తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Businessman Re Release: బిజినెస్‌మేన్ రీ రిలీజ్ క్రేజ్‌ - గంట‌లోనే టికెట్లు మొత్తం సేల్‌

Businessman Re Release: బిజినెస్‌మేన్ రీ రిలీజ్ క్రేజ్‌ - గంట‌లోనే టికెట్లు మొత్తం సేల్‌

HT Telugu Desk HT Telugu

01 August 2023, 13:46 IST

  • Businessman Re Release: మ‌హేష్‌బాబు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా బిజినెస్‌మేన్ సినిమా థియేట‌ర్ల‌లో రీ రిలీజ్ కానుంది. మంగ‌ళ‌వారం కొన్ని థియేట‌ర్స్‌లో బుకింగ్స్ ఓపెన్ చేయ‌గా గంట‌లోనే టికెట్స్ మొత్తం అమ్ముడుపోయాయి.

మ‌హేష్‌బాబు
మ‌హేష్‌బాబు

మ‌హేష్‌బాబు

Businessman Re Release: ఆగ‌స్ట్ 9న మ‌హేష్ బాబు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అభిమానుల‌కు కోసం ప‌లు స‌ర్‌ప్రైజ్‌లు సిద్ధ‌మ‌వుతోన్నాయి. గుంటూరు కారం ఫ‌స్ట్ సింగిల్‌తో పాటు మ‌హేష్ బాబు, రాజ‌మౌళి మూవీకి సంబంధించి అప్‌డేట్‌ను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. వీటితో పాటు మ‌హేష్‌బాబు బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ బిజినెస్‌మేన్ రీ రిలీజ్ కానుంది.

ట్రెండింగ్ వార్తలు

Srikanth on Rave Party: మొన్న నా భార్యతో విడాకులు ఇప్పించేశారు.. ఇప్పుడిలా.. వాడెవడో నాలాగే ఉన్నాడు కానీ..: శ్రీకాంత్

Deepika Padukone Baby Bump: దీపికా బేబీ బంప్.. భర్తతో కలిసి ఓటేయడానికి వస్తూ చూపించిన బ్యూటీ

Laapataa Ladies: అందరినీ ఆలోచింపజేసేలా మంజూ మాయ్ చెప్పిన పవర్‌ఫుల్ హార్డ్ హిట్టింగ్ డైలాగ్స్ ఇవి.. మిస్ అవకండి

Devara Fear Song Lyrics: దేవర మూవీ ఫియర్ సాంగ్ లిరిక్స్ ఇవే.. అదరగొడుతున్న అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్

పోకిరి త‌ర్వాత మ‌హేష్‌బాబు, డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబోలో 2012లో రిలీజైన ఈ మూవీ ఇండ‌స్ట్రీ రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. 40 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన బిజినెస్‌మేన్‌ 90 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. దాదాపు 11 ఏళ్ల త‌ర్వాత మ‌హేష్ బాబు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 9న ఈ సినిమా మ‌రోసారి థియేట‌ర్ల‌లో రీ రిలీజ్ కానుంది. తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవ‌ర్‌సీస్‌లో భారీ ఎత్తున బిజినెస్ మేన్ స్పెష‌ల్ షోస్‌ను ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మంగ‌ళ‌వారం ఓపెన్ అయ్యాయి. వైజాగ్‌లోని సంగం, శ‌ర‌త్ థియేట‌ర్స్‌లో మార్నింగ్ ఏడు గంట‌ల షోకు సంబంధించిన టికెట్స్ బుకింగ్స్‌ను ఓపెన్ చేయ‌గా గంట‌లోనే టికెట్లు మొత్తం అమ్ముడుపోయాయి. మిగిలిన ఏరియాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మంగ‌ళ‌వారం నుంచి ప్రారంభంకానున్నాయి.

దాదాపు మూడు వంద‌ల‌కుపైగా థియేట‌ర్ల‌లో బిజినెస్‌మేన్ రీ రిలీజ్ కానున్న‌ట్లు స‌మాచారం. బిజినెస్‌మేన్ సినిమాలో మ‌హేష్‌బాబు క్యారెక్ట‌రైజేష‌న్‌తో పాటు అత‌డి డైలాగ్ డెలివ‌రీ, మేన‌రిజ‌మ్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి.

ఈ సినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టించింది. 2012లో హ‌య్యెస్ట్ త‌మిళ్ గ్రాసింగ్ మూవీగా బిజినెస్‌మేన్ నిలిచింది. ఈ సినిమాకు త‌మ‌న్ సంగీతాన్ని అందించాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం