంక్రాంతి సందర్భంగా రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.90 కోట్లు వసూలు చేసింది. అంతకు ఆరేళ్ల ముందు వీళ్ల కాంబినేషన్ లోనే వచ్చిన పోకిరి సినిమా ఎంత పెద్ద హిట్టయిందో తెలుసు కదా. బిజినెస్‌మ్యాన్ కూడా అదే రేంజ్ లో వసూళ్లతో దుమ్ము రేపింది.

అయితే ఇప్పుడు రీరిలీజ్ లోనూ ఈ సినిమాకు ఈ స్థాయి క్రేజ్ ఉండటం నిజంగా విశేషమే. మరోవైపు మహేష్ బాబు తన తర్వాతి సినిమా గుంటూరు కారంలో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఊహించని కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. వచ్చే ఏడాది జనవరి 13న సంక్రాంతి సందర్భంగా గుంటూరు కారం రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.

మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. అతడు, ఖలేజాలాంటి హిట్స్ అందుకున్న కాంబినేషన్ కావడంతో సహజంగానే గుంటూరు కారంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత రాజమౌళితో ఓ గ్లోబల్ లెవల్ సినిమా చేయబోతున్నాడు మహేష్ బాబు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం